పోలీసు కస్టడీలో కుప్పం వైసీపీ లీడర్, చంద్రబాబుపై బాంబులు వేస్తా, ఏం చేస్తారు ?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కాన్వాయ్ పై అవసరమైతే బాంబులు కూడా వేస్తానని సంచలన వ్యాఖ్యలు చేసి రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపిన కుప్పం రెస్కో మాజీ చైర్మన్ సెంథిల్ కుమార్ కు ఇప్పుడు సినిమా కష్టాలు మొదలైనాయి. కుప్పం చెందిన వైసీపీ నాయకుడు సెంథిల్ కుమార్ ను రెండు రోజుల పాటు పోలీసు కస్టడీకి అప్పగిస్తూ న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది.
వైసీపీ ప్రభుత్వ హయాంలో కుప్పం గ్రామీణ విద్యుదీకరణ సంస్థ (రెస్కో)లో జరిగిన అవినీతి, అక్రమాలపై దర్యాప్తు చేస్తున్న పోలీసులు రెస్కో మాజీ చైర్మన్, వైసీపీ నాయకుడు సెంథిల్ కుమార్ ను విచారించి ఆ స్కామ్ కేసు వివరాలను బయటకు లాగడానికి సిద్ధం అయ్యారు. కుప్పం రెస్కో గత పాలకవర్గంలో అవినీతి, అక్రమాలు జరిగాయని రెస్కో ప్రస్తుత ఎండీ సోమశేఖర్ కుప్పం పోలీసులు ఫిర్యాదు చేశారు.

రెస్కోలో జరిగిన అవినీతి, అక్రమాలపై దర్యాప్తు జరిపి నిధులు దుర్వినియోగం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని రెస్కో ఎండీ సోమశేఖర్ ఫిర్యాదు చేయడంతో కుప్పం అర్బన్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇదే కేసులో తప్పించుకుని తమిళనాడు పారిపోయిన కుప్పం రెస్కో మాజీ చైర్మన్ సెంథిల్ కుమార్ కోసం పోలీసులు గాలించారు. చివరికి కొన్ని రోజుల కిత్రం కుప్పం పోలీసులు తమిళనాడు వెళ్లి రెస్కో మాజీ చైర్మన్ సెంథిల్ కుమార్ ను అరెస్టు చేశారు.
రెస్కో మాజీ చైర్మన్ సెంథిల్ కుమార్ ను కోర్టు ముందు హాజరు పరచడంతో ఈనెల 13వ తేదీ వరకు అతన్ని రిమాండ్ తరలించాలని న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఆదేశాలతో రెస్కో మాజీ చైర్మన్ సెంథిల్ కుమార్ ను మదనపల్లె సబ్ జైలుకు తరలించారు. మదనపల్లె సబ్ జైల్లో విచారణ ఖైదీగా శిక్ష అనుభవిస్తున్న సెంథిల్ కుమార్ ను విచారణ చేయడానికి కష్టడీకి ఇవ్వాలని కుప్పం అర్బన్ పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
కేసు వివరాలు తెలుసుకున్న న్యాయస్థానం రెస్కో మాజీ చైర్మన్ సెంథిల్ కుమార్ ను విచారణ చేయడానికి రెండు రోజుల పాటు కస్టడీకి తీసుకోవాలని అనుమతి ఇచ్చింది. కోర్టు ఆదేశాలతో మదనపల్లె సబ్ జైల్లో ఉన్న సెంథిల్ కుమార్ ను కుప్పం అర్బన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వైసీపీ నాయకుడు, రెస్కో మాజీ చైర్మన్ సింథిల్ కుమార్ ను కుప్పం తీసుకొస్తారని జోరుగా ప్రచారం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న వైసీపీ కార్యకర్తలు, ఆ పార్టీ నాయకులు కుప్పం అర్బన్ పోలీస్ స్టేషన్ ముందు గుమికూడారు.
పోలీస్ యాక్ట్ 30 అమలులో ఉందని, ఎవ్వరూ గుంపులు గుంపులుగా ఉండరాదని కుప్పం పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. పోలీసుల ఆదేశాలు అమలులో ఉన్నా వైసీపీ నాయకులు, కార్యకర్తలు కుప్పం పోలీస్ స్టేషన్ ఎదుట పెద్ద ఎత్తున గుమికూడటంతో వారిని అక్కడి నుండి వెళ్లిపోవాలని పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. పోలీసుల ఆదేశాలను పట్టించుకోకుండా వైసీపీ కార్యకర్తలు ఆందోళన చెయ్యడానికి సిద్దం కావడంతో కుప్పం పోలీసులు వైసీపీ కార్యకర్తలపై లాఠీచార్జ్ చేశారు.
వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో కుప్పంలో జరిగిన బహిరంగ సభలో అప్పటి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సమక్షంలో మాట్లాడిన సెంథిల్ కుమార్ అవసరం అయితే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కాన్వాయ్ పై బాంబులు వెయ్యడానికి తాను సిద్ధంగా ఉన్నానని అప్పటి రెస్కో చైర్మన్ సెంథిల్ కుమార్ బహిరంగలోనే మాట్లాడటం అప్పట్లో కలకలం రేపింది.
కుప్పం రెస్కో అవినీతికి సంబంధించిన కేసులో తప్పించుకుని తమిళనాడు పారిపోయిన సింథిల్ కుమార్ ను అదే తమిళనాడులో కుప్పం పోలీసులు అరెస్టు చేసి తరువాత జైలుకు పంపించారు. ఇప్పుడు కుప్పం రెస్కో స్కామ్ కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు సెంథిల్ కుమార్ ను అదుపులోకి తీసుకొని విచారణ చేసి ఆ స్కామ్ వాస్తవాలు బయటకు లాగడానికి సిద్ధం అయ్యారు. మొత్తం మీద జగన్ హయాంలో కుప్పంలో రెచ్యిపోయిన వైసీపీ నాయకులకు కౌంట్ డౌన్ మొదలైయ్యింది.
-
చంద్రబాబుకు జాతీయ పార్టీ నేత సవాల్: మణిపూర్ లా తయారవుతాయి -
అమరావతిలో క్వాంటమ్ రిఫరెన్స్ కేంద్రాల ప్రారంభం-దేశంలోనే తొలిసారి..! -
అడ్డంగా దొరికిన చంద్రబాబు? అంకెలతో తేల్చేసిన సజ్జల ..! -
అతిపెద్ద నిర్ణయాన్ని తీసుకోబోతున్నాం- తేల్చి చెప్పిన ప్రధాని మోదీ -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
కటౌట్ కు తగ్గ పర్ఫెక్ట్ ఫిల్మ్- టైటిల్ గూస్ బంప్స్: విజువల్ వండర్ -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా..












Click it and Unblock the Notifications