Tirumala: తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ..

కలియుగ వైకుంఠం తిరుమలలో భక్తుల రద్దీ భారీగా తగ్గింది. స్వామివారి దర్శనం త్వరగానే అవుతోంది. కంపార్ట్ మెంట్లు, క్యూలైన్లు దాదాపు ఖాళీగానే ఉన్నాయి. వచ్చిన భక్తులు వచ్చినట్లుగానే తిరుమల శ్రీవారిని దర్శించుకుంటున్నారు. సర్వదర్శనం త్వరగానే జరుగుతోంది. ఇక ప్రత్యక ప్రవేశ దర్శనం టికెట్లు ఉన్న భక్తులకు స్వామివారి దర్శనానికి గంట నుంచి 2 గంటల సమయం పడుతోంది.

తిరుమల శ్రీవారిని శనివారం రోజున 65 వేల 692 మంది దర్శించుకున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు. ఇందులో 24,575 మంది భక్తులు తలనీలాలు సమర్పించినట్లు పేర్కొన్నారు. శనివాం స్వామి హుండీ ఆదాయం రూ.3.78 కోట్లుగా వచ్చింది. సంక్రాంతి సందర్భంగా దాదాపు అందురు ఊళ్లకే పరిమితం కావడంతో తిరుమలలో భక్తుల రద్దీ తగ్గినట్లుగా అధికారులు చెబుతున్నారు. రెండు, మూడు రోజులు రద్ధీ సాధారణంగా ఉండే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

The crowd of devotees in Tirumala has reduced with Sankranti festival

మరోవైపు తిరుమలలో భోగీ సంబరాలు ప్రారంభమయ్యాయి. తిరుప‌తి శ్రీ గోవింద‌రాజస్వామివారి ఆల‌యంలో వద్ద టీటీడీ అధికారులు, ఉద్యోగులు, శ్రీవారి సేవకులు, భక్తులు భోగి మంటలు వేశారు. భోగీ పండుగ సందర్భంగా సాయంత్రం 5.30 నుండి రాత్రి 7 గంట‌ల వ‌ర‌కు శ్రీ ఆండాళ్‌ అమ్మవారు, శ్రీకృష్ణస్వామివారిని భోగితేరుపై కొలువుదీర్చి ఊరేగింపు నిర్వహిస్తారని టీటీడీ అధికారులు తెలిపారు.

శనివారం తిరుమలలో డ్రోన్ కలకలం రేగింది. ఘాట్‌రోడ్డు 53వ మలుపు వద్ద నిబంధనలకు విరుద్ధంగా డ్రోన్ సాయంతో అస్సాంకు చెందిన ఇద్దరు తిరుమల కొండలను వీడియో తీశారు. విషయం తెలుసుకున్న విజిలెన్స్ అధికారులు వారిని వెంటనే అదుపులోకి తీసుకున్నారు. తిరుమలోభద్రతా కారణాల దృష్ట్యా తిరుమలలో ఎటువంటి డ్రోన్లు ఉపయోగించేందుకు అనుమతిలేదని అధికారులు స్పష్టం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+