ఉద్యోగులకు శుభవార్త చెప్పిన జగన్ .. పని గంటలు తగ్గిస్తూ నిర్ణయం

Recommended Video

    AP ఉద్యోగులకు గుడ్ న్యూస్... పనిగంటలు తగ్గిస్తానన్న Y.S.Jagan!! | Oneindia Telugu

    జగన్ పాలనలో తన మార్కు చూపించాలని తహతహలాడుతున్నారు. ఏపీ సీఎంగా బాధ్యత చేపట్టక ముందే ఆయన రాష్ట్రంలో పాలనాపరమైన అనేక నిర్ణయాలను తీసుకుంటున్నారు. ఏపీలో ఉద్యోగులు పని వత్తిడితో సతమతం అవుతున్నారని భావించి వారి విషయంలో జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు.

    ఏపీ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన జగన్ ... పని భారం తగ్గించే నిర్ణయం

    ఏపీ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన జగన్ ... పని భారం తగ్గించే నిర్ణయం

    ఏపీలో ఉద్యోగులకు కాబోయే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గుడ్ న్యూస్ చెప్పనున్నారు. ఏపీలో పనిచేసే ఉద్యోగులకు పనిభారం తగ్గించాలని జగన్ నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 30వ తేదీన జగన్ ...ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న సంగతి అందరికీ తెలుసు ... ఇక తన పాలనలో తనదైన మార్క్ చూపించాలని జగన్ భావిస్తున్నారు. ఏపీలో ఉద్యోగులకు పని భారం ఎక్కువ అయ్యిందని భావిస్తున్న జగన్ ఉద్యోగుల మనోభావాలు తెలుసుకునే దిశగా జగన్ ప్రయత్నాలు ప్రారంభించారు.

    ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే పని గంటలు అని స్పష్టం చేసిన జగన్

    ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే పని గంటలు అని స్పష్టం చేసిన జగన్

    ఇప్పటికే ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే పని గంటలని స్పష్టం చేశారు. కాగా.. ఇది ఉద్యోగులకు నిజంగా శుభవార్తేనని చెప్పుకోవచ్చు. జగన్ నిర్ణయంతో ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.సాయంత్రం 6 తర్వాత ఉద్యోగులకు పని భారం ఉండకూడదని జగన్ ఆదేశించారు. ప్రతి ఫైల్‌కి నిర్దిష్ట గడువులోగా క్లియర్ చేసేలా పరిపాలన సంస్కరణలు తీసుకొస్తున్నారు జగన్ . ఫైల్స్‌పై అనవసరపు కొర్రీలు, జాప్యాలు లేకుండా చర్యలు తీసుకోవాలని ఉద్యోగులు, అధికారులను జగన్ ఆదేశించినట్లు తెలుస్తోంది. ఉద్యోగులపై క్రమశిక్షణ చర్యలలో కూడా సంస్కరణలు తీసుకొస్తానని జగన్ ఉన్నతాధికారులతో చెప్పినట్లు సమాచారం.

    ఉద్యోగస్తుల విషయంలో జగన్ సంస్కరణలు

    ఉద్యోగస్తుల విషయంలో జగన్ సంస్కరణలు

    అంతే కాదు పదవీ విరమణ చేసే ఉద్యోగుల ప్రయోజనాలు వారికి అందేలా నిర్ణయాలను తీసుకుంటామన్నారు. పెన్షన్ రూల్స్ అమలులో సంస్కరణలు అమలు చేసేందుకు వైఎస్ జగన్ సిద్ధమవుతున్నారు. ప్రభుత్వం రూల్స్ పేరుతో రిటైర్మెంట్ దగ్గర పడిన ఉద్యోగులను వేధించకుండా చర్యలకు ప్రణాళికలు చేస్తున్నారు. అంతే కాదు ఉద్యోగుల నుంచి సూచనలు, సలహాలు స్వీకరించేందుకు సీఎస్ కార్యాలయం లో ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తుంది . మొత్తానికి జగన్ ఉద్యోగుల విషయంలో మంచి సంస్కరణలు తెస్తున్నారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+