Rains: తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక..

ఏపీ, తెలంగాణలో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని పేర్కొంది. దీని ప్రభావంతో వచ్చే ఐదు రోజులు వానలు పడతాయని భారత వాతావరణ శాఖ ప్రకటించింది. తెలుగు రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు పడతాయని వివరించింది.

పలు ప్రాంతాల్లో జల్లులు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. అల్పపీడన ప్రభావం వల్ల ఏపీలోని తిరుపతి, ఏలూరు, కాకినాడ, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం, నెల్లూరు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడతాయని వాతావరణ శాఖ అంచనా వేసింది.

The Indian Meteorological Department has said that there is a possibility of rains in the Telugu states

గడిచిన 24 గంటల్లోపార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో 8.9 సెంటీమీటర్లు, అనకాపల్లి జిల్లా చోడవరంలో 4.8 సెంటీమీటర్లు, విజయనగరం జిల్లా డెంకాడలో 4.3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు అయింది. ఏలూరు జిల్లా పోలవరంలో 2.4 సెంటీమీటర్ల వర్షపాతం కురిసింది.

ఇటు తెలంగాణలో కూడా అల్పపీడన ప్రభావంతో వనాలు పడతాయని పేర్కొంది. తెలంగాణలోని భువనగిరి, హనుమకొండ, వరంగల్, మహబూబాబాద్, జనగామ, హైదరాబాద్, సూర్యాపేట, రంగారెడ్డి, నల్గొండ, మేడ్చల్ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వివరించింది. ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+