Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఏనుగుల అడ్డాలో జగన్, పెద్దిరెడ్డి హ్యాట్రిక్ కు చెక్ పెడుతున్న టీడీపీ, జనసేన, బీజేపీ లీడర్స్ !

ఆంధ్రప్రదేశ్ లో ఎండ వేడి విపరీతంగా ఉన్నా ఆ వేడికి పోటీగా అన్నట్లుగా రాజకీయ వేడి తారాస్థాయికి చేరుతోంది. చిత్తూరు జిల్లాలోని పలమనేరు నియోజకవర్గంలో వైసీపీ, టీడీపీ పార్టీలు నువ్వానేనా అన్నట్లు ఎన్నికల ప్రచారం చేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లాలోని పలమనేరు నియోజక వర్గం అటు కర్ణాటక, ఇటు తమిళనాడు రాష్ట్రాల సరిహద్దులకు దగ్గరగా వుంటుంది.

పలమనేరు రాజకీయాలు రసవత్తరంగా ఉంటాయి. మూడు రాష్ట్రాల సంస్కృతులు, ఆచార వ్యవహారాలు పలమనేరులో వున్నాయి. చెన్నై- బెంగళూరు నగరాల జాతీయ రహదారి ఇదే పలమనేరు మీదుగా వెలుతుండటంతో వాణిజ్య, వ్యాపారపరంగా, భౌగోళికంగా పలమనేరుకు చాలా ప్రాధాన్యత ఏర్పడింది. నాలుగో నెంబర్ జాతీయ రహదారి పలమనేరు పట్టణం మీదుగా వెలుతుండటంతో రాకపోకలకు అనువుగా వుంటుంది.

The leaders of YCP and TDP are campaigning for election in Palamaneru constituency

చింతపండు, వేరుశెనగ పంటలతో పాటు టమోట, మామిడి కాయలకు పలమనేరు కేంద్రంగా వ్యాపారాలు జరుగుతుంటటాయి. దేశ విదేశాలకు పలమనేరు నుంచి పంటలు ఎగుమతి అవుతాయి. అలాగే పలమనేరులో పట్టు పరిశ్రమ కూడా విలసిల్లుతోంది. అక్కడి పట్టును కర్ణాటకలో విక్రయించి మంచి లాభాలు గడిస్తున్నారు పలమనేరు వ్యాపారులు. 1952లో ఏర్పడిన పలమనేరు నియోజకవర్గం తొలినాళ్లలో ఎస్సీ రిజర్వ్‌డ్‌.

2009లో నియోజకవర్గాల పునర్విభజన సందర్భంగా పలమనేరురు ఎస్సీ నుంచి జనరల్‌ కేటగిరి కిందకు మార్చారు. పలమనేరు అసెంబ్లీ నియోజక వర్గ పరిధిలో పలమనేరు, పెద్దపంజాని, గంగవరం, బైరెడ్డిపల్లె, వీ కోట మండలాలున్నాయి. పలమనేరు నియోజకవర్గం గతంలో టీడీపీకి కంచుకోట. 1983లో తెలుగుదేశం ఆవిర్భవించిన తర్వాత నుంచి నేటి వరకు పలమనేరులో టీడీపీ 6 సార్లు విజయం సాధించింది. కాంగ్రెస్ పార్టీ 5 సార్లు, వైసీపీ రెండు సార్లు, స్వతంత్ర పార్టీ అభ్యర్థి ఒకసారి గెలిచారు.

పలమనేరులో మొత్తం ఓటర్ల సంఖ్య 2,66,767 మంది. వీరిలో పురుషులు 1,32,242 మంది.. మహిళలు 1,33,728 మంది ఉన్నారు. రెడ్డి, మాల, మైనారిటీ వర్గాల ఓటర్లు పలమనేరులో అధికంగా ఉన్నారు. 2019 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్ధి ఎన్ వెంకటే గౌడకు 1,19,241 ఓట్లు వచ్చాయి. అదే ఎన్నికల్లో మాజీ మంత్రి, టీడీపీ అభ్యర్ధి ఎన్ అమర్‌నాథ్ రెడ్డికి 86,995 ఓట్లు పోలయ్యాయి. మొత్తంగా వైసీపీ 32,246 ఓట్ల తేడాతో వరుసగా రెండోసారి పలమనేరులో విజయం సాధించింది.

The leaders of YCP and TDP are campaigning for election in Palamaneru constituency

పలమనేరులో మొదటిసారి ఎన్ అమరనాథ రెడ్డి వైసీపీ టిక్కెట్ మీద ఎమ్మెల్యే అయినా తరువాత ఆయన టీడీపీలో చేరిపోయి మంత్రి అయ్యారు. ఆ సందర్బంలో వైసీపీ నాయకులు షాక్ అయ్యారు. తరువాత పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డికి పలమనేరు ఇన్ చార్జ్ బాధ్యతలు ఇవ్వడంతో ఆయన ఎంట్రీతో పలమనేరు రాజకీయాలు రసవత్తరంగా మారిపోయయి. 2024 ఎన్నికల్లో పలమనేరులో హ్యాట్రిక్ సాధించాలని ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే ఎన్ వెంకటే గౌడకు మరోసారి వైసీపీ టికెట్ కేటాయించారు.

మరోవైపు తన ఒకప్పటి కంచుకోటలో తిరిగి పాగా వేయాలని చంద్రబాబు భావిస్తున్నారు. మాజీ మంత్రి ఎన్. అమర్‌నాథ్ రెడ్డికి మరోసారి టీడీపీ టికెట్ కేటాయించారు. సంప్రదాయ టీడీపీ ఓట్లతో పాటు అమర్‌నాథ్ రెడ్డికి స్థానికంగా వున్న పట్టు , జనసేన బీజేపీలతో పొత్తు తెలుగుదేశం పార్టీకి ప్లస్ కానున్నాయి. వైఎస్ జగన్ మాత్రం సంక్షేమ పథకాలను, పక్క నియోజక వర్గానికి చెందిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డిని గట్టిగా నమ్ముకుని బరిలోకి దిగుతున్నారు. తమిళనాడు నుంచి శేషాచలం అడువులకు మధ్యలో విస్తరించిన అటవి ప్రాంతం పలమనేరు సమీపంలోనే ఉండటంతో ఇక్కడ ఏనుగల సంచారం విపరీతంగా ఉంటుంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+