దక్షిణాదిలోనే తొలిగా రూ.470 కోట్లతో ఏపీలో పొడవైన రైల్వే సొరంగం,ఆ జిల్లాలకు వరం!
దక్షిణాది రాష్ట్రాలలో రైల్వే పురోగతి కోసం ప్రధానంగా ఫోకస్ చేస్తున్న భారతీయ రైల్వే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త రైల్వే మార్గాలను ఏర్పాటు చేయడంతోపాటు, దేశంలోనే అరుదైన దక్షిణాది రాష్ట్రంలో తొలి మార్గాన్ని కూడా నిర్మించింది. తొలిసారిగా ఏడున్నర కిలోమీటర్ల పొడవైన రైల్వే సొరంగాన్ని నెల్లూరు, అన్నమయ్య జిల్లాల సరిహద్దులో నిర్మించింది రైల్వే.
ఓబులవారిపల్లె నుండి కృష్ణపట్నం రైల్వే లైన్
ఆంధ్రప్రదేశ్‌లో కొత్త రైల్వే మార్గంలో రైళ్ల రాకపోకల కోసం దేశంలోనే అరుదైన సొరంగం అందుబాటులోకి వచ్చింది. దక్షిణాదిలో తొలిసారిగా 7.5 కిలోమీటర్ల పొడవైన రైల్వే సొరంగాన్ని నిర్మించారు. ఈ సొరంగం నెల్లూరు, అన్నమయ్య జిల్లాల సరిహద్దుల్లో విస్తరించి ఉంది. సరుకు రవాణా చేసే రైళ్ల రాకపోకల కోసం ఓబులవారిపల్లె నుండి కృష్ణపట్నం వరకు 113 కిలోమీటర్ల రైల్వే లైన్ భారతీయ రైల్వే నిర్మించింది దీనికోసం 2000 కోట్ల రూపాయలను ఖర్చు చేసింది.

7.5 కిలోమీటర్ల సొరంగ మార్గాన్ని నిర్మాణం చేసిన రైల్వే
ఇక ఇందులో భాగంగానే చిట్వేలి రాపూర్ మండలాలలోని అడవుల్లో చెర్లోపల్లి వద్ద 7.5 కిలోమీటర్ల సొరంగ మార్గాన్ని రైల్వే నిర్మాణం చేసింది. ఈ మార్గంలో ఈ సొరంగాన్ని నిర్మించడానికి 470 కోట్ల రూపాయలను రైల్వే ఖర్చు చేసింది. రోడ్లు చెరువులు కుంటలు వంకలు దాటడానికి 120 చిన్న వంతెనలను 15 పెద్ద వంతెనలను కూడా నిర్మించింది భారతీయ రైల్వే. ఈ ప్రాజెక్టు వ్యయం మొత్తం 2000 కోట్లుగా ఉంది.
ఈ మార్గంలో ప్రయాణికుల రైళ్ళు నడపాలని ఆలోచనలో రైల్వే
ఓబులవారిపల్లె నుంచి కృష్ణపట్నం వరకు 113 కిలోమీటర్ల పొడవైన ఈ రైల్వే లైన్‌ను సరకు రవాణా రైళ్ల కోసం రూ.2 వేల కోట్ల వ్యయంతో నిర్మించారు. 2019 సెప్టెంబర్ 1న అప్పటి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఈ రైలు మార్గాన్ని జాతికి అంకితం చేశారు. త్వరలో ఈ మార్గంలో ప్రయాణికుల రైళ్లను కూడా నడపాలని అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు.
ప్యాసింజర్ రైళ్ళను నడిపేందుకు ప్లాన్
ప్రస్తుతం కృష్ణపట్నం ఓబులవారిపల్లె రైల్వే లైన్లో డీజిల్ ఇంజన్లతో నడిచే గూడ్స్ రైళ్ళు రాకపోకలు సాగిస్తున్నాయి. అయితే సరుకు రవాణా వేళ్ళతో పాటు ప్యాసింజర్ రైళ్లను కూడా నడపాలని రైల్వే భావిస్తున్న క్రమంలో అందుకు తగ్గట్టు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. మొత్తంగా రైల్వే ఏపీలో అన్ని ప్రాంతాలకు తన సేవలను విస్తరిస్తూ దూసుకుపోతుంది.












Click it and Unblock the Notifications