తిరుపతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Rathotsavam: తిరుమలలో వేడుకగా రథోత్సవం, భక్తుల మనోరథాన్ని అధిరోహించి !

|
Google Oneindia TeluguNews

తిరుమల/తిరుపతి: తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో ఎనిమిదో రోజైన మంగళవారం ఉదయం 7 నుండి ఉభయదేవేరులతో కూడిన శ్రీమలయప్పస్వామివారి రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి రథాన్ని లాగారు.

బ్రహ్మోత్సవాలలో ఎనిమిదో రోజున ఉభయ దేవేరులతో మలయప్పస్వామిని మహోన్నత రథంపై అధిష్ఠింపజేసి ఆలయ వీథులలో విహరింపజేశారు.

Tirumala: చంద్రప్రభ వాహనంపై నర్తనకృష్ణుడు, శ్రీవారు, వెయ్యి కళ్లు చాలవు స్వామి, గోవిందా గోవిందా !Tirumala: చంద్రప్రభ వాహనంపై నర్తనకృష్ణుడు, శ్రీవారు, వెయ్యి కళ్లు చాలవు స్వామి, గోవిందా గోవిందా !

 అడుగడుగునా నీరాజనాలు

అడుగడుగునా నీరాజనాలు

శ్రీవారికి భక్తులు అడుగడుగునా నీరాజనాలు సమర్పించారు. గోవిందనామస్మరణతో ఆలయ మాడవీధులు మారుమోగాయి.

అనాదికాలం నుండి రాజులకు రథసంచారం ప్రసిద్ధం. యుద్ధాలలో కూడా విరివిగా రథసంచారం జరిగినట్లు భారతాది గ్రంథాలు వివరిస్తున్నాయి. శ్రీహరి గరుడధ్వజుడై నాలుగు గుర్రాలతో కూడిన రథంపై విహరిస్తాడు.

 తిరుమలలో రథోత్సవం

తిరుమలలో రథోత్సవం

ఇక ప్రసిద్ధ దేవాలయాలలో ఉత్సవవేళలో దేవుని ఉత్సవమూర్తిని రథంపై ఉంచి ఊరేగించే ఆచారం, ఆగమశాస్త్ర సిద్ధమై బహుళ ప్రచారంలో ఉన్నది. తిరుమలలోరథోత్సవంఅన్నివిధాలా ప్రసిద్ధమైనది. 'రథస్థం కేశవం దృష్ట్వా పునర్జన్మనవిద్యతే అన్న ఆర్షవాక్కులురథోత్సవంమోక్షప్రదాయకమని వివరిస్తున్నాయి.

 తిరుమాడ వీథులలో

తిరుమాడ వీథులలో

తిరుమాడ వీథులలో రథాన్ని లాగేటప్పుడు ప్రమాదాలు జరుగకుండా అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. రథానికి తాళ్ళుకట్టి వీధులలో భక్తులు, అధికారులు అందరూ రథాన్ని ముందుకు లాగారు.

రథోత్సవానికి విశిష్టమైన ఆధ్యాత్మికార్థం ఉంది. కఠోపనిషత్తులో ఆత్మకు, శరీరానికీ ఉండే సంబంధాన్ని రథరూపకల్పనతో వివరించడం జరిగింది.

 ఇంద్రియాలే గుర్రాలు,

ఇంద్రియాలే గుర్రాలు,

ఆత్మ రథికుడు, శరీరమే రథం, బుద్ధి సారథి, మనస్సు పగ్గం, ఇంద్రియాలే గుర్రాలు, విషయాలే వీథులు. ఈ రీతిలో శరీరాన్ని రథంతో పోల్చడంతో - స్థూలశరీరం వేరనీ, సూక్ష్మశరీరం వేరనీ, ఆత్మ అందుకు భిన్నమనే ఆత్మానాత్మ వివేకం కలుగుతుంది.రథోత్సవంలో ముఖ్యంగా కలిగే తత్త్వజ్ఞానమిదే.

 అన్నమయ్య సకలజీవులలో !

అన్నమయ్య సకలజీవులలో !

భక్తులు రథాన్ని లాగుతారు, కానీ, అన్నమయ్య సకలజీవులలో అంతర్యామిగా ఉన్న పరమాత్మ తనరథాన్ని తానే లాగుతున్నాడని అనడం సముచితం. శ్రీవారి రథోత్సవం సందర్బంగా వేలాది మంది భక్తులు తిరువీధుల్లో స్వామివారిని దర్శించుకున్నారు. శ్రీవారి బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి.

English summary
The Malayapas Swamy along with His consorts seated on a high pedestal throne was taken on a procession around the four Mada streets
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X