జగన్ కు దేవుడిపై నమ్మకం లేకపోవచ్చు, కానీ మాకుంది, కేశవ్
మాజీ సీఎం జగన్ తిరుమల పర్యటనకు సిద్ధమయ్యారు. దేవుడిపై నమ్మకం ఉందని జగన్ తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని, తప్పుల మీద తప్పులు చేసి ఇప్పుడు తప్పించుకోవాలని చూస్తున్నారని ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. బుధవారం వెలగపూడిలోని సచివాలయంలో మంత్రి పయ్యావుల కేశవ్ మీడియాతో మాట్లాడుతూ మాజీ సీఎం జగన్ పై మండిపడ్డారు.
తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలంటే అన్యమతస్తులు రిజిస్టర్ లో కచ్చితంగా సంతకం పెట్టాలని, తిరుమల పవిత్రత కాపాడటానికి ఈ నియమాలు ఎన్నో సంవత్సరాలుగా వస్తున్నాయని, ఇది తిరుమల ఆనవాయితీ అని మంత్రి పయ్యావుల కేశవ్ గుర్తు చేశారు. వైసీపీ నాయకులు ఘోరమైన తప్పులు చేసి ఇప్పుడు తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నారని మంత్రి పయ్యావుల కేశవ్ మండిపడ్డారు. ప్రజలను పూజలు చేయమంటున్నారని, పూజలు నిజంగానే చేయమంటున్నారా ? అని వైసీపీ నాయకులను మంత్రి పయ్యావుల కేశవ్ ప్రశ్నించారు.

గతంలో భక్తులకు అందించిన తిరుపతి లడ్డుకి, వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో భక్తులకు ఇచ్చిన తిరుమల లడ్డూకి ఎంతో తేడా ఉందని, ఆ విషయం శ్రీవారిని భక్తులు అడిగితే తెలుస్తుందని, అంతకుమించిన ప్రత్యేక పరీక్ష మరొకటి అక్కర్లేదని, భక్తులు తిరుమల లడ్డూ విషయంలో ఇచ్చే తీర్పుకు మేము అందరూ కట్టుబడి ఉంటామని మంత్రి పయ్యావుల కేశవ్ చెప్పారు. కల్తీ నెయ్యి వ్యవహారంలో జగన్ తీరుపై మంత్రి పయ్యావుల కేశవ్ మండిపడ్డారు.
జగన్ కు దేవుడిపై నమ్మకం లేకపోవచ్చు, కానీ ఆ దేవుడిని నమ్మే కోట్లాదిమంది భక్తులు ఉన్నారనే విషయం వైసీపీ నాయకులు మరిచిపోకూడదని మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. తిరుమలలో లడ్డు వ్యవహారాన్ని వైసీపీ నాయకులు రాజకీయాలు చేస్తున్నారని, కల్తీ నెయ్యి తిరుమల లడ్డూల కోసం ఉపయోగించారనేది పచ్చి నిజమని, నివేదికలలో కల్తీ నెయ్యి వ్యవహారం వెలుగు చూసిన తర్వాతే తాము ఆ విషయాన్ని బయట పెట్టామని మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు.

టెస్టులు పాస్ అయిన తర్వాతే నెయ్యి ట్యాంకర్లు తిరుమల కొండపైకి పంపిస్తారని వైసీపీ నాయకులు చెబుతున్నారని, అయితే తిరుమలలో కొన్ని టెస్టులు మాత్రమే జరుగుతున్నాయని టీటీడీ ఈవో స్పష్టంగా చెప్పారని, ఆ విషయం వైసీపీ నాయకులకు వినపడటం లేదా అని మంత్రి పయ్యావుల కేశవ్ వైసీపీ నాయకులను ప్రశ్నించారు. తిరుమల అంశాన్ని పొలిటికల్ ఈవెంట్ లాగా వైసీపీ నాయకులు తయారు చేయడం చాలా బాధాకరమని మంత్రి పయ్యావుల కేశవ్ విచారం వ్యక్తం చేశారు.
భక్తులు మనోభావాలతో ఆడుకోవడం, లడ్డు తయారీలో కల్తీ జరిగిందనేది నిజమని, అపచారం జరిగిందనేది నిజం అని దానిని ఎవరు కాదనలేరని, ఇన్ని రోజులు వైసీపీ నాయకులు ఆ విషయాన్ని దాచిపెట్టారని మంత్రి పయ్యావుల కేశవ్ ఆరోపించారు. రాష్ట్రంలో పాలకుల మార్పుతోనే ప్రతి రంగంలోనూ మార్పులు మొదలైనాయని, తప్పులు సరిదిద్దే క్రమంలోనే గత పాలకులు చేసిన తప్పులు, నిజా నిజాలు వెలుగులోకి వచ్చాయని మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. అన్యమతస్తులు తిరుమల వెళ్లే సమయంలో రిజిస్టర్ లో కచ్చితంగా సంతకం చేయాలని, ఆ నియమాలను జగన్ పాటిస్తారా, లేదా ? అని మేము కూడా వేచి చూస్తున్నామని మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు.












Click it and Unblock the Notifications