తల్లి పులి ఆచూకీ దొరికింది.. పులి కూనలను అమ్మ చెంతకు చేర్చటమే తరువాయి!!
తల్లి పులి కోసం తల్లడిల్లుతున్న నాలుగు పులికూనల బాధ చూడలేక అటవీ అధికారులు తల్లి పులి కోసం ముమ్మర గాలింపు చేపట్టి ఎట్టకేలకు ఆచూకీ కనిపెట్టారు.
కర్నూలు: తల్లి పులి కోసం తల్లడిల్లుతున్న నాలుగు పులికూనలు దిగాలుగా తల్లి కోసం ఎదురుచూస్తున్నాయి. వాటి బాధ చూడలేకపోతున్న అటవీ అధికారులు తల్లి పులి కోసం ముమ్మర గాలింపు చేపట్టి ఎట్టకేలకు తల్లి పులి ఆచూకీ కనిపెట్టారు. ఆపరేషన్ మదర్ టైగర్ లో భాగంగా పులిజాడను గుర్తించారు అటవీ శాఖ అధికారులు. గుమ్మడాపురం అటవీ ప్రాంతంలో పులి అడుగు జాడలను గుర్తించిన సిబ్బంది అవి తల్లి పులికి సంబంధించిన పాదముద్రలు అవునా కాదా? అనేది తేల్చే పనిలో పడ్డారు.
పసి పులి కూనలను తల్లి దగ్గరకు చేర్చటం కోసం దాదాపు 300 మంది సిబ్బంది 50 మందికి పైగా అటవీ శాఖ అధికారులతో ఆపరేషన్ మదర్ టైగర్ ను మొదలుపెట్టారు. రెండురోజులుగా తల్లి పులి కోసం అటవీశాఖ అధికారులు గుమ్మడాపురం అటవీ ప్రాంతంలో జాగ్రత్తగా గాలింపు చేపట్టారు . ఇక పులిని పట్టుకోవడం కోసం రెండు కిలోమీటర్ల పరిధిలో 70 ఇన్ఫ్రా రెడ్ ట్రాప్ కెమెరాలను ఏర్పాటుచేసి గాలింపు చేపట్టిన అధికారులు 200 హెక్టార్లలో ట్రాప్ కెమెరాలతో పులి ఆచూకీ కనిపెట్టే పనిలో నిమగ్నమయ్యారు.

అవసరమైన చోట డ్రోన్ కెమెరాలను కూడా ఉపయోగిస్తూ పులి జాడలు గుర్తిస్తున్నారు. కచ్చితంగా పులి ఎక్కడుంది అనేది తెలిస్తే, తల్లి కోసం తల్లడిల్లుతున్న కళ్ళు కూడా తెరవని నాలుగు పసి పులికూనలను ఆ ప్రాంతానికి చేర్చి తల్లితో కలపడం కోసం కూడా రంగం సిద్ధం చేశారు. రెండు రోజుల నుంచి జాడే తెలియని పులి ఆచూకీ ఎట్టకేలకు తెలిసిన నేపథ్యంలో త్వరలోనే తల్లి పులిని చూసే అవకాశం ఉందని, పులి కూనలను తల్లి చెంతకు చేర్చే మార్గం దొరుకుతుందని అందరూ భావిస్తున్నారు. ఇక అటవీ అధికారుల సంరక్షణలో ఉన్న పులికూనలకు పాలు , సెరిలాక్ తో పాటు లివర్ ముక్కలను ఆహారంగా పెడుతున్నట్టు సమాచారం. ఇక ఈ వార్త విన్న ప్రతీ ఒక్కరూ తల్లి పులి కనిపించాలి, ఆ పసి పులి కూనలు తల్లి చెంతకు క్షేమంగా చేరాలని కోరుకుంటున్నారు.
-
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా?












Click it and Unblock the Notifications