AP: క్లాప్ మిత్రులకు నెలనెలా జీతాలు చెల్లింపు.. ఇప్పటికే రూ.84 కోట్లు ఖాతాల్లో జమ..!
క్లాప్ మిత్రలు(పారిశుద్ధ్య కార్మికులు) వేతన బకాయల్ని చెల్లించే ప్రక్రియ మొదలైనట్లు ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. క్లాప్ మిత్రులు గ్రామాల్లో ఇంటింటికి తిరిగి చెత్తను సేకరిస్తారు. అయితే వీరికి వేతనాలు చెల్లించడం లేదని ఓ పత్రికలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని సర్కార్ పేర్కొంది. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 43,534 మంది క్లాప్ మిత్రలు ఉన్నట్లు పేర్కొంది. వీరికి 2022 అక్టోబర్ నుంచి 2023 జూన్ వరకు చెల్లించాల్సిన వేతన బకాయిలు రూ.84.03 కోట్లు ఉన్నాయని చెప్పింది.
ఈ మొత్తాన్ని ఇప్పిటికే పారిశుద్ధ్య కార్మికులకు చెల్లించినట్లు స్పష్టం చేసింది. మిగతా 141 కోట్ల రూపాయలు చెల్లింపు ప్రక్రియ కొనసాగుతోందని వివరించింది. ఇందుకు సంబంధించి రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంగళవారం ఓ ప్రకటన చేసింది. 2,055 గ్రామ పంచాయతీల్లో వెండర్ రిజిస్ట్రేషన్ ప్రారంభమైనట్లు స్పష్టం చేసింది. ఇక నుంచి ఎప్పటికప్పుడు గ్రామ పంచాయతీల నిధుల నుంచి క్లాప్ మిత్రులకు వేతనాలు చెల్లించనున్నట్లు తెలిపింది.

క్లాప్ మిత్రుల వేతనాలకు చెల్లింపునకు సంబంధించి పర్యవేక్షించడానికి స్పెషల్ గా డ్యాష్ బోర్డు ఏర్పాటు చేసినట్లు పంచాయతీరాజ్ శాఖ పేర్కొంది.
గ్రామాల్లో పారిశుధ్య నిర్వహణలో ప్రభుత్వం నూతన విధానాలను అవలంబిస్తుందని వివరించింది. ఊళ్లలో ఎక్కడా చెత్తాచెదారం జమ కాకుండా పూర్తి పరిశుభ్రంగా ఉంచాలన్న లక్ష్యంగా జగనన్న స్వచ్ఛ సంకల్పం కార్యక్రమాన్ని 2021 అక్టోబరు 2న ప్రారంభించినట్లు గుర్తు చేసింది.
ప్రతి రోజు ప్రతి గ్రామంలోనూ ఉ.6గంటల నుంచి క్లాప్‌మిత్రల ద్వారా ఇంటింటి నుంచి చెత్త సేకరణ కొనసాగుతోందని పేర్కొంది.ఇందుకుగాను గ్రామ పంచాయతీలకు 32,777 చెత్త తరలించే రిక్షాలు, 1,004 టిప్పర్లను ప్రభుత్వం ఇప్పటికే అప్పజెప్పినట్లు చెప్పింది. క్లాప్ మిత్ర వేతనాల కోసం రాష్ట్ర సర్కార్ నెలనెలా రూ.27 కోట్లు వెచ్చిస్తుంది పేర్కొంది.












Click it and Unblock the Notifications