శుభవార్త: రూ.286 కోట్లతో ఏపీలో ఆ రైల్వేస్టేషన్ రూపురేఖలు పుష్కరాలకు మారిపోనున్నాయ్!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2027 సంవత్సరంలో గోదావరి పుష్కరాలు రాబోతున్నాయి దీనికోసం రైల్వే శాఖ పెద్ద ఎత్తున సన్నాహాలు చేస్తోంది. గోదావరి పుష్కరాలకు రాజమండ్రి రైల్వే స్టేషన్ ను రెడీ చేస్తోంది. రాజమహేంద్రవరం రైల్వేస్టేషన్లో ప్రయాణికుల సౌకర్యం కోసం 286 .30 కోట్లతో విస్తరణ మరియు నూతన నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఈ పనులన్నీ 2027 ఫిబ్రవరి నాటికి పూర్తి చేయాలని అధికారులు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు.

పుష్కరాల కన్నా ముందే పనులు పూర్తి చెయ్యాలన్న పురందేశ్వరి
ఇందులో భాగంగా రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుబాటి పురందరేశ్వరి రాజమండ్రి రైల్వే స్టేషన్ సందర్శించి పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. పుష్కరాల కంటే ముందుగా పనులు పూర్తి కావాలని సూచించారు. ఈ రైల్వే స్టేషన్ నిర్మాణ పనులు త్వరితగతిని చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కూడా అవసరమైన ఏర్పాట్లు చేస్తోంది. రాజమహేంద్రవరం రైల్వే స్టేషన్ నిర్మాణంలో లిఫ్టులు, ఎస్కలేటర్ లతోపాటు మూడు అదనపు ఫిట్ ఓవర్ బ్రిడ్జ్ లను నిర్మించనున్నారు.

The railway station that will be transformed for godavari Pushkaraalu Huge budget

Take a Poll

పుష్కరాల కోసం ప్రత్యేక ఏర్పాట్లు
అలాగే ప్లాట్ ఫామ్ ల పైన షెల్టర్లను విస్తరించనున్నారు. స్టేషన్ కు తూర్పువైపు కొత్త భవనంతో రెండు ప్రవేశ ద్వారాలు కూడా ఏర్పాటు చేయనున్నారు. ఇక పుష్కరాల సమయంలో రద్దీని దృష్టిలో పెట్టుకొని ఇప్పటినుంచే ప్రత్యేక ఏర్పాట్లపై ఫోకస్ చేస్తున్నారు. 34 బుకింగ్ కౌంటర్లు, 11 ఎంక్వయిరీ సెంటర్లను ఏర్పాటు చేయనున్నారు. ప్రయాణికులు సులభంగా టికెట్లు కొనుగోలు చేసుకోవడానికి 11 ఆటోమేటిక్ టికెట్ వెండింగ్ మిషన్లను కూడా అందుబాటులో ఉంచనున్నారు.

గోదావరి పుష్కరాలకు కేటాయించిన రైళ్ళు ఇవే
ప్రయాణికుల విశ్రాంతి కోసం పది అదనపు షెడ్లను, రైల్వే స్టేషన్ లోపలికి, బయటకు వెళ్లడానికి అదనంగా ఎనిమిది గేట్లను ఏర్పాటు చేయనున్నారు. ఈసారి గోదావరి పుష్కరాలకు రైల్వే శాఖ 1012 ప్రత్యేక రైళ్లను నడపాలని కూడా ప్లాన్ చేసింది. 2003 సంవత్సరంలో 726, 2015లో 823 ప్రత్యేక రైళ్లను నడిపారు. ఈసారి సాధారణ రైళ్లకు అదనంగా 2370 కోచ్లను కూడా జోడించి రైళ్లను నడపనున్నారు.

రైళ్ళ రాకపోకలకు ప్రత్యేక కంట్రోల్ సెల్
ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని విశాఖపట్నం, తిరుపతి, సికింద్రాబాద్, చెన్నై, బెంగళూరు ల నుంచి కూడా రాజమండ్రి, కాకినాడ, నర్సాపురం వరకు రైళ్లను నడపాలని రైల్వే శాఖ ఆలోచిస్తోంది. ఇక రైళ్ల రాకపోకలను పర్యవేక్షించడానికి ఒక ప్రత్యేక కంట్రోల్ సెల్ ను ఏర్పాటు చేయనున్నారు. భక్తుల రద్దీపై ఎప్పటికప్పుడు సమాచారం అందించడానికి ఒక కోఆర్డినేటర్ ను నియమించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని రైల్వే శాఖ కోరింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+