దువ్వాడ ఫ్యామిలీ డ్రామాలో రాత్రికి రాత్రే మారిన సీన్.. ఆ ఇంట్లో కీలక పరిణామాలు!

దువ్వాడ ఫ్యామిలీ డ్రామా ఇప్పటితో ముగిసేలా లేదు. గత 13రోజులుగా దువ్వాడ వాణి శ్రీనివాస్ ఇంటి ముందు ధర్నా చేస్తూనే ఉన్నారు ఇంట్లో ఒక తనను రానివ్వాలని తన భర్తతో కలిసి ఉంటానంటూ పెద్ద సినిమానే చేస్తున్నారు. దువ్వాడ శ్రీనివాస్ వాణిని ఇంట్లోకి రానిచ్చేది లేదని తేల్చి చెప్పారు. మరోవైపు ఆ ఇంట్లో తనకు హక్కు ఉందని తాను వెళ్లి అదే ఇంట్లో ఉంటానని సంచలన వ్యాఖ్యలు చేశారు మాధురి.

దువ్వాడ ఇంట్లో సడన్ చేంజ్
దువ్వాడ శ్రీనివాస్ కు తాను రెండు కోట్లు డబ్బులు ఆ ఇంటి నిర్మాణం కోసం ఇచ్చానని ఆ డబ్బులు తిరిగి తనకు చెల్లించి వాణి ఆ ఇంట్లోకి వెళ్ళొచ్చని మాధురి తేల్చిచెప్పారు. ఈ ఎపిసోడ్ ఇలా జరుగుతుండగానే ఒక్కసారిగా నిన్న రాత్రికి రాత్రే సీనంతా మారిపోయింది. నిన్నటివరకు దువ్వాడ నివాసం ఉంటున్న ఇల్లు కాస్త ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం గాను, ఎమ్మెల్సీ క్యాంప్ ఆఫీస్ గానూ మారిపోయింది.

The scene that changed overnight in the Duvvada srinivas family drama home turned into MLC camp office

దువ్వాడ ఇంట్లోకి చేరిన నలుగురు
దీనికి సంబంధించి ఇంటి చుట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేరుతో ఫ్లెక్సీలు వెలిశాయి. అంతే కాదు దువ్వాడ శ్రీనివాస్ ఇంట్లోకి కొత్తగా ఓ నలుగురు వ్యక్తులు వచ్చి చేరారు. ఆ ఇంట్లోకి ఎలాగైనా అడుగు పెట్టాలని వాణి ప్రయత్నాలు చేస్తుంటే ఆమెను ఎలాగైనా అడ్డుకోవాలని దువ్వాడ శ్రీనివాస్ సైతం ప్రయత్నిస్తున్నారు. ఈ నేపధ్యంలోనే ఆయన తనపై దాడి జరిగే అవకాశం ఉందని భావించి బౌన్సర్లను పెట్టుకున్నారు.

దువ్వాడ ఇల్లు కాస్త ఎమ్మెల్సీ క్యాంప్ ఆఫీస్ గా
ఇంటి బయట వాణి సైన్యం, ఇంటి లోపల దువ్వాడ సేన ప్రత్యర్థులను జాగ్రత్తగా గమనిస్తూ ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నారు. దువ్వాడ శ్రీనివాస్ పార్టీ క్యాంప్ ఆఫీస్ అని బోర్డు పెడితే భార్య అక్కడ నుంచి వెళ్ళిపోతుందని భావిస్తున్నట్టుగా తాజా పరిస్థితిని బట్టి అర్థమవుతుంది. కానీ దువ్వాడ వాణి అవేవీ పట్టించుకోకుండా తన ఆందోళనను కొనసాగిస్తున్నారు.

దువ్వాడ ఫ్యామిలీ వార్ ఇప్పట్లో తెగేలా లేదుగా
ఎమ్మెల్సీ క్యాంప్ ఆఫీస్ ముందు దువ్వాడ సతీమణి నిరసన చెయ్యకూడదా ? ఎమ్మెల్సీ క్యాంప్ ఆఫీస్ లోకి భార్యకు ప్రవేశం ఉండదా? రాత్రికి రాత్రికి చేసిన మార్పుల వెనక మతలబు ఏంటి? అన్నది ఇప్పుడు ప్రతి ఒక్కరిలోనూ జరుగుతున్న చర్చ .ఏది ఏమైనా సమస్య మొదలై ఇన్ని రోజులు అవుతున్న ఈ గొడవకు ఫుల్ స్టాప్ పడకపోవడం ఇందులో ఎవరు వెనక్కి తగ్గకపోవడం ప్రతి ఒక్కరిని ఈ ఫ్యామిలీ పంచాయతీ పై దృష్టి మరల్చేలా చేస్తుంది

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+