Ganesh Chaturthi 2024:గణపతికి ఈ పూలతో పూజ - నైవేద్యంతో ఉద్యోగం, పెళ్లి పక్కా..!!
Ganesh Chaturthi 2024:వినాయక చవితి ఉత్సవాలు మొదలయ్యాయి. భక్తితో పాటుగా ఉత్సాహంతో జరుపుకునే ఈ పండుగ వెనుక శాస్త్రీయంగా ఎన్నో విషయాలు ఉన్నాయి. భక్తితో గణపతిని పూజిస్తే అన్ని విఘ్నాలు తొలుగుతాయనే నమ్మకం ఉంది. వినాయకుని పూజలో ఉపయోగించే పుష్పాలతో పాటుగా పత్రి..సమర్పించే నైవేద్యాల గురించి పండితులు ఆసక్తి కర అంశాలను వెల్లడిస్తున్నారు. ఈ పూజలో వినియోగించే పుష్పాలు..నైవేద్యం తో ఉద్యోగం..పెళ్లి ఖాయమని విశ్వసిస్తారు.
పుష్పాలతో పూజ
వినాయక చవితి రోజున గణపతిని ప్రత్యేకమైన పుష్పాలతో పూజిస్తే అనేక ప్రయోజనాలు చేకూరుతాయని పండితులు చెబుతున్నారు. ఎరుపు రంగు పుష్పాలతో పూజిస్తే వినాయకుడి అనుగ్రహం తొందరగా కలుగుతుందనేది భక్తుల విశ్వాసం. ఎర్ర గులాబి, ఎర్ర మందారాలతో గణపతిని ఎక్కువగా పూజించాలని పండితులు సూచించారు. గణపతికి ఎరుపు రంగు ఇష్టం కాబట్టి ఆయన అనుగ్రహం త్వరగా కలుగుతుందని చెబుతున్నారు. గణపతిని వినాయక చవితి రోజు పద్మపుష్పాలతో పూజిస్తే ధన పరమైన ఇబ్బందులన్నీ తొలగిపోతాయనేది నమ్మకం.

అన్నీ ప్రత్యేకమే
వినాయక చవితి రోజు గణపతికి సమర్పిస్తే జాతకంలోని 12 రకాల కాల, సర్ప దోషాలు తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు. అదే విదంగా.. సంపంగి తో గణపతిని పూజిస్తే శత్రు బాధలు తొలగిపోతాయనే అభిప్రాయం ఉంది. జాజి పూలతో వియనాకుడిని పూజిస్తే ఉద్యోగ పరమైన సమస్యలు తొలగిపోయి.. ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంటుందని పండితులు పలు ప్రవచనాల్లో వివరిస్తు్నారు. మల్లెపూలతో గణపతిని పూజిస్తే అనారోగ్య సమస్యలు తొలగిపోయి.. ఆరోగ్యం బాగుంటుందని చెబుతున్నారు. తెల్ల జిల్లెడు పూలతో గణపతిని పూజించడం వల్ల అఖండ ఐశ్వర్య ప్రాప్తిని పొందడమే కాకుండా జీవితంలో ఉన్న సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చని విశ్లేషిస్తున్నారు.

కష్టాలు తొలిగించే దేవుడు
ఇక, వినాయక చవితి రోజు మోదకం (లడ్డు, ఉండ్రాలు) సమర్పిస్తే.. జీవితంలోని కోరికలు త్వరగా నెరవేరుతాయని భక్తులకు సూచిస్తున్నారు. నైవేద్యంగా అటుకులు సమర్పిస్తే.. సంసార జీవితంలో ఉన్న బాధలు, కష్టాలు తొలగిపోయి ప్రశాంతత లభిస్తుందని వివరిస్తున్నారు. చవితి రోజున పేలాలను నైవేద్యంగా సమర్పిస్తే మానసిక అశాంతి తొలగిపోయి.. ప్రశాంతత దొరకుతుందని చెబుతున్నారు. వినాయకుడికి నైవేద్యంగా సత్తుపిండిని సమర్పిస్తే ఆత్మవిశ్వాసం పెరిగి.. మనోధైర్యం వస్తుందని వెల్లడిస్తున్నారు.
చెరకు ముక్కలను గణపతికి నివేదిస్తే కర్మ ఫలితాలు తొలగిపోయి.. ప్రారభ్థ కర్మ ఫలితాల నుంచి బయట పడవచ్చని అనేక మంది ప్రముఖపండితులు వివరించారు. కొబ్బరి కురడిని వినాయకుడికి నివేదిస్తే ఆర్థిక ఇబ్బందుల నుంచి సులభంగా బయటపడవచ్చని సూచిస్తున్నారు. నువ్వులతో చేసిన పదార్థాలను గణపతికి నైవేద్యంగా పెడితే శని దోషాలన్నీ తొలగిపోతాయని వివరించారు. రకరకాల పండ్లను నైవేద్యంగా సమర్పిస్తే ఉద్యోగ, వ్యాపార పరంగా మంచి పురోభివృద్ధి కలుగుతుందని వెల్లడించారు.












Click it and Unblock the Notifications