అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జీవో నెంబర్ 1: ఏపీ ప్రభుత్వ పిటీషన్ పై సుప్రీం కీలక ఆదేశాలు..!!

|
Google Oneindia TeluguNews

ఏపీలో రాజకీయంగా వివాదాస్పదమైన జీవో నెంబర్ 1 పై సుప్రీం కీలక ఆదేశాలు ఇచ్చింది. టీడీపీ అధినేత చంద్రబాబు కందుకూరు, గుంటూరులో నిర్వహించిన సభల్లో తొక్కిసలాటతో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ సమయంలో ప్రభుత్వం జీవో నెంబర్ 1 తీసుకొచ్చింది. దీని ద్వారా రోడ్ల పైన సభలు - ర్యాలీల నిర్వహణ పైన ఆంక్షలు విధించింది. ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో పైన రాజకీయంగా పెద్ద ఎత్తున దుమారం చెలరేగింది. ఈ జీవోను రద్దు చేయాలని కోరుతూ హైకోర్టులో పిల్ దాఖలైంది. ఆ పిల్ విచారణ సమయంలో కీలక వాదనలు జరిగాయి. పిల్ ను విచారించిన హైకోర్టు వెకేషన్ బెంచ్ జీవో నెంబర్ 1 ను ఈ నెల 23వ తేదీ వరకు సస్పెండ్ చేస్తూ ఆదేశాలిచ్చింది. దీని పైన ఏపీ ప్రభుత్వం సుప్రీంలో అప్పీల్ చేసింది. దీనిని విచారించిన సుప్రీం కీలక ఆదేశాలు జారీ చేసింది.

హైకోర్టు జీవో నెంబర్ 1 ను సస్పెండ్ చేస్తూ ఇచ్చిన ఆదేశాల పైన సుప్రీంకోర్టులో ప్రభుత్వం పిటీషన్ దాఖలు చేసింది. సస్పెన్షన్ ఆదేశాలు రద్దు చేయాలని పిటీషన్ లో కోరింది. ఈ పిటషన్ పైన సుప్రీంలో విచారణ జరిగింది. ప్రస్తుతం ఈ కేసు హైకోర్టులో పెండింగ్ లో ఉండటంతో తాము జోక్యం చేసుకోలేమని సుప్రీం స్పష్టం చేసింది. అయితే, ఈ కేసు హైకోర్టులో తిరిగి 23న విచారణకు రానుండటంతో ఆ కేసును ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి విచారించాలని సుప్రీం కీలక సూచన చేసింది. ఈ జీవోను సస్పెండ్ చేసిన హైకోర్టు ఏపీ ప్రభుత్వాన్ని కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. ఈ కేసులో 23న హైకోర్టు సీజేఐ విచారణ..వెలువడే నిర్ణయం ఆధారంగా ఏపీ ప్రభుత్వం తదుపరి అడుగులు ఉండే అవకాశం కనిపిస్తోంది.

The Supreme Court has given a key order that the Go No 1 case should be heard by

ఇదే సమయంలో ఈ జీవోకు సంబంధించి ప్రభుత్వం పైన రాజకీయంగా ఒత్తిడి పెరుగుతోంది. తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబును కలిసిన సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామక్రిష్ణ అన్ని పార్టీలతో కలిసి ఈ జీవోకు వ్యతిరేకంగా ఒత్తిడి తీసుకొస్తామని ప్రకటించారు. కొద్ది రోజుల క్రితం కుప్పం పర్యటనకు వెళ్లిన చంద్రబాబును ఈ జీవో కారణంగా సభలు - రోడ్ షోలకు పోలీసులు అనుమతి ఇవ్వలేదు. ఈ జీవో పైన చంద్రబాబు ఫైర్ అయ్యారు. బ్రిటిష్ చట్టం అమలు చేస్తారా అని నిలదీసారు. చంద్రబాబును అడ్డుకోవటం పై జనసేన అధినేత పవన్ ఆగ్రహం వ్యక్తం చేసారు. హైదరాబాద్ లో చంద్రబాబును కలిసి సంఘీభావం ప్రకటించారు. ఈ జీవోను అమలు చేయాలని ప్రభుత్వం పట్టుదలతో ఉంది. దీంతో, ఈ నెల 23న హైకోర్టులో విచారణ.. వెలువడే ఆదేశాల పైన ఉత్కంఠ కనిపిస్తోంది.

English summary
The Supreme Court has given a key order that the Go No 1 case should be heard by the Chief Justice of AP High Court.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X