ఆరుగురు హైకోర్టు న్యాయమూర్తుల బదిలీ - ఏపీకి జస్టిస్ నరేందర్..!!

తెలుగు రాష్ట్రాలకు చెందిన ఆరుగురు హైకోర్టు న్యాయమూర్తులను బదిలీ చేయాలని సుప్రీంకోర్టు కొలీజియం నిర్ణయించింది. ఈ మేరకు తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. ఇందులో తెలంగాణ హైకోర్టుకు చెందిన నలుగురు, ఏపీ హైకోర్టుకు చెందిన ఇద్దరు న్యాయమూర్తులు ఉన్నారు. దేశ వ్యాప్తంగా 8 హైకోర్టుల నుంచి 23 మంది న్యాయమూర్తులను బదిలీ చేయాలని సుప్రీంకోర్టు సీజేతో కూడిన కొలీజియం నిర్ణయించింది.

తెలంగాణ హైకోర్టు నుంచి ఇద్దరు :తెలంగాణ హైకోర్టుకు చెందిన నలుగురు న్యాయమూర్తులను ఇతర హైకోర్టులకు బదిలీ చేయాలని సుప్రీం కోర్టు కొలీజియం సిఫారసు చేసింది. జస్టిస్‌ ఎం.సుధీర్‌కుమార్‌ను మద్రాస్‌, జస్టిస్‌ మున్నూరి లక్ష్మణ్‌ను రాజస్థాన్‌, జస్టిస్‌ సి.సుమలతను కర్ణాటక, జస్టిస్‌ అనుపమా చక్రవర్తిని పట్నా హైకోర్టుకు బదిలీ చేయాలని ఈ నెల 3న నిర్ణయించామని వెల్లడించింది. కాగా, జస్టిస్‌ సుధీర్‌ కుమార్‌ను కోల్‌కతా హైకోర్టుకు పంపాలని భావించామని.. ఆయన ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక లేదా మద్రాస్‌ హైకోర్టుకు బదిలీ చేయాలని విజ్ఞప్తి చేశారని తెలిపింది. మద్రాస్‌ హైకోర్టుకు బదిలీ చేయాలని నిర్ణయించామని స్పష్టం చేసింది. జస్టిస్‌ సుమలత ఏపీ లేదా కర్ణాటక హైకోర్టుకు బదిలీ చేయాలని విజ్ఞప్తి చేశారని, దానిని పరిశీలించి గుజరాత్‌ హైకోర్టుకు బదులు కర్ణాటకకు బదిలీ చేయాలని నిర్ణయించామని వివరించింది.

The Supreme Courthas recommended the transfer of Six judges from AP and TS High Courts

ఏపీ హైకోర్టు నుంచి నలుగురు బదిలీ:జస్టిస్‌ అనుపమా చక్రవర్తి తెలంగాణ హైకోర్టుకు దగ్గర్లోని హైకోర్టుకు బదిలీ చేయాలని కోరారని.. ఆమె వినతిలో మెరిట్‌ లేనందున పట్నా హైకోర్టుకే పంపుతున్నట్లు చెప్పింది. బదిలీని వాయిదా వేయాలని లేదా విరమించుకోవాలని లేదా కర్ణాటక హైకోర్టుకు పంపాలని జస్టిస్‌ మున్నూరి లక్షణ్‌ కోరారని, కానీ రాజస్థాన్‌ హైకోర్టుకే బదిలీ చేయాలని మరోసారి స్పష్టం చేస్తున్నామని పేర్కొంది. ఏపీ హైకోర్టు జస్టిస్‌ సి. మానవేంద్ర రాయ్‌ను గుజరాత్‌కు, జస్టిస్‌ దుప్పల వెంకటరమణను మధ్యప్రదేశ్‌కు బదిలీ చేయాలని సుప్రీంకోర్టు కొలీజియం నిర్ణయించింది. జస్టిస్‌ మానవేంద్రరాయ్‌ తెలంగాణ హైకోర్టుకు బదిలీ కోరినా.. అందులో మెరిట్‌ లేదని భావించి గుజరాత్‌కు పంపాలన్న నిర్ణయాన్ని పునరుద్ఘాటిస్తున్నామని స్పష్టం చేసింది.

ఏపీ హైకోర్టుకు జస్టిస్ నరేందర్:జస్టిస్‌ దుప్పల వెంకటరమణ కర్ణాటక హైకోర్టుకు బదిలీకి విజ్ఞప్తి చేశారని.. కానీ, ఆయన వినతిలో మెరిట్‌ లేదని భావించి మధ్యప్రదేశ్‌కు కేటాయిస్తున్నట్లు తెలిపింది. ఏపీ హైకోర్టుకు బదిలీ చేయాలని ప్రతిపాదించిన జస్టిస్ జీ నరేందర్ కర్ణాటక హైకోర్టులో సీనియర్ న్యాయమూర్తి. సీనియార్టీ పరంగా రెండో స్థానంలో ఉన్నారు. 1989 ఆగస్టు 23న తమిళనాడు బార్ కౌన్సిల్ లో న్యాయవాదిగా పేరు నమోదు చేసుకున్నారు. 1989 నుంచి 1992 వరకు మద్రాసు హైకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీసు చేసారు. 2015 జనవరి 2న కర్ణాటక హైకోర్టులో అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2017 డిసెంబర్ 30న శాశ్వత న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. కొలీజియం తొలుత ఈయన్ను ఒడిశా హైకోర్టు బదిలీ చేయాలని ప్రతిపాదించినా, తాజాగా ఏపీ హైకోర్టుకు బదిలీ చేయాలని తీర్మానించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+