టీడీపీ సైతం పవన్ నిర్ణయంతోనే-పాలిట్ బ్యూరో కీలక భేటీ : బద్వేలు పోటీకి దూరంగా - ఏకగ్రీవం కాదు..!!
బద్వేలు బై పోల్ పోరు నుంచి టీడీపీ తప్పుకుంది. బద్వేలు షెడ్యూల్ విడుదలకు ముందే టీడీపీ అక్కడ అభ్యర్ధిని ఖరారు చేసింది. అయితే, షెడ్యూల్ వచ్చిన తరువాత వైసీపీ తమ అభ్యర్ధిగా మరణించిన ఎమ్మెల్యే వెంకట సుబ్బయ్య సతీమణి సుధను ఎంపిక చేసింది. 2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసిన వెంకట సుబ్బయ్య గెలుపొందారు. అయితే, అనారోగ్యంతో ఆయన మరణించటంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. దీంతో..టీడీపీ ముందుగానే తమ అభ్యర్ధిని ఖరారు చేసింది.

ఇప్పటికే అభ్యర్ధిని ఖరారు చేసిన టీడీపీ
2019 ఎన్నికల్లో వెంకట సుబ్బయ్య మీద పోటీ చేసి ఓడిపోయిన పార్టీ అభ్యర్ధి ఓబులాపురం రాజశేఖర్ ను తిరిగి అభ్యర్ధిగా ఖరారు చేసారు. దీంతో..అప్పటి వరకు మౌనంగా ఉన్న వైసీపీ..ఎన్నికల షెడ్యూల్ విడుదల కాగానే..వెంకట సుబ్బయ్య సతీమణి సుధను పోటీలోకి దించుతూ నిర్ణయం తీసుకుంది. ఉప ఎన్నిక పైన ముఖ్యమంత్రి జగన్ సమీక్ష ఏర్పాటు చేసి నాయకులకు బాధ్యతలు సైతం కేటాయించారు. ఇదే సమయంలో పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల మరణించిన ఎమ్మెల్యే సతీమణి పోటీ చేస్తుండటంతో ప్రతిపక్షాలు పోటీ లేకుండా ఏకగ్రీవానికి సహకరించాలని కోరారు.

పవన్ నిర్ణయంతో టీడీపీ పైన ఒత్తిడి
దీని పైన టీడీపీ వెంటనే స్పందించ లేదు. తాజాగా వైసీపీ ప్రభుత్వం పైన ఫైర్ అవుతున్న జనసేన అధినేత ముందుగా తన నిర్ణయం ప్రకటించారు. జనసేన - బీజేపీ పొత్తు లో భాగంగా.. బద్వేలు నుంచి జనసేన అభ్యర్ధిని బరిలో ఉంచాలని బీజేపీ కోరింది. అయితే, పవన్ కళ్యాణ్ తాము వైసీపీతో పోరాటం చేస్తున్నా..విలువలకు ప్రాధాన్యత ఇస్తూ మరణించిన ఎమ్మెల్యే సతీమణి పోటీ లో ఉండటంతో తాము పోటీ చేయటం లేదని ప్రకటించారు. దీంతో..జనసేన సహకారం ఉన్నా..లేకున్నా తాము పోటీ చేయాలని బీజేపీ డిసైడ్ అవుతోంది. పవన్ నిర్ణయం రాగానే టీడీపీలో అంతర్మధనం మొదలైంది.

పోటీకి దూరంగా ఉండాలని నిర్ణయం
జనసేన విలువల పేరుతో ..సాంప్రదాయాలను గుర్తు చేస్తూ బరి నుంచి తప్పుకుంటే ..తాము పోటీ చేయటం కరెక్టా కాదా అనే చర్చ పార్టీలో మొదలైంది. దీని పైన పార్టీ నేతల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. దీంతో పార్టీ అధినేత జూమ్ మీటింగ్ ద్వారా పార్టీ పాలిట్ బ్యూరో సమావేశం నిర్వహించారు. అందులో చర్చించిన తరువాత పోటీకి దూరంగా ఉండటమే మంచిదనే అభిప్రాయానికి వచ్చారు. ఉమ్మడి ఏపీ లో మరణించిన ఎమ్మెల్యేల కుటుంబ సభ్యులకు టిక్కెట్లు ఇచ్చాక అక్కడ ఏకగ్రీవం చేసే సాంప్రదాయం నెలకొల్పింది టిడిపి అని అభిప్రాయపడ్డ పాలిట్ బ్యూరో.. తామే దానిని కొనసాగించాల్సిన అవసరం ఉందనే నిర్ణయానికి వచ్చారు.
Recommended Video

అయినా బద్వేలులో పోటీ ఖాయం
నంద్యాల ఉప ఎన్నికల్లో వైసీపీ ఆ సంప్రదాయాన్ని పాటించే లేదనీ గుర్తు చేసిన టిడిపి నేతలు..ఇప్పుడు ఆ విషయాన్ని ప్రస్తావిస్తూనే.. తాము మాత్రం సాంప్రదాయాలను పాటిస్తామని చెప్పాలని డిసైడ్ అయ్యారు. అభ్యర్థిగా ఎంపిక చేసిన రాజశేఖర్.. విజయమ్మ ఇతర టిడిపి నేతలతో మాట్లాడి నిర్ణయం ప్రకటించాలని పాలిట్ బ్యూరో తీర్మానించింది. టీడీపీ ఇప్పుడు దూరమైన బద్వేలు లో మాత్రం ఏకగ్రీవం అయ్యే అవకాశం కనిపించటం లేదు. బీజేపీ తో పాటుగా కాంగ్రెస్ సైతం తమ అభ్యర్ధిని రంగంలోకి దించటం ఖాయంగా కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications