Weather Update: ఏపీకి భారీ వర్ష సూచన.. భయపడిపోతున్న విజయవాడ వాసులు..!

వారం క్రితం భారీ వర్షాలతో అతలాకుతలమైన విజయవాడ ఇప్పుడిప్పుడే తేరుకుంటోంది. అయితే వాతావరణ శాఖ హెచ్చరిక విజయవాడ వాసులకు నిద్ర పట్టనివ్వడం లేదు. వాతావరణ శాఖ ఏపీలో మరోసారి భారీ వర్షాలు కురుస్తాయని అలర్ట్ జారీ చేసింది. రానున్న 24 గంటల్లో ఏపీలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం అంచనా వేసింది. తూర్పూగోదావరి, ఎన్టీఆర్ పశ్చిమ గోదావరి, ఏలూరు అల్లూరి జిల్లాలకు రెడ్‌ అలర్ట్ జారీ చేసింది.

పార్వతీపురం, విశాఖ, అంబేడ్కర్‌ కోనసీమ, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఇచ్చింది. భారీ వర్షాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని అధికారులు సూచిస్తున్నారు. ఈ భారీ వర్షాల కారణంగా విజయవాడకు మరింత వరద వచ్చే అవకాశం ఉందని అంచనా వేశారు. అన్నింటినీ ఎదుర్కొవాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు.

The weather department has predicted heavy rains in AP for the next two days

దీంతో విజయవాడ వాసులు బిక్కు బిక్కు మంటు ఉన్నారు. ఇప్పటికే చాలా మంది సురక్షిత ప్రాంతాలకు వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటు తెలంగాణలోని భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరో మూడు రోజులు పాటు కూడా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యం లో అధికారులు అప్రమత్తమయ్యారు.

ఆదివారం భూపాల‌ప‌ల్లి, ములుగు, కొత్త‌గూడెం, ఆసిఫాబాద్, మంచిర్యాల‌ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వ‌ర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఆదిలాబాద్, క‌రీంన‌గ‌ర్, పెద్ద‌ప‌ల్లి, ఖ‌మ్మం, వ‌రంగ‌ల్, హ‌నుమ‌కొండ జిల్లాల్లో భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని పేర్కొంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+