పంజాగుట్టలో భారీ చోరీ: 10 కిలోల బంగారం అపహరణ

నిర్వాహకులు సమాచారంతో పశ్చిమ డిసిపి సత్యనారాయణ, అదనపు డిసిపి నాగరాజులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నట్లు వారు తెలిపారు. కాగా చోరీకి పాల్పడిన దుండగులు.. సేఫ్ లాకర్‌ను పగలగొట్టి బంగారు నగలతోపాటు వెండి వస్తువులను కూడా అపహరించినట్లు తెలిసింది. ముగ్గురు ఆగంతకులు మాస్కులు ధరించి చోరీకి పాల్పడినట్లు సిసి కెమెరాల్లో రికార్డైనట్లు సమాచారం.
ఈ చోరీకి పాల్పడింది అంతరాష్ట్ర దొంగల ముఠా పనే అయి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. పక్కా ప్రణాళిక ప్రకారం దొంగలు చోరీకి పాల్పడిటన్లు పోలీసులు చెబుతున్నారు. శుక్రవారం అర్ధరాత్రి తర్వాత దుకాణంలో చోరీ జరిగినట్లు పోలీసులు అంచనా వేస్తున్నారు. చోరీ అదే సమయంలో జరిగినట్లయితే దొంగలు ఇప్పటికే రాష్ట్రం విడిచి వెళ్లే అవకాశం కూడా ఉంది. కాగా రాత్రి దుకాణం వద్ద సెక్యూరిటీ గార్డుగా విధి నిర్వహణలో ఉన్నది ఎవరన్నదానిపై కూడా పోలీసులు విచారించనున్నారు.
శనివారం ఉదయం పదిన్నరకు పోలీసులకు ఫిర్యాదు రావడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. దుకాణంలోని సిసిటివి ఫుటేజితోపాటు ట్రాఫిక్ జంక్షన్ల వద్ద ఉన్న సిసి కెమెరాల ఫుటేజిని కూడా పోలీసులు పరిశీలించే అవకాశం ఉంది. కాగా తనిష్క్ ఆభరణాల షోరూం పోలీస్ స్టేషన్‌కు సమీపంలోనే ఉండటం గమనార్హం.












Click it and Unblock the Notifications