కిలాడీలు: పట్టపగలే మూడిళ్లలో చోరీ, 32.50లక్షల సొత్తు చోరీ(పిక్చర్స్)

విశాఖపట్నం: నగరంలోని ఏయూ క్వార్టర్స్‌లోని మూడు ఇళ్లలో పట్టపగలు జరిగిన చోరీల్లో మొత్తం 32.50 లక్షల సొత్తు అపహరణకు గురైంది. మంగళవారం పట్టపగలు జరిగిన ఈ ఘటన నగరంలో సంచలనం రేపింది. సుమారు 95 తులాల బంగారు ఆభరణాలు, 50 తులాల వెండి, రూ. 1.90 లక్షల నగదును దొంగలు చోరీ చేశారు.

చోరీల సమాచారం అందుకున్న ఎంవిపి స్టేషన్‌ సిఐ విద్యాసాగర్‌ ఆధ్వర్యంలో ఎస్‌ఐలు భరత్‌కుమార్‌రాజు, దామోదర్‌, సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. డాగ్‌ స్క్వాడ్‌, క్లూస్‌ టీంను రప్పించి ఆధారాలు సేకరించారు. పోలీసు జాగిలం ఆదర్శనగర్‌ కాలనీ నుంచి ఎంవీపీ సర్కిల్‌ వరకు వెళ్లింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఏయూ రిజిస్ట్రార్‌ ఉమామహేశ్వరరావు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. బాధితులను పరామర్శించారు. చోరీ వివరాలు అడిగి తెలుసుకున్నారు. రిజిస్ట్రార్‌తోపాటు, ఏయూ సిబ్బంది హాజరయ్యారు.

పట్టపగలే చోరీలు

పట్టపగలే చోరీలు

విశాఖపట్నం నగరంలోని ఏయూ క్వార్టర్స్‌లోని మూడు ఇళ్లలో పట్టపగలు జరిగిన చోరీల్లో మొత్తం 32.50 లక్షల సొత్తు అపహరణకు గురైంది.

పట్టపగలే చోరీలు

పట్టపగలే చోరీలు

మంగళవారం పట్టపగలు జరిగిన ఈ ఘటన నగరంలో సంచలనం రేపింది. సుమారు 95 తులాల బంగారు ఆభరణాలు, 50 తులాల వెండి, రూ. 1.90 లక్షల నగదును దొంగలు చోరీ చేశారు.

పట్టపగలే చోరీలు

పట్టపగలే చోరీలు

పెదవాల్తేరులోని రామలక్ష్మి ఎస్టేట్స్‌ ఎదురుగా గల ఏయూ క్వార్టర్స్‌లోని మూడు ఇళ్లలో మంగళవారం మధ్యాహ్నం 12 నుంచి ఒంటి గంట మధ్యలో ఏకకాలంలో చోరీ చేసి దుండగులు పరారయ్యారు.

పట్టపగలే చోరీలు

పట్టపగలే చోరీలు

ఏయూలో సీనియర్‌ అసిస్టెంట్‌ అబ్దుల్‌ హమీద్‌ ఇంట్లో రూ.40 వేల నగదు, 40 తులాల బంగారం, ఏయూలో ఆడిట్‌ అధికారి కె.బి.ఎన్‌. స్వర్ణలత ఇంట్లో 40 తులాల బంగారం, 30 వేల నగదు, 50 తులాల వెండి, ఏయూలో అసిస్టెంట్‌ రిజిస్ట్రార్‌ సుజాతకుమారి ఇంట్లో రూ. 1.20 లక్షల నగదు, 5 తులాల బంగారు నగలు అపహరించారు.

పట్టపగలే చోరీలు

పట్టపగలే చోరీలు

మధ్యాహ్నం 12 నుంచి ఒంటి గంట మధ్యలో సంఘటనలు జరగడం చూస్తే క్వార్టర్స్‌లో ఉద్యోగుల కదలికలు గమనించి పక్కా ప్రణాళికతో చోరీకి పాల్పడినట్లు తెలుస్తోంది. ఏయూలో సీనియర్‌ అసిస్టెంట్‌ అబ్దుల్‌ హమీద్‌ ఇంటి తాళం పగులగొట్టి లోపలికి ప్రవేశించిన దొంగలు పడకగది తాళాన్ని బద్దలుకొట్టారు.

పట్టపగలే చోరీలు

పట్టపగలే చోరీలు

బీరువా తలుపులు పెకలించి రూ. 40 వేల నగదు, 40 తులాల బంగారం చోరీ చేశారు. ఇతర వస్తువులు సైతం వెదికి ఇంట్లో వస్తువుల్ని చెల్లాచెదురు చేశారు. హమీద్‌ భార్య హసీనా కూడా ఏయూ ఉద్యోగే. వీరి ముగ్గురు కుమార్తెలను ఉదయం పాఠశాలకు పంపి ఏయూకు వెళ్లిపోయారు.

పట్టపగలే చోరీలు

పట్టపగలే చోరీలు

తిరిగి 12.45 గంటలకు ఇంటికిరాగా, తలుపు తాళం పగులగొట్టి ఉంది. ఇంట్లోకి వెళ్లి చూసి, చోరీ జరిగినట్లు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఇటీవల ఇంట్లో జరిగిన ఓ కార్యక్రమం సందర్భంగా లాకర్‌ నుంచి బంగారు వస్తువులు తెచ్చినట్లు బాధితులు తెలిపారు.

పట్టపగలే చోరీలు

పట్టపగలే చోరీలు

ఏయూలో ఆడిట్‌ అధికారి కెబిఎన్‌ స్వర్ణలత ఉదయం పిల్లల్ని పాఠశాలకు పంపి ఏయూలో విధులకు వెళ్లారు. తిరిగి మధ్యాహ్నం ఒంటి గంటకు ఇంటికిరాగా తలుపులు తీసి ఉన్నాయి. పడకగది తలుపు కూడా తెరిచి ఉంది. చీరలు, వస్తువులు చిందరవందరగా పడి ఉన్నాయి.

పట్టపగలే చోరీలు

పట్టపగలే చోరీలు

మూడు రోజుల కిందట కొన్న కొత్త బీరువా పగులగొట్టి ఉంది. అందులోని 40 తులాల బంగారం, 50 తులాల వెండి వస్తువులు, రూ. 30 వేల నగదు అపహరించారు. ఇంట్లో ఉన్న అన్ని అల్మారాల్లో వస్తువులను లాగిపారేసి చిందరవందర చేశారు.

పట్టపగలే చోరీలు

పట్టపగలే చోరీలు

అలాగే, ఏయూలో అసిస్టెంట్‌ రిజిస్ట్రార్‌ సుజాతకుమారి ఇంట్లో సుమారు రూ. 1.20 లక్షల నగదు, 5 తులాల బంగారు నగలు అపహరించారు. భర్త విధులకు, కుమార్తె కళాశాలకు వెళ్లిన తరువాత ఈమె ఏయూలో విధులకు వెళ్లారు.

పట్టపగలే చోరీలు

పట్టపగలే చోరీలు

పైఅంతస్తులోని స్వర్ణలత ఇంట్లో చోరీ చేసిన సమయంలో అక్కడి రెండు కొత్త తాళంకప్పలను తీసుకువచ్చి సుజాతకుమారి ఇంటి ప్రధాన తలుపులకు వేశారు. వెనుకవైపు నుంచి లోపలికి ప్రవేశించారు. ఇంటికి వచ్చిన సుజాతకుమారి తలుపులకు కొత్త తాళాలు వేసి ఉండటం గమనించి, వెనుకవైపు వెళ్లి చూడగా తలుపులు తెరిచి ఉన్నాయి. విషయం గమనించిన ఆమె పోలీసులకు, ఏయూ అధికారులకు సమాచారం అందించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+