వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అప్పుడు వైఎస్, ఇప్పుడు జగన్- అందరూ కలిసొచ్చినా వారినేం చేయలేరు- జోగి రమేష్ కామెంట్స్

|
Google Oneindia TeluguNews

పాదయాత్ర కు వెళ్లి ఇచ్చిన హామీలు నెరవేర్చిన ఘనుడు జగన్ మోహన్ రెడ్డి అని ఏపీ గృహనిర్మాణశాఖ మంత్రి జోగి రమేష్ అన్నారు. దేశంలో ఎవ్వరూ చేయలేని పాదయాత్ర చేసిన నిజమైన నాయకుడు జగన్ అన్నారు. ఒకే ఒక్కడు ఒకే ఒక్క జెండా మీద 151 సీట్లు గెలిపించిన ధీరుడు జగన్ అని పొగడ్తల్లో ముంచెత్తారు. ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గంలో నిర్వహించిన వైసీపీ ప్లీనరీ ఇందుకు వేదికైంది

కులం మతం చూడకుండా పథకాలు అమలు చేస్తున్న ఏకైక వ్యక్తి జగన్ మోహన్ రెడ్డి అని మంత్రి జోగి రమేష్ వ్యాఖ్యానించారు. జగన్ అన్న బటన్ నొక్కితే నేరుగా ప్రజల వద్దకు పథకం అమలు చేస్తున్న ఏకైక పార్టీ వైకాపా అన్నారు.ఓటు వేయని వాళ్లకు కూడా సంక్షేమ పథకాలు ఇస్తున్న ఘనత వైకాపాదేనన్నారు. విద్య రంగానికి పెద్ద పీట వేసిన నిజమైన నాయకుడు జగన్ అని జోగి ప్రశంసించారు. అక్క చెల్లెమ్మలకు నిజమైన అన్నయ్య జగన్ అని జగన్ మంత్రి వ్యాఖ్యానించారు.

then ysr, now ys jagan-none can defeat them- ap minister jogi ramesh comments

Recommended Video

పక్కా కమర్షియల్ పక్కా genuine రివ్యూ *Entertainment | Telugu OneIndia

అందరూ కలిసి వచ్చిన జగన్ నీ ఏమి పికలేరంటూ జోగి రమేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు.మహాత్మ గాంధి కలలు కన్నా గ్రామ స్వరాజ్యంను నెరవేర్చిన వ్యక్తి జగన్ అని ఆయన తెలిపారు. సామాజిక న్యాయం చేసిన అభినవ పులే జగన్ అన్నారు. సింహం తరుపున సిమహమే పుడతాడు ఆ సింహమే జగన్ అన్నారు. చంద్రబాబు పొట్టులతో వచ్చిన జగన్ ఏమి చెయ్యలేరన్నారు.పవన్ కళ్యాణ్ వల్ల ఒరిగేదేమీ లేదని జోగి రమేష్ పేర్కొన్నారు. వచ్చే ఎన్నికలలో అన్ని పార్టీలను భూస్థాపితం చెయ్యడం తద్ద్యమన్నారు. ఈ నెల 8,9 తేదీలలో జరిగే పార్టీ పెద్ద పండుగను జయప్రదం చేయాలని జోగి పిలుపునిచ్చారు. మైలవరం వైకాపా అడ్డా అని ఆయన అన్నారు. జగనన్న ఆదేశం తనకు శరణ్యమని ,
సామాజిక న్యాయం చేసిన వ్యక్తి జగన్ అని అన్నారు. జగన్ మీద ఈగ వాలితే సహించేది లేదన్నారు.ఖబడ్దార్ చంద్రబాబు అని హెచ్చరించారు.

English summary
ap minister jogi ramesh on today praised his own govt and compares it past ysr regime.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X