'గమనించండి.. ప్రత్యేక హోదాకు, ప్యాకేజీకి తేడా లేదు'
ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజీకి తేడా లేదని, దీనిని ప్రజలు గమనించాలని మంత్రి పత్తిపాటి పుల్లారావు శుక్రవారం నాడు చెప్పారు. ప్రత్యేక హోదాతో వచ్చే నిధులు ప్యాకేజీ ద్వారా ఇస్తామంటేనే ఒప్పుకున్నామన్నారు
విజయవాడ: ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజీకి తేడా లేదని, దీనిని ప్రజలు గమనించాలని మంత్రి పత్తిపాటి పుల్లారావు శుక్రవారం నాడు చెప్పారు. ప్రత్యేక హోదాతో వచ్చే నిధులు ప్యాకేజీ ద్వారా ఇస్తామంటేనే ఒప్పుకున్నామన్నారు.
ప్రత్యేక ప్యాకేజీ కింద ఏపీకి రూ. 86వేల కోట్ల నిధులు వస్తాయని గుర్తు చేశారు. నూజివీడులో జన్మభూమి కార్యక్రమంలో పత్తిపాటి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడారు. కాంగ్రెస్ హయాంలో గృహనిర్మాణ పథకంలో రూ. 5వేల కోట్ల కుంభకోణం జరిగిందన్నారు.

తుది దశలో దర్యాప్తు ఉందని, నిందితులకు నోటీసులు జారీ చేస్తామన్నారు. ఈ కుంభకోణం వల్లే రాష్ట్రంలో ఇళ్ల నిర్మాణం చేపట్టలేకపోయామన్నారు. ఈ ఏడాది వర్షాలు తక్కువగానే ఉన్నా దిగుబడి బాగుందన్నారు.












Click it and Unblock the Notifications