విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రాష్ట్రంలోనూ మూడో ప్రత్యామ్నాయం...జగన్ రెడీగా ఉన్నాడు: సీపీఐ

By Suvarnaraju
|
Google Oneindia TeluguNews

Recommended Video

ప్రతి శుక్రవారం కోర్టుకు వెళ్లే వ్యక్తి జగన్‌: రామకృష్ణ

విశాఖపట్నం:సామాన్యులు కూడా అధికారం చేపట్టేలా జాతీయ, రాష్ట్ర రాజకీయాల్లో మార్పు రావాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ, వైసీపీలే ఎందుకు ఉండాలి...మూడో ప్రత్యామ్నాయం ఎందుకు రాకూడదని ఆయన ప్రశ్నించారు.

కామ్రేడ్‌ నీలం రాజశేఖరరెడ్డి శతజయంతి సభ మంగళవారం విశాఖ లోని సీపీఐ కార్యాలయంలో జరిగింది. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ...చంద్రబాబు దిగిపోతే ముఖ్యమంత్రి కుర్చీ ఎక్కాలని జగన్‌ రెడీగా ఉన్నారన్నారు. కానీ ప్రతి శుక్రవారం కోర్టుకు వెళ్లే వ్యక్తి సీఎం అయితే...అవినీతిపరులపై ఎలా చర్యలు తీసుకోగలరని రామకృష్ణ ప్రశ్నించారు.

Third alternative in Andhra Pradesh...Jagan is ready: CPI Ramakrishna

కామ్రేడ్ నీలం రాజశేఖర రెడ్డి గురించి చెబుతూ మార్క్సిస్టు భావజాల అధ్యయనం-వ్యాప్తి, సిపిఐ నాటి రాజకీయ విధాన రూపకల్పన-ఉద్యమ నిర్మాణం, శ్రేణులకు శిక్షణ రంగాలలో అపారమైన కషి సల్పిన ధన్యజీవి నీలం రాజశేఖరరెడ్డి అన్నారు. భారత కమ్యూనిస్టు పార్టీ అగ్ర నేతల్లో ఒకరుగా, మార్క్సిజం, లెనినిజం సిద్ధాంతాన్ని లోతుగా అధ్యయనం చేసిన ఉద్యమకారుడిగా...దోపిడీ సమాజాన్ని కూకటి వేళ్ళతో పెకలించగలిగిన మహత్తర శక్తి మార్క్సిజానికి మాత్రమే ఉందన్న పరిపూర్ణమైన అవగాహనతో ఆయన ఉండేవారన్నారు.

సిద్ధాంత నిబద్ధత - నైతిక విలువలకు నిలువుటద్దం ఆయన వ్యక్తిత్వమని కొనియాడారు. యావత్‌ జీవితాన్ని కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాణానికి అర్పించిన త్యాగశీలి కామ్రేడ్ నీలం రాజశేఖర రెడ్డి అన్నారు. సోషలిస్టు భావజాలంపై యువతకు శిక్షణిచ్చి, ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్ది, ఉద్యమానికి నాణ్యమైన కార్యకర్తలను సమకూర్చి పెట్టాలని నిరంతరం కషి చేసిన దూరదష్టి కలిగిన ఉద్యమ నేత అని తెలిపారు.

English summary
Visakhapatnam:Common man has to take the power in centre and state politics said CPI state secretary K.Ramakrishna. Why should only TDP and YCP...Why should not a third alternative come up?...he questioned.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X