ఇండియాలో ప్రకృతి అందాలతో కట్టిపడేసే బ్యూటీఫుల్ టాప్ 1 రైల్వేస్టేషన్ ఇదే!!

భారతదేశంలో వర్షాకాలంలో ప్రకృతి రమణీయతతో అలరారే ప్రదేశాలు మాత్రమే కాదు ప్రకృతి రమణీయత సంతరించుకున్న రైల్వేస్టేషన్లు పర్యాటకులను ఇట్టే ఆకట్టుకుంటున్నాయి. భారతదేశంలోని ఒక రైల్వే స్టేషన్ అక్కడ దిగిన పర్యాటకులను కట్టిపడేస్తుంది. ఇక్కడే ఉందాం అనేలా మనసును దోచేస్తుంది. దేశంలోనే అత్యంత బ్యూటిఫుల్ రైల్వే స్టేషన్ గా టాప్ 1లో నిలిచింది. మరి ఆ రైల్వే స్టేషన్ ఎక్కడ ఉంది? దాని విశేషాలు ఏమిటి తెలుసుకుందాం?

భారతీయ రైలు ప్రయాణంలో అందాలకు కొదవలేదు. భారతదేశంలోని అనేక ప్రాంతాలు ప్రకృతి అందాలకు నెలవుగా ఉన్నాయి. ఆ ప్రాంతాల్లో నిర్మించిన రైల్వేస్టేషన్లు కూడా అక్కడికి వచ్చిన పర్యాటకులను ఇట్టే ఆకట్టుకుంటున్నాయి. ప్రకృతి అందాలను చూడాలనుకునే వాళ్ళు, వర్షాకాలంలో దేశంలోని కొన్ని బ్యూటిఫుల్ రైల్వే స్టేషన్లకు వెళ్తే అక్కడి ప్రకృతి అందాలతో వారి మనసు ఎంతగానో సేద తీరుతుంది.

karwarrailwaystation

దేశంలోనే అత్యంత అందమైన ప్రకృతి రమణీయత సంతరించుకున్న బ్యూటిఫుల్ రైల్వే స్టేషన్ కార్వార్. కర్ణాటక రాష్ట్రంలో ఉన్న కార్వార్ రైల్వేస్టేషన్‌ పరిసరాల్లో అద్భుతమైన ప్రకృతి అందాలను ఆస్వాదించవచ్చు. ఉత్తర కన్నడ లోని కార్వార్ రైల్వే స్టేషన్ పశ్చిమ కనుమల యొక్క పొగ మంచుతో కప్పబడిన పచ్చని కొండలతో కనువిందు చేసే రైల్వే స్టేషన్.

ఈ స్టేషన్ కొంకణ్ రైల్వే ద్వారా అనుసంధానం చేయబడి ఉంది.1887లో బ్రిటీష్ వారిచే ఏర్పాటు చేయబడింది అందమైన కార్వార్ పట్టణం. దీనిని కర్ణాటక కాశ్మీర్ అని పిలుస్తారు. 1994లో ఇక్కడ కార్వార్ రైల్వే స్టేషన్ ప్రారంభించబడింది.. కార్వార్ రైల్వే స్టేషన్ ఢిల్లీ, బెంగళూరు, కోయంబత్తూరు, ఎర్నాకులం, ముంబై, జైపూర్, ఇండోర్ వంటి ప్రధాన భారతీయ నగరాలకు అనుసంధానం చేయబడి ఉంది.

ఈ స్టేషన్ యొక్క అందాలు చూడాలంటే ఈ సీజనే సరైన సీజన్ అని చెప్పొచ్చు. వర్షధారల మధ్య చుట్టూ కొండలు గుట్టలు, పచ్చనైన ప్రకృతి, ప్రశాంతమైన వాతావరణంతో కార్వార్ ఈ సీజన్ లో తన అందాలతో ఆకట్టుకుంటుంది. దేశంలోనే బ్యూటిఫుల్ రైల్వే స్టేషన్లలో టాప్ వన్ స్థానంలో ఉన్న కార్వార్ రైల్వే స్టేషన్ అందాలు ఈ సీజన్ లో వెళ్లి చూసి రండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+