కోటంరెడ్డిపై వేటుకు ఆ ఐదుగురే అడ్డంకి ? అసలు విషయం బయటపెట్టిన రఘురామ !
వైసీపీ రెబెల్ ఎమ్మెల్యేపై వైసీపీ చర్యలు తీసుకోలేకపోవడం వెనుక ఐదుగురు పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఉన్నారని రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు వెల్లడించారు.
నెల్లూరు రెబెల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి విషయంలో వైసీపీ ఎందుకు చర్యలు తీసుకోలేకపోతోంది ? పార్టీ నుంచి వీడేందుకు సిద్ధమైనా, ప్రత్యర్దిపార్టీ నుంచి పోటీ చేస్తానని చెబుతున్నా, ఫోన్ ట్యాపింగ్ పేరుతో ప్రభుత్వం ప్రతిష్ట మసకబారుస్తున్నా వైసీపీ ఏం చేయలేని నిస్సహాయ స్ధితిలో ఎందుకుంది ? దీని వెనుక ఉన్నదెవరు ? ఈ వివరాల్ని వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు ఇవాళ వెల్లడించారు.

కోటంరెడ్డిపై వైసీపీ చర్యలు
నెల్లూరు రూరల్ నియోజకవర్గం నుంచి వైసీపీ ఎమ్మెల్యేగా గెలిచి, తాజాగా అధిష్టానం అగ్రహానికి గురై తిరుగుబాటు చేస్తున్న కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వ్యవహారం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారుతోంది. కోటంరెడ్డి ఫోన్ ట్యాపింగ్ పేరుతో చేసిన విమర్శలకు రాజకీయంగా మాత్రమే కౌంటర్లు ఇప్పించిన వైసీపీ.. ఇప్పుడు ఆయన కొనసాగిస్తున్న విమర్శల దాడి విషయంలో ఏం చేయాలనే దానిపై మల్లగుల్లాలు పడుతోంది. కోటంరెడ్డిపై చర్యలు తీసుకునేందుకు వైసీపీ దూకుడుగా ముందుకెళ్లడం లేదు. దీంతో వైసీపీ వైఖరిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

కోటంరెడ్డి ఎపిసోడ్ పై రఘురామ
తనలాగే రెబల్ గా మారిన కోటంరెడ్డి వ్యవహారంలో రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు ఇవాళ స్పందించారు. వైసీపీతో విబేధిస్తున్న రఘురామకు మించి తనపై వేధింపులు ఉంటాయని తెలుసంటూ నిన్న కోటంరెడ్డి కూడా స్పందించిన నేపథ్యంలో రఘురామ రియాక్ట్ అయ్యారు. కోటంరెడ్డి వ్యవహారంలో ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోలేని నిస్సహాయ స్ధితిలోకి వెళుతోందన్న దానిపై రఘురామ తనదైన శైలిలో వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు ప్రస్తుతం జగన్, కోటంరెడ్డి ఇద్దరి పరిస్ధితినీ రఘురామ విశ్లేషించారు.

జగన్ దురదృష్టవంతుడు, కోటంరెడ్డి అదృష్టవంతుడు
వైసీపీపై కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తిరుగుబాటు నేపథ్యంలో వైఎస్ జగన్ పరిస్ధితితో ఆయన పరిస్ధితిని రఘురామరాజు పోల్చారు. ఇందులో కోటంరెడ్డిని వదులుకున్న జగన్ దురదృష్టవంతుడని, కానీ జగన్ ను వదులుకుంటున్నందుకు కోటంరెడ్డి అదృష్టవంతుడని రఘురామరాజు వ్యాఖ్యానించారు. ఎవరో కొందరి చర్యల వల్ల కోటంరెడ్డి ఆత్మాభిమానం దెబ్బతినదంటూ రఘురామ వెల్లడించారు. శ్రీధర్ రెడ్డి తన మనోవేదన చెప్పుకున్నారని, ఆయనకు ప్రజా మద్దతు ఉంటుందని రెబెల్ ఎంపీ స్పష్టం చేసారు.

కోటంరెడ్డిపై వేటు లేటుకు ఐదుగురే అడ్డంకి ?
కోటంరెడ్డిపై ప్రస్తుతం వైసీపీ చర్యలు తీసుకోవాలనుకుంటే పార్టీ నుంచి బహిష్కరించడం మినహా మరో మార్గం లేదన్నారు. అలా కాకుండా అనర్హత వేటు వేస్తే మాత్రం ఇప్పటికే పార్టీలు ఫిరాయించిన ఐదుగురు ఎమ్మెల్యేలపై కూడా చర్యలు తీసుకోవాల్సి వస్తుందన్నారు. అందుకే కోటంరెడ్డిపై చర్యలు తీసుకోలేకపోతున్నారని రఘురామ తెలిపారు. కోటంరెడ్డిపై పార్టీ పరంగా వేటు వేస్తే ఆయన అధికారికంగా టీడీపీలో చేరిపోయే అవకాశం ఉందన్న ప్రచారం నేపథ్యంలో రఘురామ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
-
కటౌట్ కు తగ్గ పర్ఫెక్ట్ ఫిల్మ్- టైటిల్ గూస్ బంప్స్: విజువల్ వండర్ -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!!












Click it and Unblock the Notifications