వివాహితపై గ్యాంగ్ రేప్: భర్త ఫిర్యాదుతో వెలుగు చూసిన వైనం....

విజయవాడ: వివాహితపైసామూహిక అత్యాచారానికి పాల్పడిన ముగ్గురు వ్యక్తులను కర్నూలు పోలీసులు శుక్రవారంనాడు అరెస్ట్‌ చేశారు. కర్నూలు నగర సమీపంలోని ఈ-తాండ్రపాడు గ్రామానికి చెందిన ఓ మహిళలపై ముగ్గురు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారు.

బాధిత మహిళ విషయం భర్తకు చెప్పడానికి భయపడి బంధువుల ఇంటికి వెళ్లిపోయింది. భార్య ఆచూకీ కోసం భర్త పోలీసులను ఆశ్రయించాడు. దీంతో అత్యాచార విషయం వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో అదే గ్రామానికి చెందిన ముగ్గురు నిందితులను అరెస్టు చేసినట్లు ఎస్పీ రవికృష్ణ తెలిపారు.

rape

నిందితులను బాలరాజు, దుబ్బకృష్ణ, కుమార్‌లుగా గుర్తించారు. మహిళలపై దాడులు, అఘాయిత్యాలకు పాల్పడేవారిపై రౌడీషీట్లు తెరుస్తామని ఆయన హెచ్చరించారు. శుక్రవారం స్థానిక జిల్లా పోలీసు కార్యాలయంలో డీఎస్పీ రమణమూర్తి, కర్నూలు గ్రామీణ పోలీసుస్టేషన్‌ సీఐ మహేశ్వరెడ్డి, ఎస్సై గిరితో కలిసి మీడియా సమావేశం ఏర్పాటుచేసి వివరాలు వెల్లడించారు.

మహిళలపై జరిగే నేరాలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని, త్వరితగతిన ఛార్జిషీటు దాఖలు చేయించి నేరస్తులకు శిక్షపడేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఆదోని సబ్‌డివిజన్‌ పరిధిలో జరిగిన మరో సాముహిక అత్యాచారం కేసు దర్యాప్తు త్వరితగతిన పూర్తిచేస్తామన్నారు.

ఇదిలావుంటే, తెలుగు రాష్ట్రాల్లో దోపిడీలకు పాల్పడుతున్న దొంగల ముఠాను కృష్ణా జిల్లా బాపుల పాడు మండలం వీరవల్లి జంక్షన్‌ పోలీసులు అరెస్టు చేశారు. వీరి నుంచి 27 సెల్‌ఫోన్లు, రెండు బంగారు ఉంగరాలు, ఓ కారు, దాడులకు ఉపయోగించిన ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు.

నిందితులను అరెస్టును నూజివీడు డీఎస్పీ శ్రీనివాసరావు వెల్లడించారు. ఈ ముఠా సుమారు 25 దొంగతనాలకు పాల్పడి రూ.2.50లక్షల సొత్తును దోపిడీ చేసిందని తెలిపారు. నిందితులను అరెస్టు చేసిన వీరవల్లి జంక్షన్‌ పీఎస్‌ సీఐ, ఎస్‌ఐ, సిబ్బందికి నగదు రివార్డులు అందజేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+