సిటీలో డ్రగ్ రాకెట్ రట్టు: ముగ్గురి అరెస్ట్, కిలో పట్టివేత

 three arrested in drug racket in Hyderabad
హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని రాజేంద్ర నగర్ ప్రాంతంలో డ్రగ్ రాకెట్ ముఠాను ఎస్‌వోటి పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. డ్రగ్ రాకెట్‌కు చెందిన ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుండి కిలో మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను ఎస్‌వోటి పోలీసులు రాజేంద్ర నగర్ పోలీసులకు అప్పగించారు. వారు మాదక ద్రవ్యాలను విద్యార్థులకు, వ్యాపారులకు సరఫరా చేస్తున్నట్లుగా తెలుస్తోంది.

ఆర్టీఏ తనిఖీలు

రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేటు బస్సులపై ఆర్టీఏ తనిఖీలు కొనసాగుతున్నాయి. శుక్రవారం ఉదయం నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న 11 బస్సులను సీజ్ చేశారు. కృష్ణా జిల్లా గరికపాడు చెక్‌పోస్టు దగ్గర ఎన్‌హెచ్-65పై అధికారులు తనిఖీలు నిర్వహించి ప్రైవేటు ట్రావెల్స్‌కు చెందిన ఐదు బస్సులను సీజ్ చేశారు.

రౌడీషీటర్ దారుణ హత్య

హైదరాబాదులోని రెయిన్ బజార్‌లో ఓ రౌడీషీటర్ దారుణ హత్యకు గురయ్యాడు. గుర్తు తెలియని వ్యక్తులు అతనిని కత్తులతో పొడిచి చంపారు.

వ్యక్తి సజీవ దహనం

మహబూబ్ నగర్ జిల్లాలో ఓ వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు సజీవ దహనం చేశారు.

బస్సు బోల్తా

విశాఖపట్నంలోని యారాడ కొండపైన ప్రయివేటు బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో పలువురికి గాయాలయ్యాయి.

కారులో పగులగొట్టి చోరీ

ఖమ్మం జిల్లా పాలేరులో కారు అద్దాలు పగులగొట్టి కొందరు గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. నలభై తులాల బంగారం, రూ.5.5 లక్షలను ఎత్తుకెళ్లారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+