ఏపీలో లాగా విలీనం తర్వాత ఇబ్బందులు వద్దు.. ఆర్టీసీ విలీనంపై మంత్రి పొన్నం వ్యాఖ్యలు

తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే అంశంపై కీలక వ్యాఖ్యలు చేశారు. కార్మికులకు ఇచ్చిన అన్ని హామీలను పూర్తి స్థాయిలో అమలు చేస్తామని స్పష్టం చేశారు. విలీన ప్రక్రియను సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్తున్నామని అన్నారు.

ఆర్టీసీ విలీనం విషయంలో ఏపీతో పోలుస్తూ మంత్రి కీలక వ్యాఖ్యలు

ఏపీలో జరిగినట్లుగా ఎలాంటి సమస్యలు రాకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. కొందరు కార్మిక సంఘాల నేతలు నిజాలను వక్రీకరించి కార్మికులను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు చేస్తున్నారని ఆయన బాధ వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఆర్టీసీ విలీనం విషయంలో పారదర్శకంగా వ్యవహరిస్తోందని మంత్రి తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో విలీనం తర్వాత కార్మికులు ఎదుర్కొన్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని తెలంగాణలో అలాంటి పరిస్థితులు ఏర్పడకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు.

TGSRTC Merge minister ponnam prabhakar said learning from AP s experience to avoid RTC post-merger issues

ఆర్టీసీ కార్మికుల డిమాండ్లలో కీలకమైన వాటిపై ఫోకస్

ఇందులో భాగంగా ఆర్టీసీ గుర్తింపు సంఘాల ఎన్నికలు నిర్వహించి, వాటి ద్వారా వచ్చిన ప్రతినిధులను విలీన కమిటీలో చేర్చి విధివిధానాలు రూపొందించాలని నిర్ణయించామని ఆయన తెలిపారు. ఆర్టీసీ కార్మికుల మొదటి డిమాండ్ గుర్తింపు సంఘాల ఎన్నికలేనని గుర్తు చేశారు. కానీ కొందరు నేతలు ఇప్పుడు మాట మార్చుతున్నారని ఆరోపించారు. 2021 పీఆర్‌సీ అమలు, గుర్తింపు సంఘాల ఎన్నికలు, ప్రభుత్వ విలీనం - ఇవి మూడు కీలక అంశాలని పేర్కొన్నారు.

జూలై నెల జీతం నుంచి అమల్లోకి 11 శాతం పీఆర్‌సీ

11 శాతం పీఆర్‌సీ జూలై నెల జీతం నుంచి అమల్లోకి వస్తుందని ప్రకటించారు. గుర్తింపు సంఘాల ఎన్నికల ప్రక్రియను ఇప్పటికే ప్రారంభించినట్లు మంత్రి వెల్లడించారు. లేబర్ జాయింట్ కమిషనర్ సునీతను నోడల్ అధికారిగా నియమించామని చెప్పారు. ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసి వెరిఫికేషన్ ప్రక్రియ త్వరగా పూర్తి చేసి ఎన్నికలు నిర్వహించనున్నామన్నారు. ఈ ఎన్నికల ద్వారా ఎన్నికైన కార్మిక నాయకులను విలీన కమిటీలో చేర్చి కార్మికుల ప్రయోజనాలను సమర్థంగా కాపాడేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

తిట్లదండకమే వైసీపీ విధానం.. అలా అయితే బాలినేని ఎందుకు వస్తారు: పవన్ కళ్యాణ్
తిట్లదండకమే వైసీపీ విధానం.. అలా అయితే బాలినేని ఎందుకు వస్తారు: పవన్ కళ్యాణ్

విలీనం తర్వాత ఎలాంటి ఇబ్బందులు రాకుండా సమగ్ర ప్రణాళిక

కార్మికుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తోందని మంత్రి స్పష్టం చేశారు. అసత్య ప్రచారాలను నమ్మకుండా కార్మికులు నిజాలను అర్థం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. విలీనం తర్వాత ఎలాంటి ఇబ్బందులు రాకుండా సమగ్ర ప్రణాళికతో ముందుకు వెళ్తున్నామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ ప్రక్రియలో కార్మికుల హక్కులు, సౌకర్యాలు పూర్తిగా కాపాడబడతాయని భరోసా ఇచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+