జగన్ సంచలనం- మూడు రాజధానుల బిల్లులు వెనక్కు : హైకోర్టుకు తెలిపిన ప్రభుత్వం..!!
ఏపీ ముఖ్యమంత్రి జగన్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. మూడు రాజధానుల విషయంలో తమ ప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లులను ఉప సంహరించుకున్నారు. ఇదే విషయాన్ని ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ ఏపీ హైకోర్టు ధర్మాసంనకు తెలిపారు. ప్రస్తుతం జరుగుతున్న కేబినెట్ సమావేశంలోనూ ఇదే నిర్ణయం తీసుకుంటున్నట్లు విశ్వసనీయ సమాచారం. తాజాగా ప్రధాని మోదీ మూడు రైతు చట్టాలను వెనక్కు తీసుకుంటూ నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యమంత్రి జగన్ సైతం అదే బాటలో అడుగు వేసారు. దీనికి సంబంధించి పూర్తి ప్రకటన అసెంబ్లీలో ముఖ్యమంత్రి జగన్ చేయనున్నారు.
Recommended Video

జగన్ సంచలన నిర్ణయం..వెనక్కు
ముఖ్యమంత్రి జగన్ అసెంబ్లీ వేదికగా మూడు రాజదానుల ప్రకటన చేసారు. అమరావతి న్యాయ రాజధానిగా కొనసాగుతుందని స్పష్టం చేసారు. అదే విధంగా విశాఖ ను పరిపాలనా రాజధానిగా ప్రకటించారు. కర్నూలును న్యాయ రాజధానిగా డిసైడ్ చేసారు. జీఎన్ రావు..బోస్టన్ కమిటీ నివేదికల ఆధారంగానే ఈ నిర్నయం తీసుకుంటున్నట్లు వెల్లడించారు. ఇప్పటికే విశాఖలో పరిపాలనా రాజధాని కోసం అనేక నిర్ణయాలు తీసుకున్నారు. కర్నూలులో లోకాయుక్త కార్యాలయం ఏర్పాటు చేసారు. ఇక, అసెంబ్లీలో సీఎం జగన్ ఆ ప్రకటన చేసిన సమయం నుంచి అమరావతి రైతులు ఆందోళన కొనసాగిస్తున్నారు.

కొనసాగుతున్న రైతుల న్యాయ పోరాటం
దీని పైన న్యాయ పోరాటం సాగిస్తున్నారు. కోర్టులో ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు రాజధానుల బిల్లులు..సీఆర్డీఏ చట్టం రద్దు పైన రోజు వారీ విచారణ సాగుతోంది. బిల్లుల ఆమోదం పైన తొలి నుంచి భిన్న వాదనలు వినిపించాయి. దీంతో..ప్రభుత్వం రెండో సారి బిల్లులను ఆమోదించి..గవర్నర్ ఆమోద ముద్రతో వాటిని బిల్లులుగా తీసుకొచ్చింది. ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా హైకోర్టులో దాదాపుగా 60 పిటీషన్లు దాఖలయ్యాయి. ప్రముఖ సుప్రీం కోర్టు న్యాయవాదు లు రైతుల తరపున కోర్టులో వాదనలు వినిపిస్తున్నారు.

బీజేపీ సైతం అమరావతికి మద్దతుగా
ఇక, రాజకీయంగా టీడీపీ..సీపీఐ..సీపీఎం..జనసేన అమరావతి రైతుల దీక్షలకు మద్దతు ప్రకటించాయి. అమరావతిని ఏకైక రాజధానిగా కొనసాగించాలనే డిమాండ్ తో ప్రస్తుతం అమరావతి రైతులు న్యాయస్థానం టు దేవస్థానం పేరుతో పాదయాత్ర చేస్తున్నారు. వీరికి ఇప్పటి వరకు టీడీపీ ..వామపక్షాల మద్దతు ఉంది. తాజాగా, కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆదేశాలతో బీజేపీ నేతలు సైతం రైతులతో కలిసి యాత్రలో పాల్గొన్నారు. అమరావతి రాజధానిగా ఉంటుందని ప్రకటించారు.

హైకోర్టుకు అధికారికంగా వెల్లడి
ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మేరకు అడ్వకేట జనరల్ హైకోర్టుకు రాజధానుల విచారణ సమయంలో వెల్లడించారు. అయితే, ఈ బిల్లులను వెనక్కు తీసుకున్న ప్రభుత్వం పూర్తిగా వెనక్కు తీసుకుందా... లేక ఏదైనా ప్రత్యమ్నాయ ఆలోచనలు చేసిందా అనేది ముఖ్యమంత్రి సభలో స్పష్టత ఇవ్వనున్నారు. అయితే, ఇప్పుడు ఈ నిర్ణయం మాత్రం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారనుంది. ముఖ్యమంత్రి ప్రకటన ద్వారా దీని మీద మరింత స్పష్టత రానుంది.












Click it and Unblock the Notifications