సౌదీ రోడ్డు ప్రమాదంలో ముగ్గురు తెలుగువాళ్ల మృతి
కడప: కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన ముగ్గురు వ్యక్తులు సౌదీ అరేబియాలో (భారత కాలమానం ప్రకారం శుక్రవారం తెల్లవారుజామున నాలుగు గంటలకు) జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ప్రొద్దుటూరు శ్రీనివాసనగర్‌కు చెందిన అర్షద్ కుటుంబం సూపర్‌మార్కె ట్ నిర్వహిస్తూ సౌదీలో స్థిరపడింది. ప్రొద్దుటూరులోని మాజీ కౌన్సిలర్, టీడీపీ నాయకుడు అమీర్‌బాషా రెండో కూతురు రెహనాను ఏడు నెలల క్రితం అర్షద్‌కు ఇచ్చి వివాహం చేశారు. ఆమె కూడా భర్తతోపాటు సౌదీలోని రియాజ్‌లో ఉంటోంది.
రెహనా ప్రస్తుతం ఆరు నెలల గర్భిణి. అర్షద్, భార్య రెహనా, తల్లి జిలానీబేగం, సోదరుడు నూరితో కలిసి మక్కా దర్శనం కోసం గురువారం రాత్రి కారులో బయల్దేరారు. మక్కాకు సుమారు 150 కి.మీ. దూరంలో ఉండగా రోడ్డుపై వారగా నిలిచి ఉన్న ఆయిల్ ట్యాంకర్‌ను వీరి కారు ఢీకొంది. ప్రమాదంలో అర్షద్, రెహనా, జిలానీబేగంలు తీవ్రగాయాలతో అక్కడికక్కడే మృతిచెందారు. నూరి మాత్రం గాయాలతో బయటపడ్డాడు. వారి మృతదేహాలను స్వగ్రామమైన ప్రొద్దుటూరుకు ఆదివారం తీసుకొస్తున్నట్లు సమాచారం.

ఇదిలావుంటే, కడప నగరంలో ఏడు సెంట్ల ప్రభుత్వ స్థలానికి తప్పుడు పత్రాలు సృష్టించి మాచుపల్లెకు చెందిన వ్యక్తికి విక్రయించిన ఇరువురిపై చీటింగ్ కేసు నమోదు చేసినట్లు వన్‌టౌన్ ఎస్‌ఐ రంగనాయకులు తెలిపారు. ఎస్‌ఐ వివరాల మేరకు గుంతబజారుకు చెం దిన శివారెడ్డి, శోభారాణిలు ఓ ప్రభుత్వ స్థలానికి నకిలీ పత్రాలు సృష్టించి మాచుపల్లెకు చెందిన మాసినేని శ్రీనివాసులుకు 2011లో అగ్రిమెంటు రాసి అతని వద్ద నుంచి భారీ నగదు తీసుకున్నారు.
స్థలాన్ని రిజిస్ర్టేషన్ చే యించకపోవడంతో శ్రీనివాసులు రిజిస్ర్టేషన్ కార్యాలయంలో ఆ స్థల సంబంధించి వివరా లు సేకరించారు. అయితే ఆ స్థలం ప్రభుత్వానిది కావడంతో బాధితుడు పోలీసులను ఆశ్ర యించాడు. బాధితుని ఫిర్యాదు మేరకు శివారెడ్డి, శోభారాణిలపై చీటింగ్ కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.












Click it and Unblock the Notifications