వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చిరు బాటలోనే నాగార్జున - మోహన్ బాబుకు క్లారిటీ : సీఎంతో మాట్లాడాకే- జరిగేదిదేనా..!!

By Chaitanya
|
Google Oneindia TeluguNews

టాలీవుడ్ వర్సెస్ ఏపీ ప్రభుత్వం. ఏపీలో సినిమా టిక్కెట్ల ధరల తగ్గింపు పైన కొనసాగుతున్న చర్చ అనేక మలుపులు తిరుగుతోంది. వివాదాస్పద దర్శకుడు ఆర్జీవి చేసిన వరుస ట్వీట్లతో ఇది మరింత వేడి రాజుకుంది. ఇంత వివాదం సమయంలో ఇప్పటి వరకు ముఖ్యమంత్రి తో సినిమా పరిశ్రమల పైన చర్చలు చేసిన మెగాస్టార్ చిరంజీవి సడన్ గా డ్రాప్ అయ్యారు. తాను పంచాయితీలు చేయలేనని చెప్పారు. ఇక, చిరంజీవితో పాటుగా సీఎం వద్దకు చర్చలకు వెళ్లిన మరో ప్రముఖ నటుడు నాగార్జున సైతం తన వైఖరి స్పష్టం చేసారు.

Recommended Video

AP Tickets Rates: Telugu Film Industry Lacks Unity - Mohan Babu | RGV | Oneindia Telugu
నాగార్జున వ్యాఖ్యలపై చర్చ

నాగార్జున వ్యాఖ్యలపై చర్చ

చిరంజీవి తాను ఇండస్ట్రీకి పెద్దగా ఉండలేనని చెప్పగానే.. మోహన్ బాబు రాసిన బహిరంగ లేఖతో ఆయన పెద్దన్న పాత్ర తీసుకోవటానికి సిద్దంగా ఉన్నాననే సంకేతాలిచ్చారు. కానీ, ఆయనకు ఆ బాధ్యత ఇచ్చి.. వెనుక నడిచేందుకు ముందుకొచ్చేదెవరనే చర్చ ఇంకా తేలలేదు. ఇదే సమయంలో నాగార్జున తన సినిమా బంగార్రాజు రిలీజ్ చేయబోతున్నారు. సినిమా టిక్కెట్ల ధరల తగ్గింపు వలన తనకు అయితే నష్టం లేదన్నారు. సినిమా వేదిక మీద రాజకీయాలు మాట్లాడను అని ఆ చర్చకు ముగింపు ఇచ్చే ప్రయత్నం చేసారు. ఈ వ్యాఖ్యలను సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు.

ఆ ముగ్గురికీ క్లారిటీ ఉందంటూ

ఆ ముగ్గురికీ క్లారిటీ ఉందంటూ

అయితే, చిరంజీవి- నాగార్జున - మోహన్ బాబు ముగ్గురికీ జరగేది ఏంటనే దాని పైన స్పష్టత ఉందనేది సినీ ఇండస్ట్రీ టాక్. నాగార్జున ఈ మధ్య కాలంలోనే అమరావతి వెళ్లి సీఎం జగన్ తో లంచ్ మీటింగ్ కు అటెండ్ అయ్యారు. తాను సినిమా అంశాలు మాట్లాడలేదని చెప్పారు. జగన్ తో నాగార్జునకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. జగన్ రాజకీయాల్లోకి వచ్చిన సమయం నుంచి వారి మధ్య సఖ్యత కొనసాగుతోంది. అదే విధంగా మోహన్ బాబుకు సీఎం జగన్ వైఖరి పైన స్పష్టత ఉంది. ఇక, చిరంజీవి సినిమా పరిశ్రమ అంశాల్లో సీఎం జగన్ తో చర్చలు.. తరువాత ఇండస్ట్రీ నుంచి కొందరు చేసిన వ్యాఖ్యలు..ప్రభుత్వ ఆలోచనలు.. అదే సమయంలో సినీ ఇండస్ట్రీలో భిన్నాభిప్రాయాలు అన్నీ చూసిన తరువాత తాను మిడిల్ డ్రాప్ అయ్యారు.

చిరంజీవి డ్రాప్ వెనుక

చిరంజీవి డ్రాప్ వెనుక

కొంత కాలంగా ప్రభుత్వంలో జరుగుతున్న ఆలోచనల గురించి తెలుసుకున్న చిరంజీవి.. తాను పెద్దరికం తీసుకొన్నా సీఎంను ఒప్పించటం అంత సులువైన విషయం కాదనే నిర్దారణకు వచ్చేసారు. మోహన్ బాబుకు పెద్దన్న పాత్ర తీసుకోవాలని ఉన్నా.. జగన్ వద్దకు ఇండస్ట్రీ పెద్దలు వస్తేనే వెళ్లాలనే ఆలోచనలో ఉన్నారు. అయితే, జగన్ గురించి పూర్తి అవగాహన ఉన్న నాగార్జున... ఏపీ సీఎంగా జగన్ ఏ ఆలోచనతో ఉన్నారో క్లారిటీ ఉంది. ఏపీ నుంచి సినీ పరిశ్రమ ఏ రకంగా లాభ పడుతుందో..అందులో కొంత మేరైనా పరిశ్రమ నుంచి ఏపీకి లాభం జరగాలనేది సీఎం ఆలోచన. అందులో భాగంగా ప్రీ లేదా పోస్టు ప్రొడక్షన్ లో ఏపీకి ప్రాతినిధ్యం ఉండాలని..తద్వారా ఏపీకి గుర్తింపు రావాలని ప్రభుత్వం కోరుకుంటున్నట్లుగా తెలుస్తోంది.

నాగార్జున లెక్క పక్కా

నాగార్జున లెక్క పక్కా

అయితే, ఇందు కోసం చిరంజీవి తన సంసిద్దత వ్యక్తం చేసినా..పరిశ్రమలో కలిసొచ్చేవారెవరనేది తేలని విషయంగా మారింది. దీంతో..చిరంజీవి ఈ వివాదానికి దూరంగా ఉండాలని డిసైడ్ అయ్యారు. ఇక..చిరంజీవి - నాగార్జున క్లోజ్ ఫ్రెండ్స్. సీఎం ఆలోచన ఏంటనేది ఈ మధ్య కాలంలోనే మంత్రి పేర్ని నాని .. ప్రముఖ నిర్మాత సైతం స్పష్టం చేసారు. దీనికి సమాధానం..హామీ ఇవ్వలేకనే ఇప్పుడు ఎవరూ సీఎం ముందుకు వెళ్లటానికి ముందుకు రావటం లేదని తెలుస్తోంది. ఇవన్నీ గ్రహించి..పూర్తి అవగాహనతోనే నాగార్జున సినిమా టిక్కెట్ల ధరల తగ్గింపు వలన తనకు నష్టం లేదని స్పస్టం చేసారు. టిక్కెట్ల రేట్లు పెంచితే డబ్బులు వస్తాయని.. ఇదే రేట్లు కొనసాగితే కొంత తగ్గుతాయంటూ హీరో కమ్ బిజినెస్ మెన్ అయిన నాగార్జున చెప్పిన సమాధానంలోనే మొత్తం అర్దం ఉంది.

సీఎం వద్దకు వెళ్లేదెవరు

సీఎం వద్దకు వెళ్లేదెవరు


ఇక, సినిమా టిక్కెట్ల విషయంలో ఏపీ ప్రభుత్వం కోర్టులో అప్పీల్ ... తాజాగా బహిరంగ సభలో సీఎం వ్యాఖ్యలు చూసిన తరువాత ముఖ్యమంత్రి ఈ విషయం లో వెనుకడుగు వేయటం అనేది కష్టమనే అభిప్రాయం బలంగా వినిపిస్తోంది. ఇక, ఇప్పుడు కమిటీ చర్చలు చేస్తోంది. కమిటీ నివేదిక ఆధారంగా నిర్ణయాలని చెబుతున్నారు. దీని ద్వారా ఏం జరగనుందో కూడా చాలా మందికి క్లారిటీ ఉందనే టాక్ వినిపిస్తోంది. దీంతో..రానున్న రోజుల్లో ఈ మొత్తం ఎపిసోడ్ లో ఎటువంటి ట్విస్టులు చోటు చేసుకుంటాయో చూడాలి.

English summary
Actor Nagarjuna had said that he had no problem with the ticket issue and Chiranjeevi and Mohan Babu have clarity on Jagan's decision
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X