Tirumala: పండుగ లాంటి వార్త చెప్పిన టీటీడీ

టిటిడి తిరుమల శ్రీవారి ఆలయంతో పాటు టీటీడీ ఆధ్వర్యంలో ఉన్న అన్ని ఆలయాలపైన ప్రధానంగా ఫోకస్ చేస్తుంది. టిటిడి కొత్త పాలకమండలి బాధ్యతలు చేపట్టిన తర్వాత తిరుమలలో సమూల మార్పులకు శ్రీకారం చుట్టింది. అంతేకాదు టీటీడీ ఈవో జే శ్యామల రావు కూడా తిరుమల ప్రక్షాళనకు శ్రీకారం చుట్టారు. తిరుమల శ్రీవారి ఆలయంతో పాటు అనుబంధ ఆలయాలలో ఉత్సవాలను వేడుకలను ఘనంగా నిర్వహించడానికి కృషి చేస్తున్నారు.

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాలు
ఈ క్రమంలో తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాలను నవంబర్ 28 నుంచి డిసెంబర్ 6 వరకు వైభవంగా నిర్వహించడానికి విస్తృతంగా ఏర్పాట్లను చేస్తున్నారు. టీటీడీ ఈవో జే శ్యామలా రావు అధికారులు బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహించడానికి చేయవలసిన పనులకు సంబంధించి కీలకఆదేశాలు ఇచ్చారు. తిరుచానూరు బ్రహ్మోత్సవాలలో ప్రధాన ఘట్టమైన పంచమి తీర్థం రోజు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చక్కని వసతి ఏర్పాట్లు చేయాలని ఆయన పేర్కొన్నారు.

Tiruchanoor padmavati annual Brahmotsavam should be conducted on par with Tirumala Brahmotsavams

తిరుచానూరులో మౌలిక వసతుల కల్పనకు ఆదేశం
హోల్డింగ్ పాయింట్లు వేచి ఉండే భక్తులకు మంచినీరు, అల్పాహారంతో పాటు, మరుగుదొడ్ల సదుపాయాలను కూడా అందుబాటులో ఉంచేందుకు ముందస్తుగానే ప్రణాళిక చేసుకోవాలని చెప్పారు. హోల్డింగ్ పాయింట్ల వద్ద అవసరమైన సిబ్బందిని అందుబాటులో ఉంచుకోవాలని భక్తులకు అసౌకర్యం కలగకుండా చూసుకోవాలని చెప్పారు. పారిశుద్ధ్య విషయంలో కాంప్రమైజ్ అయ్యే పరిస్థితి లేదని ఆరోగ్యశాఖ అధికారులు స్థానిక పంచాయతీ అధికారులతో సమన్వయం చేసుకోవాలని సూచించారు.

సెక్యూరిటీ విషయంలో కీలక ఆదేశాలు
వైద్య విభాగం అధికారులు ప్రథమ చికిత్స కేంద్రాలను, అంబులెన్స్ లను ఏర్పాటు చేసి భక్తుల సౌకర్యార్థం అవసరమైన సిబ్బందిని అందుబాటులో ఉంచాలని సూచించారు. ఇక సెక్యూరిటీ విభాగం అధికారులు సీసీ కెమెరాలు తో పాటు అవసరమైన సిబ్బందిని ఏర్పాటు చేసి స్థానిక పోలీసులతో సమన్వయం చేసుకోవాలన్నారు. అంతే కాదు హిందూ ధర్మ ప్రచార పరిషత్ ద్వారా నిర్వహించే ఆధ్యాత్మిక, సంస్కృతిక కార్యక్రమాలు భక్తులకు మనోరంజనాన్ని కలిగించేలా ఉండాలని పేర్కొన్నారు.

ప్రసాదం విషయంలో జాగ్రత్తలు
భక్తులందరికీ అన్న ప్రసాదం అందేలాగా చర్యలు చేపట్టాలన్నారు. ఇంజనీరింగ్ విభాగం ఆధ్వర్యంలో రంగులు వేయాలని, ఫ్లెక్సీలు, బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు. ఇక ముఖ్యమైన ప్రాంతాలలో ఆర్చీలను ఏర్పాటు చేసి, హారతి పాయింట్స్ కోసం లైన్లు, బారికేడ్లు, చైన్ లింకులను ఏర్పాటు చేయాలని ఆదేశాలు ఇచ్చారు.

తిరుచానూరులో ఫల, పుష్ప ప్రదర్శన
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా ఉద్యానవన విభాగం ఆధ్వర్యంలో తిరుచానూరులో ఫల, పుష్ప ప్రదర్శనను భక్తులు ఆకట్టుకునే విధంగా ఏర్పాటు చేయాలని ఈవో శ్యామలరావు అధికారులకు సూచించారు. మొత్తంగా తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు దీటుగా ఏమాత్రం తగ్గకుండా అమ్మవారి బ్రహ్మోత్సవాలను కూడా చేయాలని ఆయన పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+