Tirumala: శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం జగన్, గరుడ వాహనంపై శ్రీ మలయప్ప కటాక్షం !
తిరుమల/తిరుపతి: తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా సోమవారం రాత్రి రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం తరఫున శ్రీవేంకటేశ్వరస్వామివారికి పట్టువస్రాలు సమర్పించారు.
ముందుగా సీఎం జగన్ శ్రీ బేడి ఆంజనేయస్వామివారి ఆలయం వద్దకు చేరుకున్నారు. వారికి ఆలయ అర్చకులు పరివట్టం కట్టారు. అక్కడినుంచి పట్టువస్త్రాలను తలపై ఉంచుకుని మంగళవాయిద్యాల నడుమ ఊరేగింపుగా శ్రీవారి ఆలయానికి చేరుకుని స్వామివారికి వస్త్రాలు సమర్పించారు.
Tirupati:
అలిపిరిలో
సప్తగోప్రదక్షిణ
మందిరం
ప్రారంభించిన
సీఎం
జగన్,
కాలినడక
భక్తుల
కోసం
!

సీఎంకు వేద పడింతుల వేదాశీర్వచనం
అంతకుముందు టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు వైవి.సుబ్బారెడ్డి, కార్యనిర్వహణాధికారి డాక్టర్ కెఎస్.జవహర్‌రెడ్డి, అదనపు ఈవో ఎవి.ధర్మారెడ్డి కలిసి స్వాగతం పలికారు.
దర్శనానంతరం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం చేశారు. శ్రీవారి తీర్థప్రసాదాలు, డ్రైఫ్లవర్ టెక్నాలజీతో చేసిన స్వామివారి చిత్రపటం, కాఫీ టేబుల్‌బుక్ అందజేశారు.

శ్రీవారి డైరీలు, క్యాలెండర్లు ఆవిష్కరించిన సీఎం జగన్
శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో ఐదో రోజైన సోమవారం రాత్రి స్వామివారి దర్శనానంతరం రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి టీటీడీ ముద్రించిన 2022వ సంవత్సరం డైరీలు, క్యాలెండర్లను శ్రీవారి ఆలయంలో ఆవిష్కరించారు.
12 పేజీల క్యాలెండర్లు 15 లక్షలు, పెద్ద డైరీలు 8 లక్షలు, చిన్నడైరీలు 2 లక్షలు, టేబుల్ టాప్ క్యాలెండర్లు లక్ష, శ్రీవారి పెద్ద క్యాలెండర్లు 3.5 లక్షలు, శ్రీ పద్మావతి అమ్మవారి పెద్ద క్యాలెండర్లు 10 వేలు, శ్రీవారు, శ్రీపద్మావతి అమ్మవారి క్యాలెండర్లు 4 లక్షలు, తెలుగు పంచాంగం క్యాలెండర్లు 2. 50 లక్షల కాపీలను టీటీడీ ముద్రించింది. ఇవి తిరుమల, తిరుపతిలోని టీటీడీ పుస్తక విక్రయశాలల్లో అందుబాటులో ఉన్నాయి. వారం రోజుల్లో ఇతర ప్రాంతాల్లోని టీటీడీ సమాచార కేంద్రాల్లో అందుబాటులో ఉంచుతారు.

గరుడ వాహనంపై శ్రీ మలయప్ప కటాక్షం
శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఐదో రోజు సోమవారం రాత్రి 7 గంటలకు శ్రీవారి ఆలయంలోని కల్యాణోత్సవ మండపంలో శ్రీ మలయప్పస్వామివారు తనకెంతో ప్రీతిపాత్రమైన గరుడ వాహనంపై దర్శనమిచ్చారు. వాహన సేవలో రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి పాల్గొన్నారు.

గరుడ వాహనం సర్వపాప ప్రాయశ్చిత్తం
పౌరాణిక
నేపథ్యంలో
108
వైష్ణవ
దివ్యదేశాలలోనూ
గరుడసేవ
అత్యంత
ప్రాముఖ్యతను
సంతరించుకుంది.
గరుడవాహనం
ద్వారా
స్వామివారు
దాసానుదాస
ప్రపత్తికి
తాను
దాసుడని
తెలియజెబుతారు.
అంతేగాక
జ్ఞానవైరాగ్య
ప్రాప్తికోరే
మానవులు
జ్ఞానవైరాగ్య
రూపాలైన
రెక్కలతో
విహరించే
భగదధిష్టుతుడైన
గరుడుని
దర్శిస్తే
సర్వపాపాలు
తొలగుతాయని
భక్తకోటికి
తెలియజెబుతున్నారు.
కాగా, బ్రహ్మోత్సవాలలో ఆరో రోజైన మంగళవారం ఉదయం 9 గంటలకు హనుమంత వాహనం, సాయంత్రం 4 గంటలకు స్వర్ణరథానికి బదులు సర్వభూపాల వాహనం, రాత్రి 7 గంటలకు గజవాహనంపై శ్రీవారు కటాక్షించనున్నారు.
Recommended Video

సీఎం వెంట మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు
ఈ కార్యక్రమంలో శ్రీశ్రీశ్రీ పెద్ద జీయర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్న జీయర్ స్వామి, ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి, ఉపసభాపతి కోన రఘుపతి, మంత్రులు వెల్లంపల్లి శ్రీనివాసరావు,పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మేకపాటి గౌతమ్ రెడ్డి, కన్నబాబు, కొడాలి నాని, అనిల్ కుమార్ యాదవ్, ఎంపీలు గురుమూర్తి, మిథున్ రెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, మార్గాని భరత్, రెడ్డెప్పరెడ్డి, ఎమ్మెల్యేలు కరుణాకర్ రెడ్డి, రోజా, బియ్యపు మధుసూదన్ రెడ్డి, వెంకటే గౌడ, ఆదిమూలం, చింతల రామచంద్రారెడ్డి, ఆరణి శ్రీనివాసులు, మేడా మల్లికార్జున రెడ్డి, తిప్పేస్వామి, ఆర్.ప్రతాప్ కుమార్ రెడ్డి, చిత్తూరు జడ్ పి ఛైర్మన్ శ్రీనివాసులు, బోర్డు సభ్యులు శ్రీమతి ప్రశాంతి రెడ్డి, పోకల అశోక్ కుమార్, కాటసాని రాంభూపాల్ రెడ్డి, మధుసూదన్ యాదవ్, కె.సంజీవయ్య, దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీమతి వాణీ మోహన్, జిల్లా కలెక్టర్ హరినారాయణన్, టీటీడీ సివిఎస్వో గోపినాథ్ జెట్టి, అర్బన్ ఎస్పీ వెంకట అప్పలనాయుడు, తిరుపతి కార్పొరేషన్ డెప్యూటీ మేయర్ భూమన అభినయ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.