Tirumala: బంగారం ధరల ఎఫెక్ట్, TTD అనూహ్య నిర్ణయం - ఇక నుంచి..!!
Tirumala: బంగారం ధరల ప్రభావం తిరుమలలోనూ కనిపిస్తోంది. బహిరంగ మార్కెట్ లో గోల్డ్ ధరలు పెరిగినా... తిరుమలలో మాత్రం వారానికి ఒక రోజు మాత్రమే ధరల్లో మార్పును ఖరారు చేస్తారు. దీంతో, బయట మార్కెట్ కంటే తక్కువ ధరకే ఇక్కడ శ్రీవారి డాలర్లు అందుబాటులో ఉండటంతో..భారీగా అమ్మకాలు జరుగుతున్నాయి. దీంతో.. టీటీడీ పైన భారం పడుతోంది. ఈ సమయంలో టీటీడీ అనూహ్య నిర్ణయం తీసుకొంది. కొత్త మార్గదర్శకాలు ఖరారు చేసింది.
తిరుమలలో శ్రీవారి డాలర్ల విక్రయ కేంద్రాన్ని టీటీడీ తాత్కాలికంగా మూసివేసింది. అదే సమయం లో ఇక నుంచి తిరుమల శ్రీవేంకటేశ్వరుడి దర్శనం టికెట్ ఉన్నవారికే శ్రీవారి బంగారు డాలర్లు విక్రయించాలని, అదికూడా ఒక్క డాలర్ మాత్రమే ఇవ్వాలని టీటీడీ యోచిస్తోంది. బంగారం ధర ఏరోజుకారోజు పెరిగిపోతున్నందున బల్క్ కొనుగోళ్లకు అడ్డుకట్ట వేసేందుకు ఈ విధానం ఉపయోగ పడుతుందని టీటీడీ భావిస్తోంది.

దీంతో.. ఇందుకు అనుగుణంగా అవసరమైన నిర్ణయాలను తీసుకొనేదాకా డాలర్ల విక్రయాలను తాత్కాలికంగా నిలిపివేసింది. బంగారం ధరలు పెరిగిపోతున్న రోజుల్లో శ్రీవారి డాలర్ల ధరలు వారానికి ఒకసారి మాత్రమే సవరిస్తున్నారు. బయటి మార్కెట్‌లో కన్నా టీటీడీ డాలర్ ధర తక్కువగా ఉండడంతో కొనుగోళ్లు పెరగగా, ఆమేరకు టీటీడీకి నష్టం వాటిల్లుతోంది. దీంతో ఈ అంశం పైన సమీక్ష చేసిన అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు.
డాలర్ల విక్రయాల్లో కొత్త నిబంధనలు
ప్రస్తుతం డాలర్ విక్రయ కేంద్రాల్లో 2, 5, 10 గ్రాముల డాలర్లు అమ్మకాల రద్దీని బట్టి ఒక్కొక్కరికీ 5,6 వరకు విక్రయించేవారు. ఇకపై కౌంటర్లలో వారానికి ఒకసారి మాత్రమే ధర అమలు చేయడం కాకుండా, బులియన్ మార్కెట్ ప్రకారం ఏరోజుకారోజు ధరలు సవరించేలా ప్రణాళికలు రూపొందించేలా తాజాగా నిర్ణయం తీసుకున్నారు. ఈమేరకు బయటి మార్కెట్‌లో కన్నా టీటీడీ డాలర్ ధర తక్కువగా ఉండడంతో విక్రయాలపై కౌంటర్ సిబ్బంది ఆచితూచి వ్యవహరిస్తున్నారు. రూ.50 వేలకు పైగా విలువైన డాలర్లు కొనుగోలు చేస్తే పాన్‌కార్డ్ తప్పనిసరిగా ఇవ్వాలనే నిబంధనను పెట్టారు.
శుక్రవారం మధ్యాహ్నం 2 గంటల వరకు ఒక్క డాలర్‌ను మాత్రమే విక్రయించారు. ఆ తర్వాత తాత్కాలికంగా విక్రయాలను నిలిపివేశారు. సాధారణ రోజుల్లో రూ.20 లక్షల నుంచి రూ.40 లక్షల వి లువవైన శ్రీవారి డాలర్ల విక్రయాలు జరుగుతాయి. అయితే 26వ తేదీ నుంచి అమ్మకాలు రూ.కోటికి పైగా జరగాయి. 26వ తేదీన రూ.1.53 కోట్లు, 27న రూ.1.36 కోట్లు, 28న రూ.16.04లక్షలు(ధర మార్పిడి జరిగిన రోజు), 29న రూ.1.17 కోట్లు విలువ చేసే డాలర్ల విక్రయాలు జరిగాయి. దీంతో.. ఇప్పుడు టీటీడీ కొత్త నిర్ణయాలను ఖరారు చేసి భక్తులకు వెల్లడించనుంది.
-
బంగారం ధరల సీన్ రివర్స్ -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పవన్ కళ్యాణ్‌ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు -
IPL తొలి మ్యాచ్ లోనే సెన్సేషన్, ఎవరీ కూపర్ కనోలీ - సూర్యవంశీని డామినేట్ చేస్తూ..!! -
పాల ధరలు భారీగా పెంపు, ఒకే సారి - కొత్త రేట్లు ఇలా..!! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
Amaravati Bill: పార్లమెంట్ లో అమరావతి బిల్లు..! కాంగ్రెస్ స్టాండ్ ఇదే..! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ












Click it and Unblock the Notifications