తిరుమల శ్రీవారి సాక్షాత్కార వైభవోత్సవాలు.. ఆ సేవలు రద్దు!
తిరుమల శ్రీవారికి సంబంధించి, తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన ఆలయాలలో ప్రతి సంవత్సరం క్యాలెండర్ ప్రకారం అనేక ఉత్సవాలను నిర్వహిస్తారు ఇదే క్రమంలో జూన్ 30 నుండి జూలై 02వ తేదీ వరకు శ్రీవారి సాక్షాత్కార వైభవోత్సవములు అత్యంత ఘనంగా నిర్వహించడానికి టిటిడి నిర్ణయించింది.
శ్రీకళ్యాణ వేంకటేశ్వర స్వామి ఆలయంలో సాక్షాత్కార వైభావోత్సవాలు
తిరుపతి సమీపంలోని శ్రీనివాసమంగాపురంలో వెలసిన శ్రీకళ్యాణ వేంకటేశ్వర స్వామి ఆలయంలో జూన్ 30 నుండి జూలై 02వ తేదీ వరకు శ్రీవారి సాక్షాత్కార వైభవోత్సవములు ఘనంగా జరగనున్నాయి. ఈ సందర్భంగా జూన్ 26న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరుగనుంది. జూలై 03న పార్వేట ఉత్సవం నిర్వహిస్తారు.

జూన్ 26న కోయిల్ ఆళ్వార్ తిరు మంజనం
జూన్ 26వ తేదీన కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం ఉత్సవంలో భాగంగా తెల్లవారుజామున సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి తోమాల సేవ, కొలువు, పంచాంగ శ్రవణం నిర్వహిస్తారు. ఉదయం 7గంటల నుండి 11:30గంటల వరకు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహిస్తారు. ఇందులో భాగంగా ఆలయ ప్రాంగణాన్ని గోడలని పైకప్పు పూజా సామాగ్రిని నీళ్లతో శుద్ధి చేస్తారు అనంతరం పవిత్ర జనంతో ఆలయాన్ని సంప్రోక్షణ చేసి మధ్యాహ్నం 12:30గంటల నుండి భక్తులను దర్శనానికి అనుమతిస్తారు.
జూన్ 30న స్వామి సేవలిలా
ఇక సాక్షాత్కార వైభవోత్సవాలలో భాగంగా జూన్ 30వ తేదీన ఉదయం 11 గంటల నుండి 12 గంటల వరకు స్వామి వారికి స్నపన తిరుమంజనం చేపడతారు. సాయంత్రం 5 గంటల నుండి 6 గంటల వరకు ఊంజల్ సేవ రాత్రి 7 గంటల నుండి ఎనిమిది గంటల వరకు పెద్దశేష వాహనం పైన శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారిని ఊరేగిస్తారు.
జులై 1న వెంకన్న సేవలిలా
జులై ఒకటవ తేదీన ఉదయం 11 గంటల నుండి 12 గంటల వరకు స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. సాయంత్రం ఐదు గంటల నుండి 6 గంటల మధ్య ఊంజల్ సేవ నిర్వహించి, ఆపై హనుమంత వాహనం పైన శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారికి ఊరేగింపు నిర్వహిస్తారు.
జులై 2న గరుడవాహనంపై విహరించే స్వామి
జూలై రెండవ తేదీన ఉదయం 11 గంటల నుండి 12 గంటల వరకు స్నపన తిరుమంజనం, ఊంజల్ సేవ నిర్వహించి ఆపై సాయంత్రం ఆరున్నర గంటల నుండి ఏడు గంటల మధ్య లక్ష్మీ హారాన్ని ఆలయ ప్రదక్షిణ గా అలంకార మండపంలోకి తీసుకొస్తారు. రాత్రి 7 గంటల నుండి ఎనిమిదిన్నర గంటల వరకు ఆలయ నాలుగు మాడవీధుల్లో గరుడ వాహనం పైన విహరించి స్వామి భక్తులను కటాక్షిస్తాడు.
జులై 3న పార్వేట ఉత్సవం
జూలై మూడవ తేదీన పార్వేట ఉత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తారు. నేను ఉదయం తోమాల సేవ, కొలువు, పంచాంగ శ్రవణం, సహస్రనామార్చన, శాత్తుమొర నిర్వహించి అనంతరం ఉదయం 7 గంటల నుండి 11 గంటల వరకు ఉత్సవ మూర్తులను పార్వేట మండపానికి వేంచేపు చేస్తారు. ఆపై ఉదయం 11 గంటల నుండి రెండు గంటల మధ్య పార్వేట ఉత్సవం జరుగుతుంది. ఈ సందర్భంగా ఆస్థానం, వైదిక, సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తారు.
సాక్షాత్కార వైభవోత్సవాల సందర్భంగా పలు సేవలు రద్దు
శ్రీనివాస మంగాపురంలో వెలసిన శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో సాక్షాత్కార వైభవోత్సవం, పార్వేట ఉత్సవం నిర్వహిస్తున్న క్రమంలో రేపు మరియు జూన్ 30 నుండి జూలై మూడవ తేదీ వరకు నిత్య కళ్యాణోత్సవాన్ని రద్దు చేశారు. జూన్ 26వ తేదీ నుండి జూలై మూడవ తేదీ వరకు తిరుప్పావడ సేవ, జూన్ రెండవ తేదీన అష్టోత్తర శత కలశాభిషేకం సేవలను రద్దు చేశారు .జులై 1వ తేదీన స్వర్ణ పుష్పార్చన ను రద్దు చేశారు.












Click it and Unblock the Notifications