LV Subrahmanyam: తిరుమలలో ప్లాన్ చేసి కుట్ర? ‘ఇది చిన్న తప్పు కాదు’

తిరుమల వేంకటేశ్వరస్వామి లడ్డూ ప్రసాదానికి వినియోగించిన నెయ్యిలో కల్తీ జరగడం అత్యంత ఘోరమైన అపచారమని తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ ఈవో, ఏపీ మాజీ సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం తీవ్రంగా విమర్శించారు. తెలియక చిన్న తప్పు చేస్తేనే భక్తులు ప్రాయశ్చిత్తం చేసుకుంటారని గుర్తుచేస్తూ, తెలిసీ ప్రణాళికాబద్ధంగా రసాయనాలు కలిపిన నెయ్యిని స్వామివారి నైవేద్యాలకు వినియోగించడం మహాపచారమని పేర్కొన్నారు. పరీక్షల్లో కల్తీ తేలిన తర్వాత కూడా అదే నెయ్యిని కొనసాగించడం నేరస్వభావానికి నిదర్శనమని అన్నారు.

ఏ రసాయనం కలిపితే నెయ్యిలా వాసన, రంగు, ఆకారం వస్తుందో ముందే ప్లాన్ చేసి ఈ వ్యవహారం నడిపారంటే ఇది పెద్ద కుట్రేనని స్పష్టం చేశారు. 2022లోనే నెయ్యి కల్తీపై నివేదికలు వచ్చినా చర్యలు తీసుకోకపోవడం కావాలనే చేసిన తప్పుగా కనిపిస్తోందన్నారు. తప్పు జరగలేదని బొంకడం మానేసి, ఎవరు బాధ్యులో తేల్చి చెప్పాలని, బాధ్యులంతా తప్పు అంగీకరించి ప్రాయశ్చిత్తం చేసుకోవాలని డిమాండ్ చేశారు.

LV Subrahmanyam

ఈ వ్యవహారానికి టీటీడీ ఈవో, ఛైర్మన్ ఇద్దరూ బాధ్యత వహించాలని ఎల్వీ సుబ్రహ్మణ్యం స్పష్టం చేశారు. ఈవో శ్రీవారికి అనుంగు సేవకుడని, ఏ తప్పు జరిగినా బోర్డు, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాల్సిన బాధ్యత ఆయనదేనన్నారు. అలాగే తప్పులు జరగకుండా చూడాల్సిన బాధ్యత ఛైర్మన్‌పైనా ఉందని, ఇద్దరూ జోడు గుర్రాల్లా వ్యవహరించాల్సిందని వ్యాఖ్యానించారు. ఈ మహాపచారంపై హిందూ సమాజమంతా ఏకమై న్యాయపరమైన చర్యలు కోరాలని పిలుపునిచ్చారు.

ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా నెయ్యి సరఫరాకు పకడ్బందీ వ్యవస్థ అవసరమని సూచించారు. గుజరాత్‌లోని అమూల్ నమూనాను అనుసరించి, రాష్ట్రంలోని రైతులతో ఒప్పందం చేసుకుని దేశీ ఆవుల పాలతోనే నెయ్యి తయారు చేసే విధానం తీసుకురావాలని అన్నారు. దీనివల్ల శ్రీవారి నైవేద్యాల స్వచ్ఛతతో పాటు వేలాది రైతు కుటుంబాలకు ఉపాధి కూడా కలుగుతుందని చెప్పారు. లడ్డూ నెయ్యి కల్తీ సాక్ష్యాలతో తేలిపోయిన తర్వాత కూడా తప్పు లేదని వాదించడం భక్తుల ఆగ్రహానికి కారణమవుతోందని హెచ్చరించారు

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+