Tirumala news: నేటినుండి తిరుమలలో హిందూ ధార్మిక సదస్సు; దర్శనానికి ఎంత సమయమంటే!!
తిరుమల తిరుపతి వేదికగా నేటి నుంచి మూడు రోజులపాటు టిటిడి ఆధ్వర్యంలో హిందూ ధార్మిక సదస్సు జరగనుంది. తిరుమల ఆస్థాన మండపంలో ఫిబ్రవరి 3 నుండి 5వ తేదీ వరకు టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ధార్మిక సదస్సులో మఠాధిపతులు, పీఠాధిపతులు సమావేశం కానున్నారు. దీని కోసం తిరుమల తిరుపతి దేవస్థానం విస్తృత ఏర్పాట్లను చేసింది.
ధార్మిక సదస్సులో పాల్గొనే వారంతా కూర్చుని సమాలోచనలు చేసేందుకు, నిర్వహించేందుకు కావలసిన ఏర్పాట్లతో పాటు భద్రత కూడా కల్పించింది. ఈ సదస్సుకు మొత్తం 57 మంది మఠాధిపతులు, పీఠాధిపతులు, ఆధ్యాత్మిక సంస్థల నుండి ప్రతినిధులు హాజరు కానున్నట్టు తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో ధర్మారెడ్డి తెలిపారు.

హిందూ ధర్మ ప్రచారానికి, హిందూ ధర్మ పరిరక్షణకు, సనాతన హిందూ ధర్మ విలువల వ్యాప్తికి, వాటి విశిష్టతను ప్రజలలోకి తీసుకువెళ్లడానికి చేపట్టవలసిన చర్యలపై, మఠాధిపతులు, పీఠాధిపతులు కీలక సలహాలు సూచనలు ఇవ్వనున్నారు. ఈ సదస్సు హిందూ ధర్మ ప్రచారం కోసం నిర్వహించనున్నారు. ఇక ఈ సదస్సు ఏర్పాట్లను టిటిడి చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి స్వయంగా అధికారులతో కలిసి పరిశీలించి ఎవరికీ ఇబ్బందులు లేకుండా ఉండే విధంగా చర్యలు తీసుకున్నారు.
ఇదిలా ఉంటే ఫిబ్రవరి 2వ తేదీన తిరుమల శ్రీవారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 57 వేల 223 మంది కాగా, తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య 18,017 మంది. శ్రీవారికి ఫిబ్రవరి 2వ తేదీన వచ్చిన హుండీ కానుకల ఆదాయం 3.44 కోట్లు కాగా స్వామివారి దర్శనానికి 9 వెయిటింగ్ కంపార్ట్మెంట్లలో భక్తులు ఎదురు చూశారు.
#TTD#TTDevasthanams#TTDDharmicSadassu2024 pic.twitter.com/N3bjFDoiNa
— Tirumala Tirupati Devasthanams (@TTDevasthanams) February 1, 2024
మొత్తంగా నిన్న స్వామివారిని దర్శించుకోవడానికి సర్వదర్శనం కోసం భక్తులకు సుమారు 10 గంటల సమయం పట్టిందని టీటీడీ అధికారిక వెబ్సైట్లో పేర్కొంది. ఇక నేటి నుండి మూడు రోజులపాటు తిరుమలలో హిందూ ధర్మ ప్రచారం కోసం ధార్మిక సదస్సు కొనసాగనున్న నేపథ్యంలో స్వామివారిని దర్శించుకునే భక్తుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.
-
తిరుమలలో హోటళ్ల బంద్, భక్తుల ఇబ్బందులు- ఆ ఒక్కటే ఆధారం..!! -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ!












Click it and Unblock the Notifications