Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

మహా కుంభమేళాకు తిరుమల శ్రీవారి కళ్యాణ రథం.. కీలక విషయాలు చెప్పిన టీటీడీ చైర్మన్!

జనవరి 13వ తేదీ నుండి ఫిబ్రవరి 26 మహాశివరాత్రి వరకు మహా కుంభమేళా జరగబోతుంది. ఈ మహా కుంభమేళాకు దేశం సిద్ధమైంది. ప్రయాగ్ రాజ్ లో మహా కుంభమేళాకు భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. మహా కుంభమేళా నేపథ్యంలో ప్రత్యేక రైళ్లను ఏర్పాటుచేసి భక్తులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నారు. అత్యంత పవిత్రమైన ఈ మహాకుంభమేళాలో తిరుమల శ్రీవారిని దర్శించుకోవటం కోసం అక్కడ శ్రీవారి నమూనా ఆలయాన్ని ఏర్పాటు చేసింది టీటీడీ.

మహా కుంభమేళాలో శ్రీవారి నమూనా ఆలయ ఏర్పాటు
ఇక ఇదే సమయంలో ఉత్తర ప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ లో జరగనున్న మహాకుంభమేళాలో తిరుమల శ్రీవారిని దర్శించుకోవచ్చని టిటిడి శుభవార్త చెప్పింది. మహా కుంభమేళాకు వచ్చిన భక్తులు తిరుమల శ్రీవారిని ప్రశాంతంగా దర్శించుకునేలాగా అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రయాగరాజ్‌లోని సెక్టార్‌ 6, భజరంగ్‌దాస్‌ రోడ్డులోని నాగవాసుకి ఆలయానికి సమీపంలో శ్రీవారి నమూనా ఆలయం ఏర్పాటు చేస్తున్నారు.

Tirumala Srivari Kalyana Rath for Maha Kumbh Mela TTD Chairman reveals key details

తిరుమల నుండి ప్రయాగ్ రాజ్ కు బయలుదేరిన శ్రీవారి కళ్యాణ రథం
మొత్తం 2.89 ఎకరాల స్థలంలో శ్రీవారి నమూనా ఆలయం ఏర్పాటు చేస్తున్నామని, సుప్రభాతం నుంచి ఏకాంతసేవ వరకు అన్ని సేవలనూ నిర్వహిస్తామని టీటీడీ వెల్లడించింది.
తిరుమలలో ఏ విధంగా అయితే శ్రీవారి కల్యాణోత్సవాలు, చక్రస్నానం తదితర కైంకర్యాలు జరుపుతారో అదేవిధంగా అక్కడ కూడా స్వామివారి కైంకర్యాలు జరపనున్నారు. ఇదిలా ఉంటే తాజాగా తిరుమల నుండి నేడు ఉదయం శ్రీవారి కళ్యాణ రథం ప్రయాగ్ రాజ్ కు బయలుదేరింది.

మహా కుంభమేళాలో తిరుమల తరహాలో అన్ని కైంకర్యాలు: టీటీడీ చైర్మన్
ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్ బి.ఆర్.నాయుడు, అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి రథానికి ప్రత్యేక పూజలు నిర్వహించి పచ్చ జెండా ఊపి రథాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు మీడియాతో మాట్లాడుతూ మహా కుంభమేళాలో ఏర్పాటు చేసిన శ్రీవారి నమూనా ఆలయంలో 170 మంది సిబ్బందితో తిరుమల తరహాలో అన్ని కైంకర్యాలు నిర్వహిస్తామని చెప్పారు.

మహా కుంభమేళాలో శ్రీవారి కల్యాణోత్సవం
ఉత్తరాది భక్తులకు స్వామి వారి ఆర్జిత సేవలను తిలకించే భాగ్యం కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. జనవరి 18 , 26 తేదీల్లో ఫిబ్రవరి 3 ,12 తేదీల్లో 4 సార్లు శ్రీవారి కల్యాణోత్సవం అక్కడ ఘనంగా నిర్వహిస్తామని ఆయన తెలియజేశారు. మహా కుంభమేళాను విజయవంతం చేసేందుకు అందరూ సహకరించాలని కోరారు.

ప్రపంచంలోనే అతి పెద్ద ఉత్సవంలో తిరుమల శ్రీవారి దర్శనం
ఈ సందర్భంగా అడిషనల్ ఈవో మాట్లాడుతూ ప్రపంచంలోనే అతి పెద్ద ఉత్సవం కుంభమేళా కావడంతో అక్కడ కు వచ్చే భక్తులకు శ్రీవారి దర్శన భాగ్యం కల్పించేందుకు చర్యలు తీసుకున్నామని తెలిపారు. హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో భజన కార్యక్రమాలు, కళాబృందాల సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. ఇక టిటిడి స్వామి వారి ఆలయ నమూనాతో పాటు అక్కడ నిర్వహించే కార్యక్రమాలకు యూపీ పోలీస్ అధికారులతో మాట్లాడి భద్రత ఏర్పాట్లను చేస్తున్నట్టు తెలిపారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+