TTD: శ్రీవారి 2024 బ్రహ్మోత్సవాల ప్రత్యేకం, ఆది వరాహ క్షేత్రం తిరుమల క్షేత్రం
కలియుగ ప్రత్యక్షదైవమైన శ్రీ వేంకటేశ్వరస్వామి పరమపవిత్రమైన తిరుమల పుణ్యక్షేత్రంలో వెలసి భక్తులను రక్షిస్తున్నాడు.
శ్రీ వేంకటేశ్వరుడు ఈ క్షేత్రంలో ఉండటానికి పూర్వమే శ్రీమన్నారాయణుడు శ్వేతవరాహరూపంతో అవతరించాడు. హిరణ్యాక్షుణ్ణి శ్రీమహావిష్ణువు వరాహావతారంలో సంహరించిన తర్వాత సాధుసంరక్షణ చేయడానికి భూలోకంలోనే ఉండటానికి అంగీకరించి వేంకటాచలం మీద తన నివాసం ఏర్పరచుకున్నాడు.

తిరుమల శ్రీవెంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలకు చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ప్రతి ఏడాది లక్షలాది మంది శ్రీవారి భక్తులు శ్రీవెంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు తిలకించడానికి వెయ్యికళ్లతో ఎదురు చూస్తుంటారు
వరాహ పుష్కరిణి

వేంకటాచలంలో గల మూడుకోట్ల తీర్థాలకు స్వామి పుష్కరిణి అవతారస్థానమని ప్రసిద్ధి. దివ్య తేజోపేతం, సుగంధభరితమైన ఈ పుష్కరిణి సర్వతీర్థాలకు ఉత్పత్తి స్థానమని, శ్రీనివాసుడు వేంకటాద్రిపై అవతరించకముందే ఆవిర్భవించిందని వరాహపురాణం ప్రతిపాదిస్తున్నది.
వరాహస్వామి నివాసం స్వామిపుష్కరిణీ తటాన ఉండడంవల్ల, ఆయన ఆజ్ఞచే గరుడుడు దీన్ని వైకుంఠం నుండి తీసుకొనిరావడం చేత దీనికి వరాహపుష్కరిణి అనే పేరు సంక్రమించింది.
ఈ పవిత్ర స్వామిపుష్కరిణిలో ''తొమ్మిది తీర్థాలు''న్నాయి. కుబేరతీర్థం, గాలవతీర్థం, మార్కండేయతీర్థం, అగ్నితీర్థం, యమతీర్థం, వశిష్ఠతీర్థం, వరుణతీర్థం, వాయుతీర్థం, సరస్వతీతీర్థం ప్రధానమైనవి.
ఒకేరోజున ఈ తొమ్మిది తీర్థాల్లో స్నానంచేసి స్వామిపుష్కరిణీ తీరంలో ఉన్న స్వామి వారిని దర్శిస్తే వారికి మోక్షం ప్రాప్తిస్తుంది అనేది భక్తుల నమ్మకం.












Click it and Unblock the Notifications