తిరుపతి ప్రజలకు మాత్రమే

విజయనగరం జిల్లాలో జరిగిన రైలు ప్రమాదం తర్వాత రైళ్ల రాకపోకలను పునరుద్ధరించినప్పటికీ ఆటంకాలు ఎదురవుతూనే ఉన్నాయి. లింక్ రైళ్లు ఆలస్యం కావడంతో కొన్నింటిని రద్దు చేశారు. అలాగే మరికొన్ని రైళ్లకు సమయాలను మార్చారు. పూరీ-తిరుపతి(17479) ఎక్స్‌ప్రెస్‌, ఎంజీఆర్‌ చెన్నై సెంట్రల్‌-సంత్రాగచ్చి (22803) ఏసీ ఎక్స్‌ప్రెస్‌, 3న శ్రీసత్యసాయి ప్రశాంతి నిలయం- హౌరా(22832) ఎక్స్‌ప్రెస్‌లను 2వ తేదీన రద్దు చేశారు.

అలెప్పీ-ధన్‌బాద్‌(13352) బొకారో ఎక్స్‌ప్రెస్‌ 2వతేదీ తెల్లవారుజామున 4.00 గంటలకు, ఎర్నాకుళం-టాటానగర్‌(18190) 2వ తేదీ తెల్లవారుజామున 3.00 గంటలకు బయలుదేరేలా మార్పు చేశారు. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఈనెల 3వ తేదీన తిరుపతి-హౌరా(07163) ప్రత్యేక రైలును నడపనున్నారు. ఉదయం 10.55 గంటలకు తిరుపతిలో బయలుదేరి అదే రోజు రాత్రి 11.00 గంటలకు దువ్వాడ చేరుకుంటుంది. అక్కడి నుంచి 11.02 గంటలకు బయలుదేరి 11.30 గంటలకు నార్త్‌ సింహాచలం చేరుకొని, 11.35 గంటలకు బయలుదేరి తర్వాతరోజు మధ్యాహ్నం 1.25 గంటలకు హౌరా చేరుకుంటుంది.

tirupathi to howra special train details here

ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించి టికెట్లు బుక్ చేసుకోవాలని అధికారులు సూచించారు. రేణిగుంట, గూడూరు, నెల్లూరు, ఒంగోలు, బాపట్ల, తెనాలి, విజయవాడ, ఏలూరు, రాజమండ్రి, సామర్లకోట, దువ్వాడ, సింహాచలం నార్త్, విజయనగరం, శ్రీకాకుళం రోడ్, బ్రహ్మపూర్, ఖుర్దారోడ్, భువనేశ్వర్, బాలాసోర్, ఖరగ్ పూర్ స్టేషన్లలో ఆగనుంది.

ప్రయాణికుల రద్దీని బట్టి, వారు ఏయే మార్గాల్లో అసౌకర్యంగా ప్రయాణిస్తున్నారో అధ్యయనం చేసి ఆ ప్రకారమే, వారి డిమాండ్ల మేరకే ప్రత్యేక రైళ్లను నడపడం జరుగుతోందని అధికారులు చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+