RTC: లేడీస్ కి ఫ్రీ ఫ్రీ ఫ్రీ, నివేదిక సిద్దం, చంద్రబాబు గ్నీన్ సిగ్నల్ ఎప్పుడు !
ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి కసరత్తులు చేస్తుంది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆంధ్రప్రదేశ్ మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం కల్పిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇప్పటికే రెండు నెలలు దాటిపోయింది.
ఆంధ్రప్రదేశ్ లోని మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణంపై ఆర్టీసీ అధికారులు నివేదిక సిద్ధం చేసి చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి ఇవ్వడానికి సిద్ధమైంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లోని జిల్లాల వారీగా నివేదికలు తయారు చేసిన అధికారులు ఏపీఎస్ ఆర్టీసీ యాజమాన్యంకు అందజేస్తున్నారు. తిరుపతి జిల్లాలో ఆర్టీసీకి ఉన్న బస్సుల సంఖ్య విషయంలో చర్చ మొదలైయ్యింది, మహిళల ఉచిత ప్రయాణం మొదలయిన తరువాత మహిళలు ఎక్కువ సంఖ్యలో ప్రయాణించే అవకాశం ఉందని ఆర్టీసీ అధికారులు అంచనా వేస్తున్నారు.

తిరుపతి జిల్లాలో కొత్త బస్సులు కొనుగోలు చేయడానికి అధికారులు చర్చలు జరుపుతున్నారు. తిరుపతి జిల్లాలో ఆర్టీసీ బస్సులతో పాటు డ్రైవర్లు, కండక్టర్ల కొరత ఉందని సంబంధిత అధికారులు నివేదిక సిద్ధం చేసి చంద్రబాబు ప్రభుత్వానికి సమర్పించారు. వైసీపీ హయంలో కాలం చెల్లిన బస్సులనే ఆ జిల్లాలో నడిపారని, ఇప్పుడు ఆ బస్సులు నడిపే పరిస్థితి లేదని ఆ జిల్లా అధికారులు పై అధికారులకు సమాచారం ఇచ్చారు.
కొత్త బస్సులు కొనుగోలు చేసే పరిస్థితి లేకపోవడంతో ఏం చేయలేని పరిస్థితి ఎదురైయ్యిందని తెలిసింది. ఈ విషయంపై అధికారులు చర్చలు జరుపుతున్నారు. ముఖ్యంగా ఆర్టీసీలో కండక్టర్లు, డ్రైవర్లు నియామకాలు ఎలా చేస్తారు అనే విషయంపై తర్జనభర్జన పడుతున్నారు. తిరుపతి జిల్లాలో మాత్రమే 260 మంది డ్రైవర్లు, 260 మంది కండక్టర్లు కొరత ఉందని, గత ప్రభుత్వంలోనే ఇంత మంది ఉద్యోగులు రిటైడ్ అయ్యారని ఓ నివేదిక పైఅధికారులకు పంపించారు.

ప్రభుత్వ నియామకాలు ద్వారా ఈ ఉద్యోగుల నియమాలు అమలు చేస్తారా, లేదా ఔట్ సోర్సింగ్ పద్ధతిలో కండక్టర్లు, డ్రైవర్లను నియమిస్తారా అనే విషయం వేచి చూడాలి.. తిరుపతి జిల్లాలో ప్రస్తుతం 916 బస్సులు ఉన్నాయి. వీటిలో ఆర్టీసీకి 736 సొంత బస్సులు, 108 అద్దె బస్సులు ఉన్నాయి. ఇంకా తిరుపతి జిల్లాకు 100 బస్సులు పైగా అవసరం ఉందని, వైసీపీ ప్రభుత్వంలో నిలిపివేసిన రూట్లో కూడా బస్సులు తిప్పాల్సి వస్తుందని ఆర్టీసీ అధికారులు అంటున్నారు.
మహిళల ఉచిత బస్సు ప్రయాణం వలన ఆర్టీసీకి లాభాలు వచ్చే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో ఆర్టీసీ ఆదాయంలో ప్రతినెల 25% ఆదాయాన్ని వైసీపీ ప్రభుత్వం తీసుకుంది. అయితే ఆర్టీసీ ఆదాయం తీసుకోకూడదు అని చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయించింది. మహిళలు ఉచితంగా ప్రయాణించడంతో అయ్యే ఖర్చు ప్రభుత్వమే ఆర్టీసీకి చెల్లిస్తుందని అందువలన ఇంకా లాభాలు వచ్చే అవకాశం ఉందని ఆర్టీసీ అధికారులు అంటున్నారు.












Click it and Unblock the Notifications