కేంద్ర బలగాలతో తిరుపతి పోలింగ్: ఢిల్లీకి టీడీపీ ఎంపీలు: ఎన్నికల కమిషన్ వద్ద ఆ పంచాయితీ

అమరావతి: తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ సభ్యులు ఈ మధ్యాహ్నం హస్తినకు బయలుదేరి వెళ్లనున్నారు. సాయంత్రం కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్‌ను కలుసుకోనున్నారు. తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నిక ప్రచారం సందర్భంగా పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై చోటు చేసుకున్నట్లుగా అనుమానిస్తోన్న రాళ్లదాడి గురించి వాళ్లు ఎన్నికల ప్రధాన కమిషనర్ దృష్టికి తీసుకెళ్తారు. తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నిక పోలింగ్‌ను కేంద్ర బలగాల బందోబస్తు మధ్య జరిపించాలని వారు ఈసీకి విజ్ఞప్తి చేయనున్నారు.

ఈ మేరకు వారు కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ సునీల్ అరోరాకు వినతిపత్రాన్ని అందజేస్తారు. లోక్‌సభ ఉప ఎన్నిక ప్రచారం సందర్భంగా తిరుపతి గాంధీ రోడ్డులో చంద్రబాబు పర్యటిస్తోన్న సమయంలో ఆయనపై గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లు విసిరిన విషయం ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ప్రచార వాహనంపై నుంచి చంద్రబాబు ప్రసంగం ముగిసిన కొద్దిసేపటికే ఆయనపై రాళ్లు పడ్డాయి. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

https://telugu.oneindia.com/news/andhra-pradesh/tirupati-bypoll-tdp-mps-likely-to-meet-cec-over-allegedly-stones-pelted-on-chandrababu-291478.html

దీని వెనుక అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారంటూ టీడీపీ ఆరోపిస్తోంది. ఓడిపోతున్నామనే భయం, అక్కసుతో తమపై రాళ్లదాడికి పాల్పడినట్లు చంద్రబాబు చెబుతున్నారు. తనపై రాళ్లదాడిని నిరసిస్తూ ఆయన రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ఈ వ్యవహారం మొత్తాన్నీ కేంద్ర ఎన్నికల కమిషన్ కార్యాలయం దృష్టికి తీసుకెళ్లాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయించింది. ఈసీ సునీల్ అరోరా అపాయింట్‌మెంట్ లభించిందని, అందుకే ఈ మధ్యాహ్నం దేశ రాజధానికి బయలుదేరి వెళ్తారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.

రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్ర కుమార్, లోక్‌సభ సభ్యులు కింజరాపు రామ్మోహన్ నాయుడు (శ్రీకాకుళం), కేశినేని నాని (విజయవాడ), గళ్లా జయదేవ్ (గుంటూరు), ఇతర నాయకులు ఢిల్లీకి వెళ్తారని తెలిపాయి. ప్రచార సమయంలోనే వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఇలా రాళ్ల దాడులకు పాల్పడితే.. పోలింగ్ సమయంలో మరిన్ని దౌర్జన్యాలకు దిగుతారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. అందుకే- అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద కేంద్ర బలగాలతో బందోబస్తును ఏర్పాటు చేయాలని వారు ఈసీకి విజ్ఙప్తి చేస్తారని అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+