తిరుమల లడ్డూ వివాదం పై ప్రధానికి చంద్రబాబు కీలక సమాచారం..!?

తిరుమల లడ్డూ వివాదం పై ప్రధానికి చంద్రబాబు ఏం చెప్పారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా ప్రధాని తో ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశమయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాల పైన చర్చించారు. అమరావతికి రుణం, పోలవరానికి కేంద్ర సాయంతో పాటుగా విశాఖ రైల్వే జోన్.. స్టీల్ ప్లాంట్ అంశాల పైన చర్చకు వచ్చాయి. అదే సమయంలో తిరుమల లడ్డూ వివాదం పైన ప్రధానికి సీఎం చంద్రబాబు కీలక సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది.

ప్రధానితో భేటీ వేళ
ప్రధానితో సమావేశం సమయంలో సీఎం చంద్రబాబు కీలక అంశాలను ప్రస్తావించారు. విజయవాడ వరదల తరువాత ప్రధానితో చంద్రబాబు ఇదే తొలి భేటీ. విజయవాడ వరదలకు కారణాలు..జరిగిన నష్టం పైన వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలు..సహాయక ప్యాకేజీ గురించి వివరించినట్లు తెలుస్తోంది. కేంద్రానికి ఇప్పటికే జరిగిన నష్ట పైన నివేదక ఇచ్చారు. కేంద్రం నుంచి మరింతగా సాయం అందించాలని ప్రధానిని ముఖ్యమంత్రి చంద్రబాబు అభ్యర్ధించినట్లు సమాచారం. అదే విధంగా రాజధాని అమరావతి గురించి చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. ప్రధానితో జరిగిన సమావేశ వివరాలను చంద్రబాబు పార్టీ ఎంపీలకు వివరించారు.

Tirupati Laddu Controversy What Chandrababu Discussed with Modi

ప్రధానితో లడ్డూ అంశంపై
ఇక, విశాఖ రైల్వే జోన్ శంకుస్థాపనకు రావాల్సిందిగా ప్రధానిని చంద్రబాబు ఆహ్వానించారు. డిసెంబర్ లో ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఇదే భేటీలో తిరుమల లడ్డూ కల్తీ వివాదం పైన చర్చకు వచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. ఈ వ్యవహారం పైన జాతీయ స్థాయిలో చర్చ జరిగింది. ఈ వ్యవహారం పైన జగన్ వరుస మీడియా సమావేశాలు నిర్వహించారు. చంద్రబాబు రాజకీయం కోసమే ఇలాంటి వివాదాస్పద ఆరోపణలు చేస్తున్నారంటూ జగన్ తన వాదనను అన్ని హిందూ సంస్థలు, ప్రధానితో సహా కేంద్ర మంత్రులకు అందించారు. దీంతో, ఇప్పుడు ప్రధానితో సమావేశం సమయంలో చంద్రబాబు ఈ విషయం పైన వివరణ ఇచ్చినట్లు తెలుస్తోంది.

సుప్రీం ఆదేశాలతో
లడ్డూ వివాదంలో భక్తుల నుంచి వచ్చిన ఫిర్యాదులు..కల్తీ నెయ్యి కాంట్రాక్టర్లు..గుర్తించిన విధానం.. లాబ్ నివేదికలు..తిరుమలలో తీసుకున్న చర్యలను వివరించినట్లు సమాచారం. అదే సమయంలో సుప్రీంకోర్టు ఈ వ్యవహారం పైన సీబీఐ డైరెక్టర్ కు విచారణ కమిటీ బాధ్యతలు అప్పగిస్తూ రాష్ట్ర అయిదుగురు సభ్యుల కమిటీ ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో ఏపీ నుంచి ఇద్దరు అధికారులను ప్రభుత్వం నియమించనుంది. తిరుమలలో పూర్తి ప్రక్షాళన దిశగా నిర్ణయాలు అమలు చేస్తున్నట్లు ప్రధానికి ముఖ్యమంత్రి వివరించారని సమాచారం. సుప్రీం నియమించిన సిట్ త్వరలోనే విచారణ ప్రారంభించే అవకాశం ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+