వాటిపై సీఎం చంద్రబాబు ఏమన్నారంటే..

హిందువులు అత్యంత పవిత్రంగా జరుపుకునే తొలి ఏకాదశి పండుగ ఈరోజు. తొలి ఏకాదశి పండుగ రోజు ప్రముఖ వైష్ణవ క్షేత్రాలన్నీ భక్తుల రద్దీతో కిటకిటలాడుతున్నాయి. ఈరోజు ప్రతి ఒక్కరు ఉదయాన్నే నిద్ర లేచి, స్నానమాచరించి విష్ణుమూర్తికి పూజాధికాలు నిర్వహిస్తారు. అత్యంత భక్తిశ్రద్ధలతో ఉపవాస దీక్షలను ఆచరిస్తారు.

ఈరోజు మొహర్రం
ఇటు హిందువులకు మాత్రమే కాకుండా ఈరోజు మహమ్మదీయులకు కూడా పవిత్రమైన రోజు. మహమ్మదీయులు మొహర్రం పర్వదినాన్ని జరుపుకునే రోజు. ఈ రోజు మొహరం పండుగ సందర్భంగా ముస్లింలు పీర్లను ప్రతిష్టించి ప్రత్యేక ప్రార్థనలు చేసి పీర్లను ఊరేగిస్తారు. ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా పీర్లను ఊరేగించే వేడుక జరుగుతుంది. ఈ వేడుకలో భాగంగా ఈరోజు అల్లాను ఆరాధించే సమయంలో బెల్లం తో తయారు చేసిన నైవేద్యాలను సమర్పిస్తారు.

Today is two holidays Toli Ekadashi and Moharram Chandrababu Wishes to hindus and muslims

మొహర్రం నుండి ముస్లింల ఇస్లామిక్ క్యాలెండర్ ప్రారంభం
మొహర్రం అంటే ఒక పండుగ దినం కాదు ఇది అమరవీరుల త్యాగాలను, 14 శతాబ్దాల క్రితమే ప్రజాస్వామ్యం కోసం మానవ హక్కుల కోసం జరిగిన చారిత్రాత్మక పోరాటాన్ని గుర్తు చేసుకోవడం కోసం నిర్వహించుకునే పవిత్ర దినం. ఇస్లామిక్ క్యాలెండర్ ప్రకారం మొహర్రం నుంచి కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది.

శుభాకాంక్షలు చెప్పిన చంద్రబాబు
ఇదిలా ఉంటే ఏపీ ముఖ్యమంత్రి టిడిపి జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ముస్లిం సోదరులకు, హిందువులకు ఒకే రోజు కలిసి వచ్చిన రెండు విశేష పర్వదినాల సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు. ఎక్స్ వేదికగా స్పందించిన చంద్రబాబు పవిత్ర మొహర్రం పుణ్య దినాల సందర్భంగా ముస్లిం సోదర సోదరీమణులకు శుభం కలిగేలా చూడాలని ఆ అల్లాహ్ ను కోరుకుంటున్నాను అంటూ పేర్కొన్నారు.

ఇదే మన కర్తవ్యం కావాలని ముస్లింలకు చెప్పిన చంద్రబాబు
అమరవీరుడు ఇమామ్ హుస్సేన్ సమాజం కోసం ప్రాణత్యాగం చేశారు తప్ప అన్యాయమైన అధికారానికి తలొగ్గలేదని ఇదే ఆదర్శంగా పరులక్షేమాన్ని కాంక్షిస్తూ జీవితాన్ని గడపడమే మన కర్తవ్యం కావాలి అని అప్పుడే మన సమాజం వికసిస్తుంది అని చంద్రబాబు పోస్ట్ పెట్టారు. ముస్లింలకు చంద్రబాబు శుభాకాంక్షలు తెలియజేశారు.

తొలి ఏకాదశి పండుగకు హిందువులకు చంద్రబాబు శుభాకాంక్షలు
ఇక హిందువులకు సైతం శుభాకాంక్షలు తెలియజేసిన చంద్రబాబు హిందువులకు ఎంతో ప్రత్యేకమైన తొలి ఏకాదశి పండుగ సందర్భంగా ప్రజలందరికీ శుభాకాంక్షలు అంటూ పేర్కొన్నారు. దీక్షలు చేస్తున్న భక్తులందరికీ ఆ భగవంతుడు ఆనంద, ఆరోగ్య, ఐశ్వర్యాలను ప్రసాదించాలని తాను కోరుకుంటున్నానని చంద్రబాబు సోషల్ మీడియా పోస్ట్ ద్వారా తెలియజేశారు. ఇక ఒకే రోజు రెండు విశిష్టమైన పండుగలు రావడంతో అటు హిందువులు, ఇటు ముస్లింలు ఈ రెండు పర్వదినాలను అత్యంత భక్తి భావనతో, శ్రద్ధాసక్తులతో జరుపుకుంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+