ఈ 3 స్టాక్స్ కోసం ఎగబడుతున్న జనం
స్టాక్ మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతున్న వేళ పెట్టుబడిదారులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. కీలకమైన రంగాల్లో అమ్మకాల ఒత్తిడి కనపడుతోంది. రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా వడ్డీ రేట్ల నిర్ణయంతోపాటు డాలర్ పుంజుకోవడం కూడా వీటికి కారణంగా చెప్పుకోవచ్చు. బొంబాయి స్టాక్స్ ఎక్స్చేంజి సూచీ సెన్సెక్స్ 30 పాయింట్ల నష్టంతో 62 వేల 815 మార్క్ వద్ద ట్రేడవుతుండగా నిఫ్టీ 50 సూచీ 10 పాయింట్లు కోల్పోయి 18 వేల 624 వద్ద ట్రేడవుతోంది. ఇటువంటి పరిణామాల మధ్య కూడా మూడు స్టాక్స్ బాగా రాణిస్తూ ట్రెండింగ్ లోకి దూసుకువెళ్లాయి. అందుకు కారణాలేంటనేది ఇప్పుడు తెలుసుకుందాం.
ఏథర్ ఇండస్ట్రీస్ (Aether Industries)
ఈ కంపెనీ సౌదీ ఆరామ్ కో టెక్నాలజీస్ సంస్థతో లైసెన్స్ అగ్రిమెంట్‌పై సంతకం చేసింది. దీంతో దీని షేరు ఒక్కసారిగా పెరిగింది. ఈరోజు ట్రేడింగ్‌లో 7 శాతం పెరగడంతోపాటు సరికొత్త 52 వారాల గరిష్ఠ స్థాయి రూ.1,055.95కు చేరుకుంది. కన్వర్జ్ పాలియోల్ సాంకేతికతను విస్తరించేందుకు ఒప్పందం కుదుర్చుకుంది.

హిందుస్తాన్ ఎరోనాటిక్స్ (Hindustan Aeronautics)
సెంట్రల్ గవర్నమెంట్ కు చెందిన రక్షణ ఉత్పత్తుల తయారీ సంస్థ హిందుస్తాన్ ఎరోనాటిక్స్ ఇటీవలే కీలక ప్రకటన చేసింది. ఈక్విటీ షేర్లను విభజించే నిర్ణయంపై జూన్ 27న బోర్డు సమావేశమవబోతోందని వెల్లడించింది. ఆరంభంలోనే ఈ కంపెనీ షేరు 3 శాతం పెరిగింది.
గ్రీన్‌లామ్ ఇండస్ట్రీస్ (Greenlam Industries)
తమిళనాడులోని పరిశ్రమలో కమెర్షియల్ ప్రొడక్షన్ పనులను ఈ కంపెనీ ప్రారంభించింది. దీంతో ఈ కంపెనీ స్టాక్ సరికొత్త 52 వారాల గరిష్టానికి చేరుకుంది. ఆరంభంలోనే 10 శాతం పెరగడంతో కొనేందుకు పెట్టుబడిదారులు ఎగబడ్డారు. తమిళనాడు దిండివనమ్‌లో ఏర్పాటు చేసిన మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్ కెపాసిటీ ఏడాదికి 18.9 మిలియన్ స్క్వేర్ మీటర్లుగా ఉంటుంది. సామర్థ్యాన్ని పూర్తిగా వినియోగించుకుంటే సంవత్సరానికి రూ.400 కోట్ల ఆదాయం వస్తుందని కంపెనీ పేర్కొంది.












Click it and Unblock the Notifications