Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

శ్రీశైలం వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్

మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని శ్రీశైలానికి వెళ్లే లక్షలాదిమంది భక్తులకు గుడ్ న్యూస్ అందింది. నేటి నుండి నాలుగు రోజుల పాటు అంటే.. 16వ తేదీ వరకు శ్రీశైలం ఆలయం సమీపంలోని జాతీయ రహదారి 765 టోల్ గేట్ వద్ద ఎటువంటి ఫీజూ చెల్లించనక్కర్లేదు. శ్రీశైలం వెళ్లే భక్తులకు ఈ టోల్ గేట్ ఫీజు నుంచి మినహాయింపు ఉంది. ఆ తర్వాత టోల్ ఫీజును యధాతథంగా పునరుద్ధరిస్తారు. ఈ నాలుగు రోజుల పాటూ భక్తులకు ఉచితంగా లడ్డూ ప్రసాదాలను అందించనున్నారు.

భక్తుల ప్రయాణాన్ని సులభతరం చేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా తెలిపారు. దీంతో పాటు- రాత్రివేళ ప్రయాణానికి కూడా అనుమతి ఇచ్చినట్లు ఆమె వెల్లడించారు. ఈ నాలుగు రోజులు వాహన రాకపోకలకు నిరంతరాయంగా అనుమతి ఉంటుందని వివరించారు. జిల్లా ఎస్పీ సునీల్ షోరణ్ తో కలిసి కమాండ్ కంట్రోల్ రూమ్ లో కలెక్టర్ విలేకరులతో మాట్లాడారు. భక్తుల రద్దీ, బ్రహ్మోత్సవ ఏర్పాట్లను పర్యవేక్షించారు.

Toll Free for Srisailam Pilgrims During Maha Shivaratri Brahmotsavams and Free Laddu Prasadam to them

బ్రహ్మోత్సవాలు ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటివరకు 2,59,050 మంది భక్తులు శ్రీ మల్లికార్జున స్వామి, భ్రమరాంబ అమ్మవారి దర్శనం చేసుకున్నారు. సుమారు 75,000 మంది పుణ్యస్నానాలు ఆచరించారు. రాబోయే రెండు రోజులలో భక్తుల రద్దీ మరింత పెరిగే అవకాశం ఉండటంతో, ఇందుకనుగుణంగా అదనపు ఏర్పాట్లు చేపట్టినట్లు రాజకుమారి గనియా తెలిపారు. భక్తుల రవాణా వసతి కోసం నంద్యాల నుంచి శ్రీశైలం మార్గంలో ప్రతి అయిదు నిమిషాలకు ఒక బస్సు అందుబాటులో ఉందని అన్నారు.

మహా శివరాత్రి రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నుండి 1,800 బస్సులు, తెలంగాణ రోడ్డు రవాణా సంస్థ నుండి 1,000, ఇతర ప్రాంతాల నుండి 3,000 బస్సులను అందుబాటులోకి తీసుకుని రానున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఆర్టీసీ బస్సులు, ట్రాఫిక్, ప్రైవేట్ వాహనాల రాకపోకలను క్రమబద్దీకరించడానికి, వాటిని పార్క్ చేయడానికి ప్రత్యేక పార్కింగ్ స్థలాలను గుర్తించామని పేర్కొన్నారు. అటవీ మార్గాల్లోని వన్యప్రాణుల రక్షణకు వాహనదారులు 30 కిలోమీటర్ల వేగ పరిమితిని తప్పనిసరిగా పాటించాలని రాజకుమారి గనియా విజ్ఞప్తి చేశారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+