భూమా వారసురాలితో మంచు మనోజ్ పెళ్లి- డేట్ ఫిక్స్..!!

ప్రముఖ నటుడు మంచు మనజ్ త్వరలో పెళ్లిపీటలు ఎక్కనున్నారు. టీడీపీ నాయకురాలు, మాజీ మంత్రి భూమా అఖిలప్రియ చెల్లెలు భూమా మౌనిక రెడ్డిని రెండో వివాహం చేసుకోనున్నారు.

అమరావతి: ప్రముఖ నటుడు మంచు మనోజ్‌ పెళ్లి పీటలు త్వరలో ఎక్కబోతోన్నారు. భూమా కుటుంబ వారసురాలిని పెళ్లి చేసుకోనున్నారు. త్వరలో కొత్త జీవితాన్ని ప్రారంభించబోతోన్నట్లు ఇదివరకే ప్రకటించారు మనోజ్. ఇది ఆయనకు రెండో వివాహం. 2016లో ప్రణతిని పెళ్లి చేేసుకున్నారు. అది విడాకులకు దారి తీసింది. 2019లో విడాకులు తీసుకున్నారు.

భూమా అఖిల చెల్లెలితో..

భూమా అఖిల చెల్లెలితో..

ఇప్పుడు మౌనిక రెడ్డితో కొత్త జీవితాన్ని పంచుకోనున్నారు. తెలుగుదేశం పార్టీ నాయకురాలు, మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ చెల్లెలు భూమా మౌనిక రెడ్డిని త్వరలో పెళ్లి చేసుకోబోతోన్నాడంటూ ఇదివరకు వార్తలు వచ్చిన నేపథ్యంలో దాన్ని నిజం చేయనున్నారు. మౌనిక రెడ్డితో మంచు మనోజ్ కొద్దిరోజులుగా రిలేషన్ షిప్ లో ఉన్నాడని, వీరిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారని ఇదివరకు వార్తలు చక్కర్లు కొట్టాయి.

కొత్త జీవితంపై పలు సందర్భాల్లో..

కొత్త జీవితంపై పలు సందర్భాల్లో..

గత ఏడాది మంచు మనోజ్- భూమా మౌనిక రెడ్డి కలిసి సికింద్రాబాద్ సీతాఫల్‌ మండిలోని వినాయకుడి ఆలయానికి వెళ్లారు. అప్పుడే వారిద్దరూ రిలేషన్ షిప్ లో ఉన్నారనే విషయం బయటికొచ్చింది. డిసెంబర్ లో కడపలోని అమీన్ పీర్ దర్గాను కూడా మనోజ్ సందర్శించారు. అక్కడా తన కొత్త జీవితం గురించి బయటపెట్టారు. త్వరలోనే కొత్త జీవితాన్ని ప్రారంభించనున్నట్లు వెల్లడించారు.

మార్చి 3న

మార్చి 3న

ఈ సారి జంటగా కడప దర్గాను సందర్శిస్తాననీ పేర్కొన్నారు. ఈ క్రమంలో మంచు మనోజ్- భూమా మౌనిక రెడ్డి వివాహ విషయంలో కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. మార్చి 3వ తేదీన వారిద్దరూ పెళ్లి పీటలు ఎక్కబోతోన్నారు. మంచు- భూమా కుటుంబాలకు చెందిన అతి కొద్దిమంది బంధుమిత్రులు, సన్నిహితులు మాత్రమే ఈ పెళ్లికి హాజరయ్యే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు.

భూమా కుటుంబంపై

భూమా కుటుంబంపై

నంద్యాల జిల్లా ఆళ్లగడ్డకు చెందిన దివంగత భూమా నాగిరెడ్డి-శోభా నాగిరెడ్డి దంపతుల రెండో కుమార్తె మౌనిక రెడ్డి. గతంలో భూమా నాగిరెడ్డిని స్మరించుకుంటూ ట్వీట్ కూడా చేశారు మంచు మనోజ్. నాగిరెడ్డిని గొప్ప నాయకుడిగా అభివర్ణించారు. ఒక గొప్ప కొడుకు, భర్త, తండ్రి అంతకుమించి ఒక గొప్ప మనుసు ఉన్న వ్యక్తిగా కీర్తించారు. ఆయన మన మధ్య లేకపోయినా, ఆయన అశీసులు మాత్రం ఎప్పుడు మనపైనే ఉంటాయి' అంటూ ఎమోషనల్ గా ట్వీట్ చేశారు.

వాట్ ద ఫిష్..

వాట్ ద ఫిష్..

కొంత కాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్నారు మంచు మనోజ్. 2017లో విడుదలైన ఒక్కడు మిగిలాడు ఆయన నటించిన చివరి మూవీ. ఆ తరువాత 'అహం బ్రహ్మాస్మి అనే ప్రాజెక్ట్ ను ప్రకటించారు. అది పట్టాలెక్కనట్టే కనిపిస్తోంది. దీనితో వాట్ ద ఫిష్ అనే సినిమాను ప్రకటించారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుపుకొంటోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+