అయోధ్య ఆలయం బ్యాక్‌‌గ్రౌండ్‌లో: ప్రభాస్‌కు అరుదైన ఆహ్వానం: పాన్ ఇండియా హీరో అంటే ఇదీ..!!

అమరావతి: టాలీవుడ్ యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్‌కు అరుదైన ఆహ్వానం అందింది. ఆ ఆహ్వానాన్ని అందుకున్న మొట్టమొదటి సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ ఆయన ఒక్కడే. ఇదివరకు బాలీవుడ్ స్టార్ హీరోలు అజయ్ దేవ్‌గణ్, అక్షయ్ కుమార్, జాన్ అబ్రహంలకు మాత్రమే ఈ అవకాశం దక్కింది. ఈ సారి ప్రభాస్‌కు ఆ ఛాన్స్ లభించింది. దక్షిణాది చలన చిత్ర పరిశ్రమల్లో తమకు ప్రభాస్‌ కంటే మరో హీరో పేరు ప్రత్యామ్నాయంగా కనిపించట్లేదని నిర్వాహకులు వ్యాఖ్యానించడం ఆయనకు ఉన్న ప్రాధాన్యతను చాటి చెప్పినట్టయింది.

రెడ్ ఫోర్ట్‌లో..

రెడ్ ఫోర్ట్‌లో..

ప్రతి సంవత్సరం దేశ రాజధానిలోని రెడ్ ఫోర్ట్ ఆవరణలో అత్యంత వైభవంగా దసరా పండగ వేడుకలు ఏర్పాటవుతుంటాయనే విషయం తెలిసింద. ఢిల్లీ లవ్ కుశ్ రామ్‌లీలా కమిటీ ఈ వేడుకలను నిర్వహిస్తుంటుంది. వేడుకల ముగింపురోజు నాడు రావణాసురుడి దిష్టిబొమ్మను దగ్ధం చేయడాన్ని ఆనవాయితీగా పెట్టుకుంది. గడ్డి, ఇతర వస్తువులతో తయారు చేసిన 10 తలల రావణాసురుడి భారీ విగ్రహాన్ని దగ్ధం చేయడానికి సెలెబ్రిటీస్‌లను ఆహ్వానిస్తుంటుంది ఈ కమిటీ.

 ప్రభాస్‌కు ఛాన్స్..

ప్రభాస్‌కు ఛాన్స్..

ఇదివరకు బాలీవుడ్ స్టార్ హీరోలు అజయ్ దేవ్‌గణ్, అక్షయ్ కుమార్, జాన్ అబ్రహం.. ఈ కార్యక్రమంలో చీఫ్ గెస్ట్‌గా పాల్గొన్నారు. రావణాసురుడి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఇప్పుడా అవకాశం ప్రభాస్‌కు లభించింది. అక్టోబర్ 5వ తేదీన రెడ్ ఫోర్ట్ ఆవరణలో ఏర్పాటు చేయబోయే రావణాసురుడి దిష్టిబొమ్మను దగ్ధం చేయడానికి ఈ సంవత్సరం ప్రభాస్‌ను ఎంపిక చేసినట్లు లవ్ కుశ్ రామ్‌లీలా కమిటీ ఛైర్మన్ అర్జున్ కుమార్ వెల్లడించారు.

ఆదిపురుష్‌తో..

ఆదిపురుష్‌తో..

బాలీవుడ్ ప్రిస్టేజియస్ ఫిల్మ్ ఆదిపురుష్‌లో ప్రభాస్ నటిస్తోన్న విషయం తెలిసిందే. ఇందులో శ్రీరామచంద్రుడి పాత్రను ప్రభాస్ పోషించారు. లక్ష్మణుడిగా సన్నీ సింగ్, సీతగా కృతి సనన్, రావణాసురుడిగా సైఫ్ అలీ ఖాన్ నటించారు. హనుమంతుడి క్యారెక్టర్‌లో దేవ్‌దత్ నాగే కనిపించనున్నారు. వచ్చే సంవత్సరం జనవరి 12వ తేదీన సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతోందీ భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ.

అయోధ్య సెట్స్‌..

అయోధ్య సెట్స్‌..

ఆదిపురుష్‌లో శ్రీరాముడి పాత్రలో నటించిందు వల్లే ప్రభాస్‌ను ఈ కార్యక్రమానికి ఎంపిక చేశామని అర్జున్ కుమార్ చెప్పారు. ఈ సంవత్సరం రావణాసురుడి దిష్టిబొమ్మను దగ్ధం చేయడానికి ప్రభాస్‌ను ఆహ్వానించాలని తాము అప్పుడే నిర్ణయం తీసుకున్నామని అన్నార. రావణుడితో పాటు కుంభకర్ణుడు, ఇంద్రజిత్ దిష్టిబొమ్మలను ప్రభాస్ విల్లంబులతో దగ్ధం చేస్తారని చెప్పారు. అయోధ్యలో వైభవంగా రూపుదిద్దుకుంటోన్న రామాలయాన్ని బ్యాక్‌గ్రౌండ్‌‌ సెట్స్ వేస్తామని అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+