రేపు విజయవాడలో వ్యూహం ప్రీరిలీజ్ ఈవెంట్ -సినిమాలో ఏం ఉందో చెప్పేసిన వర్మ..!
ఏపీ సీఎం వైఎస్ జగన్ రాజకీయ జీవితంలో ఎదురైన వాస్తవ ఘటనల ఆధారంగా టాలీవుడ్ దర్శకుడు రాంగోపాల్ వర్మ రూపొందించిన వ్యూహం చిత్రం ఈ నెలాఖరులో విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో విజయవాడలో రేపు సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. నగరంలోని ఇందిరా గాంధీ స్టేడియంలో రేపు నిర్వహించనున్న వ్యూహం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏర్పాట్లను రాంగోపాల్ వర్మ, చిత్ర నిర్మాత దాసరి కిరణ్ కుమార్ పరిశీలించారు
అనంతరం రాంగోపాల్ వర్మ వ్యూహం చిత్రం రూపకల్పన, ప్రీరిలీజ్ ఈవెంట్ వివరాలు వెల్లడించారు. సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వైసీపీ నాయకులు ఎమ్మేల్యేలు వస్తారని ఆయన తెలిపారు. ఈనెల 29వ తేదీన వ్యూహం సినిమాను రిలీజ్ చేయనున్నట్లు వర్మ తెలిపారు. వ్యూహం రాజకీయ వ్యూహం కోసం తీయలేదని, వేరే వాళ్ళ మీద వ్యూహం తీసాం కానీ మా మీద మాకు వ్యూహం లేదన్మారు. చంద్రబాబు అరెస్ట్, వివేకా హత్య వంటి సన్నివేశాలు ఇందులో ఉంటాయన్నారు.

వ్యూహం చిత్రంలో చంద్రబాబు, పవన్, చిరంజీవి , షర్మిల, సోనియా, రాహుల్ పాత్రలు ఉంటాయని వర్మ తెలిపారు. 2009 నుంచి 2019 ఎన్నికల వరకు జగన్ కు సంబందించిన అన్ని ఘట్టాలు ఇందులో చూపిస్తామన్నారు. జనవరి నెలలో వ్యూహం కి కొనసాగింపు గా "శపథం " రిలీజ్ చేస్తున్నామన్నారు. తమ సినిమాలకు ఎన్నికల కోడ్ అడ్డు రాదన్నారు. జగన్ ఆలోచనా విధానం నచ్చింది కాబట్టే సినిమాలు తీస్తున్నట్లు వెల్లడించారు. శపథం లో జగన్ సీఎం ఆయ్యాక ఆయన ఫెయిల్యూర్స్, సక్సెస్ లు సినిమాలో చూపిస్తామన్నారు.












Click it and Unblock the Notifications