Ramgopal Varma: వర్మ అరెస్టుకు రంగం సిద్ధం-హైదరాబాద్ ఇంట్లో పోలీసులు..
ఏపీలో గత వైసీపీ ప్రభుత్వంలో వైఎస్ జగన్ పై తాను తీసిన వ్యూహం చిత్రం ప్రమోషన్ లో భాగంగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ పై ఎక్స్ లో వరుసగా పోస్టులు పెట్టిన టాలీవుడ్ దర్శకుడు రాంగోపాల్ వర్మ కు ఇప్పుడు కష్టాలు తప్పడం లేదు. ప్రకాశం జిల్లా మద్దిపాడులో ఈ వ్యవహారంపై దాఖలైన ఫిర్యాదుతో పోలీసులు ఆయన్ను విచారణకు రావాలని గతంలో నోటీసులు ఇవ్వగా రాలేదు. దీంతో ఇవాళ రావాలని మరోసారి నోటీసులు పంపారు. ఆ లోపు హైకోర్టును ఆశ్రయించారు.
గతంలో వర్మ సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులపై ప్రకాశం జిల్లా మద్దిపాడులో నమోదైన కేసులో విచారణ కావాలని గతంలో హైదరాబాద్ కు వెళ్లి పోలీసులు నోటీసులు ఇచ్చారు. కానీ విచారణకు రాకుండా లాయర్ ను పంపిన వర్మ.. నాలుగు రోజుల సమయం ఇవ్వాలని కోరారు. దీనిపై స్పందించిన పోలీసులు ఆరు రోజుల సమయం ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఇవాళ విచారణకు హాజరు కావాల్సి ఉంది. కానీ గతంలో లాయర్ ను పోలీసుల వద్దకు పంపిన వర్మ.. అదే రోజు హైకోర్టులో బెయిల్ పిటిషన్ కూడా వేయించారు.

ఈ కేసులో తనను అరెస్టు చేయకుండా ఉత్తర్వులు ఇవ్వాలని గతంలో ఏపీ హైకోర్టును ఆశ్రయించిన రాంగోపాల్ వర్మకు షాక్ తప్పలేదు. వర్మ అరెస్టు కాకుండా ఉత్తర్వులు ఇవ్వలేమని హైకోర్టు అప్పట్లో స్పష్టం చేసింది. అయితే విచారణకు పిలిచి అరెస్టు చేస్తారనే భయంతో ఈసారి బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరుగుతోంది. ఈ నేపథ్యంలో విచారణకు రాలేనని ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీసులకు వర్మ సమాచారం ఇచ్చారు. దీంతో హైకోర్టు బెయిల్ తీర్పు ఆధారంగా వర్మపై తదుపరి చర్యలు ఉండే అవకాశముందని భావించారు. కానీ పోలీసులు ఇవాళ వర్మ అరెస్టు కోసం హైదరాబాద్ బయలుదేరి వెళ్లారు.












Click it and Unblock the Notifications