ఏపీ పోలీసులకు రాంగోపాల్ వర్మ షాక్-ఇక అరెస్టా? బెయిలా?
ఏపీలో గత వైసీపీ ప్రభుత్వంలో వైఎస్ జగన్ పై తాను తీసిన వ్యూహం చిత్రం ప్రమోషన్ లో భాగంగా సోషల్ మీడియాలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ పై తీవ్ర వ్యాఖ్యలు చేసిన టాలీవుడ్ దర్శకుడు రాంగోపాల్ వర్మకు చుక్కలు కనిపిస్తున్నాయి.
ఇప్పటికే ఆయనపై ప్రకాశం జిల్లా మద్దిపాడులో దాఖలైన ఫిర్యాదు నేపథ్యంలో కేసు నమోదు చేసిన పోలీసులు.. హైదరాబాద్ వెళ్లి మరీ విచారణకు రావాలని నోటీసులు ఇచ్చారు.

మాజీ సీఎం వైఎస్ జగన్ పై గతంలో వ్యూహం చిత్రం తీసిన రాంగోపాల్ వర్మ ప్రమోషన్ లో భాగంగా సోషల్ మీడియాలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ పై పెట్టిన పోస్టులు వివాదాస్పదమయ్యాయి. వీరిని వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ అప్పట్లో వర్మ పెట్టిన పోస్టులపై ప్రకాశం జిల్లాలో కేసు నమోదు కావడంతో పోలీసులు ఇవాళ విచారణకు రావాలని నోటీసులు పంపారు. అయితే వర్మ మాత్రం విచారణకు డుమ్మా కొట్టారు. అంతే కాదు తనకు నాలుగు రోజుల సమయం కావాలని పోలీసుల్ని కోరారు.
ఇప్పటికే ఈ కేసులో తనను అరెస్టు చేయకుండా ఉత్తర్వులు ఇవ్వాలని ఏపీ హైకోర్టును ఆశ్రయించిన రాంగోపాల్ వర్మకు చుక్కెదురైంది. వర్మ అరెస్టు కాకుండా ఉత్తర్వులు ఇవ్వలేమని హైకోర్టు తేల్చిచెప్పేసింది. అంతే కాదు కావాలంటే ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకుంటే విచారిస్తామని కూడా హైకోర్టు తెలిపింది. అయితే వర్మ ఇప్పటివరకూ ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకోకపోవడం, చివరి నిమిషంలో విచారణకు గైర్హాజరు కావడంతో ఆయన్ను అరెస్టు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే వర్మ విజ్ఞప్తిని పోలీసులు అంగీకరిస్తే మాత్రం నాలుగు రోజుల తర్వాత విచారణ జరగనుంది.
-
‘ధురంధర్2’ దెబ్బకు ‘పుష్ప2’ రికార్డులు గల్లంతు -
రామ్ చరణ్ బర్త్ డే- మెగాస్టార్ వెరీ యూనిక్ సెలబ్రేషన్స్ -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
సమంత "వావ్" వీడియో వైరల్..! -
మరో సూపర్ కాన్సెప్ట్‌తో వస్తున్న యంగ్ హీరో..థియేటర్లలో రచ్చే..! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
రామ్ చరణ్ బర్త్‌డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
హనీమూన్ లో కొత్త జంట, ప్రైవేట్ రిసార్ట్‌లో ఆనంద క్షణాలు -
నందమూరి బాలకృష్ణకు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు.. జై బాలయ్య !! -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..!












Click it and Unblock the Notifications